Translate

15 December, 2014

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి- 024 (116 – 120)

ఓం గణేశాయనమఃగురుభ్యోనమః
__/\__
నారాయణం నమస్కృత్య  – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్|

[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]


1. ధర్మరాజు రాజసూయానికి ప్రతిగా దుర్యోధనుడు ఒక యాగం చేశాడు, యాగం పేరేమి?
2.
నిద్రించినా కనులు మూయనిదేది?
3.
జయద్రధుడికి పాండవుల గెలిచే శక్తి ఎక్కడి నుండి వచ్చింది?
4.
యక్షుడు ధర్మరాజుని తమ్ములలో ఒకరిని కోరుకొమ్మంటే ధర్మజుడు ఎవరిని కోరాడు?
5.
అర్జునికి కిరీటం ఎవరిచ్చారు? ఎపుడు?
--------------------------------------------------------------------------------
సమాధానములు (జవాబులు):
1.
వైష్ణవ యాగం. - ఆరణ్య పర్వము షష్ఠాశ్వాసము 73 పద్యము.
తే|| రాజసూయంబునట్టిద రాజవర్య
     వైష్ణవం బనుయాగంబు వాసుదేవుఁ
     డిమ్మఖము సేసెఁ దొల్లి యభీష్ట మిదియ
     చేయు నిర్విఘ్నముగ నిదిచెల్లు నీకు. (73)


2.
నిద్రించినా కన్ను మూయనిది చేప. - ఆరణ్యపర్వము సప్తమాశ్వాసము 438 పద్యము
తే|| అనినఁ గన్ను మూయదు సుప్త మయ్యు మీను
     పుట్టియును గ్రుడ్డు చేతనం బొరయ కుండు
     హృదయరహితంబు రారూప మేఱు రయము
     కతన వర్ధిల్లు నని చెప్పెఁ గౌరవుండు. (438)


3.
ఈశ్వరుని వరం వల్ల. అరణ్యవాసంలో ఉండగా ద్రౌపదిని సైంధవు డెత్తుకొనిపోతాడు. అపుడు  
  పాండవులు వానిని పరాభవించి విడిచారు. దానికి ప్రతికారం చెయ్యాలని సైంధవుడు ఈశ్వరుని  
  గురించి తపస్సుచేసి ఒకరోజు పాండవులను జయించే శక్తి పొందాడు. - ఆరణ్య పర్వము  
  షష్ఠాశ్వాసము 257 పద్యము
|| విజయుఁ డొకండు దక్క నతివీరులఁ బార్ధుల నున్న నల్వురన్
     నిజ మొకనాఁటికయ్యమున నీవు జయింపుము ఫల్గునుండు
     ర్వజగదజయ్యవిక్రముఁడు వాని నెదుర్కొని నాకు నైనఁ బో
     జితునిఁ జేయు టెంతయు భరం బగు నిక్కము పల్కితిం జుమీ. (257)

4.
నకులుని. మాద్రి కొడుకులలో పెద్దవాడని. కుంతీ పుత్రులలో ధర్మరాజు మిగిలినాడు కనుక. -   
   ఆరణ్యపర్వము సప్తమాశ్వాసము 457 పద్యము
సీ|| శ్యామాంగు నారక్తజలరుహనేత్రు సాలప్రాంశు నున్న తలలితబాహు
     నకులుని బ్రదికింపు నావుడు యక్షుండు భీమఫల్గును లతిభీమబలులు
     ప్రియులు నీ కెంతయుఁ బృధివీశ వీరిలో నొకనిఁ గోరక యిట్లు నకులుఁ గోరి
     తనుడు ధర్మాత్మజుఁ డనియెను మాతండ్రి యగుపాండువిభునకు మగువ లిరువు
|| రందు గొంతికొడుకు లైనమువ్వురిలోన
     నేను బ్రదికినాఁడ నింక మాద్రి
     తనయు లిరువురందుఁ దగ నిప్పుడొక్కఁడు
     బ్రదుకవల్దె చెపుమ పాడి తెఱఁగు. (457)

5.
గురు దక్షిణగా నివాత కవచులను చంపి స్వర్గమునకు మేలుచేయుమని కోరి సంతోషంతో తన  
     దివ్యాభరణములను, మణి కిరీటమును ఇంద్రుడిచ్చాడు. ఆరణ్యపర్వము చతుర్థాశ్వాసము -56  
   వచనము.
అని తన తొడిగినయిద్దివ్యభూషణంబుల నిమ్మణికిరీటంబున నన్ను విభూషితుం జేసి స్పర్శరూపం
    బైనయీయభేద్యకవచంబు నిచ్చి యజరం బయిన యిగ్గొనయంబు గాండీవంబునం దాన యోజించి 
  పదివేల హంస మయూర వర్ణమాననీయహయంబులం బూనినరథంబు మాతలిప్రయుక్తం బైనదాని 
  నెక్కం బనిచి నివాతకవచ వథార్థం బరుగు మని నియోగించిన నింద్రు వీడ్కొని చనుచున్ననాతో 
  దేవత లి ట్లనిరి. (56)
***************
 

No comments:

Post a Comment