ఓం గణేశాయనమః – గురుభ్యోనమః
__/\__
నారాయణం నమస్కృత్య – నరంచైవ నరోత్తమమ్|
దేవీం
సరస్వతీం వ్యాసం – తతో జయముదీరయేత్||
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తి గారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్)
(1994) పుస్తకము ఆధారముగా.]
1. కురు క్షేత్ర సంగ్రామము, ద్రౌపదీ స్వయంవర సందర్భం, కుమారాస్త్ర విద్యాప్రదర్శనా సమయములలో కాకుండా కర్ణుడు అర్జునునితో యుద్ధం చేసినదెప్పుడు?
2. ఉప కీచకులెంత మంది? వారిని ఎవరు చంపారు?
3. శమీవృక్షం మీద ధనుర్బాణాలు పెట్టి వాటిని ధర్మరాజు ఏమని ప్రార్ధించాడు?
4. అశ్వత్థామ జెండా గుర్తు ఏమిటి?
5. విరాటుని కొలువులో చేరేముందు పాండవులకు సేవా ధర్మాలు చెప్పినదెవరు?
--------------------------------------------------------------------------------

సమాధానములు
(జవాబులు):
1. ఉత్తరగోగ్రహణ సమయం. – విరాట పర్వము – పంచమాశ్వాసము – 83,86 పద్యములు & 96వచనము
క||ఇరువురువీరులు ని ట్లొం
డొరవులఁ దలపడుట సూచి యుత్కట మగున
చ్చెరువాటుఁ గౌతుకంబు న
డర నూరక యుండె నయ్యెడం గురుసేనల్. (83)
క॥రవితనయుబానములు వా
1. ఉత్తరగోగ్రహణ సమయం. – విరాట పర్వము – పంచమాశ్వాసము – 83,86 పద్యములు & 96వచనము
క||ఇరువురువీరులు ని ట్లొం
డొరవులఁ దలపడుట సూచి యుత్కట మగున
చ్చెరువాటుఁ గౌతుకంబు న
డర నూరక యుండె నయ్యెడం గురుసేనల్. (83)
సవనందనుఁ బొదివినపుడు సంతోషముఁ ద
ద్వివిధాస్త్రము లతనిపైఁ
గవియ విశాదంబు
నొందుఁ గౌరవసేనల్. (86)
వ॥అనుచు వాలమ్ములు గురిసిన నర్జునుండును గుపితుం డై
గాండీవవిక్షేపక్షోభిత నభోభగుం డగుచుం
గానీనుపై ననానిశితవిశిఖంబులు నినిచె న ట్లయ్యిరువురును
దేవాసురసంగ్రామసాదృశ్యవిక్రమప్రక్రియం
బొలిచి రట్టిసమయంబున. (96)
2. 105 మంది. అందరినీ భీముడే చంపాడు. - విరాట పర్వము – తృతీయాశ్వాసము – 29 పద్యము & 30
వచనము
ఉ||సూతులు భీతు లై ద్రుపదసూతిసమేతము గాఁగ నగ్రజ
ప్రేతము వైచి వీటిదెసఁ బెల్లుగఁ బాఱఁ దొడంగినన్ వడిన్
వాతసుతుండు ముట్టికొని వారి బడల్పడ వ్రేసి యందఱం
జేతులతీఁట వో నుఱుముసేసె విశృంఖలవిక్రమంబునన్. (29)
వ॥ఇవ్విధంబున నూటయేవు రుపకీచకులను సమయించి శమితక్రోధుం డై వచ్చి పాంచాలీబంధమోక్షంబు
ఉ||సూతులు భీతు లై ద్రుపదసూతిసమేతము గాఁగ నగ్రజ
ప్రేతము వైచి వీటిదెసఁ బెల్లుగఁ బాఱఁ దొడంగినన్ వడిన్
వాతసుతుండు ముట్టికొని వారి బడల్పడ వ్రేసి యందఱం
జేతులతీఁట వో నుఱుముసేసె విశృంఖలవిక్రమంబునన్. (29)
గావించి యింక నిశ్చితంబున సుదేష్ణమందిరంబునకుం
జను మని యవ్వెలంది వీడుకొలిపి తానును
వే ఱొకమార్గంబున మహానస గృహంబున కరుగుదెంచెం
…..(30)
3. నాకూ అర్జునునకూ తప్ప ఎవరికీ కనబడరాదనీ, భీమునికి అసలే కనబడరాదనీ ప్రార్ధించాడు. -
విరాట పర్వము – ప్రథమాశ్వాసము – 176 & 177 పద్యములు.
క||నరునకు నాకుం దక్కఁగ
నొరులకు మీరూపు సూప కున్నది విషవి
స్ఫురితభుజగభంగి భయం
కర్మూర్తులు దాల్చియుండఁగా వలయుఁ జుఁడీ. (176)
ఉ||భీముఁడు ధార్తరాష్ట్రకులభీషణరోషుఁడు చిత్త మెప్పు డె
ట్లై మద మెత్తునో యతనియాగ్రహవృత్తికి లోను గాక మీ
రేమెయి నైన వంచన వహించి తొలంగుట మత్సమీహితం
బేమఱ కుండఁ గా వలయు నివ్విషమాబ్దములోన నాతనిన్. (177)
4. సింహలాంగూలము. (లాంగూలము=తోక) - విరాటపర్వము – పంచమాశ్వాసము – 4 పద్యము
సీ||కాంచనమయవేదికాకనత్కేతనోజ్జ్వలవిభ్రమమువాఁడు కలశజుండు
సింహలాంగూల భూషితనభోభాగకేతుప్రేంఖణమువాఁడు ద్రోణసుతుఁడు
గనకగోవృషసాంద్రకాంతిపరస్ఫుటధ్వజసముల్లాసంబువాఁడు కృపుఁడు
లలితకంబు ప్రభాకలిత్పతాకావిహారంబువాఁడు రాధాత్మజుండు
తే||మణిమయోరగరుచిజాలమహితమైన
పడగవాఁడు కురుక్షితిపతి మహోగ్ర
శిఖరఘనతాళతరు వగుసిడమువాఁడు
సురనదీసూనుఁ డేర్పడఁ జూచికొనుము. (4)
5. పాండవుల పురోహితుడు ధౌమ్యుడు పాండవులకు సేవా ధర్మములను చెప్పెను. - విరాటపర్వము –
ప్రథమాశ్వాసము
– 121 – 140 పద్యములు &
120&141 వచనములు.
వ॥కావున మీకు నప్రమాదార్థంబుగా నానేర్చినవిధంబున నుపదేశం బవశ్య కర్తవ్యంబు రాజులం గొలిచి
వ॥కావున మీకు నప్రమాదార్థంబుగా నానేర్చినవిధంబున నుపదేశం బవశ్య కర్తవ్యంబు రాజులం గొలిచి
యెమ్మెయి నయినను బ్రదుకుజనంబులు
గీడునుం బొరయ కుండునట్టిసాధారణనీతి సంక్షేపరూపంబున
నెఱింగించెద సావధానుల
రయి వినుండు. (120)
క||తగఁ జొచ్చి తనకు నర్హం
బగునెడఁ గూర్చుండి రూప మవికృతవేషం
బుగ సమయ మెఱిఁగి కొలిచిన
జగతీవల్లభున కతఁడు సమ్మాన్యుఁ డగున్. (121)
క||నరనాధుఁ గొలిచి యలవడఁ
దిరిగితి నా కేమి యనుచుఁ దేఁకువ లేమిన్
మరియాద దప్పమెలఁగినఁ
బురుషార్ధంబునకు హాని పుట్టక యున్నే. (122)
ఉ||రాజగృహంబుకంటె నభిరామముగా నిలు గట్టఁ గూడ దే
యోజ నృపాలుఁ డాకృతికి నొ ప్పగువేషము లాచరించు నే
యోజ విహారముల్ సలుప నుల్లమునం గడువేడ్క సేయు నే
యోజ విదగ్ధుఁ డై పలుకు నొడ్డులకుం దగ దట్లు సేయగన్. (123)
క||పుత్రులు పౌత్రులు భ్రాతలు
మిత్రు లనరు రాజు లాజ్ఞ మిగిలినచోటన్
శత్రులకాఁ దమయలుకకుఁ
బాత్రము సేయుదురు నిజశుభస్థిపొంటెన్. (124)
క||చనువానిచేయుకార్యం
బున కడ్డము సొచ్చి నేరుపునమెలఁగుచుఁ దా
నునుబయిఁ బూసికొనుటఁ దన
మును మెలఁగినమెలఁకువకును ముప్పగుఁబిదపన్. (125)

ఆ||రాజునొద్దఁ బలువురకు సంకటము గాఁగఁ
దిరుగుపనుల కెంత్తేజ మయిన
వాని బుద్ధిగలుగువా రొల్ల రది మీఁదఁ
జేటు దెచ్చు టెట్లు సిద్ధ మగుట. (126)
క||ఊరక యుండక పలువుర
తో రవ మెసఁగంగ బలుకఁ దొడరుపక మదిం
జేరువ గలనాగరికులుఁ
దారుఁ గల్సి పలుకవలయు ధరణీశుకడన్. (127)
క||వేఱొక తెఱఁగున నొరులకు
మా ఱాడక యునికి లెస్స మనుజేంద్రు కడం
దీఱమి గలచోటులఁ దా
మీఱి కడఁగి వచ్చి పంపు మెయికొన వలయున్. (128)
చ||ధరణిపుచక్కగట్టెదురు దక్కి పిఱుందును గానియట్లుగా
నిరుగెలనం దగమ గొలిచి యే మనునో యెటు సూచునొక్కొ యె
వ్వరి దెస నెప్పు డేతలఁపు వచ్చునొ యీతని కంచుఁ జూడ్కి సు
స్థిరముగఁ దన్ముఖంబునన చేర్చుచు నుండుట నీతి గొల్వునన్. (129)
క||నగళులలోపలిమాటలు
దగునే వెలి నుగ్గడింపఁ దన కేర్పడ నొం
డుగడం బుట్టినఁ బతి విన
నగుపని సెప్పడిది గాక యాతనితోడన్. (130)
క||అంతిపురముచుట్టఱికం
బెంతయుఁ గీ డంతకంటె నెగ్గు తదీయో
పాంతచరకుబ్జవామన
కాంతాదులతోడిపొందుకలిమి భటునకున్. (131)
ఆ||ఉత్తమాసనములు నుత్కృష్టవాహనం
బులును గరుణఁ దమకు భూమిపాలుఁ
డీక తార యెక్కు టెంతటిమన్నన
గలుగువారి కైనఁ గార్య మగునె. (132)
క||మన్నన కుబ్బక యవమతి
ద న్నొందిన స్రుక్కఁబడక ధరణీశుకడన్
ము న్నున్నయట్ల మెలఁగిన
యన్నరునకు శుభము లొదవు నాపద లడఁగున్. (133)
క||జనపతి యెవ్వరినైనను
మనుపఁ జెఱుపఁ బూని యునికి మదిఁ దెలియ నెఱిం
గినయేనిఁ దాను వెలిపు
చ్చునె మునుము న్నెట్టిపాలసుండును దానిన్. (134)
ఉ||ఎండకు వాన కోర్చి తనయిల్లు ప్రవాసపుఁ జోటు నాక యా
కొండు నలంగుదున్ నిదురకుం దఱి దప్పెడు డప్పి వుట్టె నొ
క్కండన యెట్లొకో యనక కార్యము ముట్టినచోట నేలినా
తం డొక చాయ చూపినను దత్పరతం బనిసేయు టొ ప్పగున్. (135)
క||తా నెంతయాప్తుఁ డైనమ
హీనాయకు సొమ్ము పామునెమ్ములుగా లో
నూనినభయమునఁ బొరయక
మానినిఁగా కేల కలుగు మానము బ్రదుకున్. (136)
ఆ||ఆవిలింత తుమ్ము హాసంబు నిష్ఠీవ
నంబు గుప్తవర్తనములు గాఁగఁ
జలుపవలయు నృపతి గొలువున్నయెడల బా
హిరము లైనఁ గెలని కెగ్గు లగుట. (137)
క||వైరులదూతలు నెర వగు
వారు నిరాకృతులుఁ బాపవర్తులుఁ దమకుం
జేరువగా వర్తించుట
నేరమి తుదిఁ బోయి చేటు నిందము వచ్చున్. (138)
ఆ||వసుమతీశుపాల వర్తించునేనుంగు
తోడ నైన దోమతోడ నైన
వైర మగుతెఱంగు వలవదు తా రెంత
పూజ్యు లైన జనులపొందు లెస్స. (139)
క||కలిమికి భోగముల కదా
ఫల మని తను మెఱసి బయలుపడఁ బెల్లుగ వి
చ్చలవిడి భోగింపక వే
డ్కలు సలుపఁగ వలయు భటుఁ డడంకువతోడన్. (140)

వ॥అని యిట్లు పురోహితుండు సేవాధర్మం బెఱింగించిన ధర్మజభీమార్జునన్కులసహదేవులు ప్రసన్న చిత్తు లై యి ట్లనిరి.(141)
*****
*****
No comments:
Post a Comment