తెలుగు సుద్దులు…..(121)
ఆ.వె||ఆరు రుచులు వేరు సారంబు యొక్కటి ;
సత్యనిష్ఠ వేరు సత్యమొ`కటి
పరమ ఋషులు వేరు భావ్యుండు యొక్కడు
విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః
రుచులు భిన్నంగా (ఆరు-కారము, తీపి, పులుపు, ఉప్పు, చేదు, వగరు) ఉండవచ్చు, కాని వాటి సారము-ప్రధాన అంశము (ఆహారము) ఒక్కటే (లాలాజలంతో కలిసి లోనికి వెళ్ళిన తరువాత వాటి భిన్న రుచులు మరుగునపడతాయి); అలాగే సత్యం (ధర్మం, పరమాత్మ) ఒక్కటే కాని ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి, చేరుకోవడానికి అనేక నిష్ఠలు (పద్ధతులు, మార్గాలు) అవలంభించవచ్చు, ఆచరించవచ్చు; పరమ ఋషులు,ధార్మికులు ఎంతోమంది ఉన్నా అందరూ ఒక్కరి గురించే (పరబ్రహ్మ, పరమాత్మ, సర్వేశ్వరుడు) తపస్సు, అన్వేషణ చేస్తుంటారు. ఈ పద్యంలో వేమన చక్కటి ఉదాహరణతో పరమాత్మ( సత్యం ) ఒక్కడే, అతనిని తెలుసుకోవడానికి ఏ మార్గాన్ని ఎన్నుకున్నామన్నది ముఖ్యం కాదు, అంతిమ లక్ష్యం చేరడం ముఖ్యమన్నది హితవు పలుకుతున్నారు. అంతేకాకుండా బహుశా నాడు పెచ్చురిల్లుతున్న వివిధ శాఖల (శైవము, వైష్ణవము, లింగధారులు మొ.వి) అంతఃకలహముల గురించి కూడా తగదని చెప్పినట్లున్నది.||14-12-2014| |
ఆ.వె||ఆరు రుచులు వేరు సారంబు యొక్కటి ;
సత్యనిష్ఠ వేరు సత్యమొ`కటి
పరమ ఋషులు వేరు భావ్యుండు యొక్కడు
విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః
రుచులు భిన్నంగా (ఆరు-కారము, తీపి, పులుపు, ఉప్పు, చేదు, వగరు) ఉండవచ్చు, కాని వాటి సారము-ప్రధాన అంశము (ఆహారము) ఒక్కటే (లాలాజలంతో కలిసి లోనికి వెళ్ళిన తరువాత వాటి భిన్న రుచులు మరుగునపడతాయి); అలాగే సత్యం (ధర్మం, పరమాత్మ) ఒక్కటే కాని ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి, చేరుకోవడానికి అనేక నిష్ఠలు (పద్ధతులు, మార్గాలు) అవలంభించవచ్చు, ఆచరించవచ్చు; పరమ ఋషులు,ధార్మికులు ఎంతోమంది ఉన్నా అందరూ ఒక్కరి గురించే (పరబ్రహ్మ, పరమాత్మ, సర్వేశ్వరుడు) తపస్సు, అన్వేషణ చేస్తుంటారు. ఈ పద్యంలో వేమన చక్కటి ఉదాహరణతో పరమాత్మ( సత్యం ) ఒక్కడే, అతనిని తెలుసుకోవడానికి ఏ మార్గాన్ని ఎన్నుకున్నామన్నది ముఖ్యం కాదు, అంతిమ లక్ష్యం చేరడం ముఖ్యమన్నది హితవు పలుకుతున్నారు. అంతేకాకుండా బహుశా నాడు పెచ్చురిల్లుతున్న వివిధ శాఖల (శైవము, వైష్ణవము, లింగధారులు మొ.వి) అంతఃకలహముల గురించి కూడా తగదని చెప్పినట్లున్నది.||14-12-2014|
No comments:
Post a Comment