Translate

14 December, 2014

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి- 023 (111 – 115)

ఓం గణేశాయనమఃగురుభ్యోనమః
__/\__
నారాయణం నమస్కృత్య  – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్|

[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]
1. ప్రతి స్మృతి అనే విద్యను ఎవరు ఎవరికి ఇచ్చారు?
2. తనతో అడవులకు వచ్చే విప్రుల నెట్లా పోహిస్తానా అని మూర్చితుడైన ధర్మరాజునకు ధర్మబోధ  
    చేసిన మహర్షి ఎవరు?
3.
రోగికి బంధువు ఎవరు?
4.
పుట్టినా చైతన్యము లేనిది ఏది?
5.
అయోనిజ అనే ప్రసిద్ధి సీతకు ఉంది. అలాగే భారతంలో అయోనిజ ఎవరు?
--------------------------------------------------------------------------------
సమాధానములు (జవాబులు):
1.
వ్యాసుడు ధర్మరాజుకు ఉపదేశించెను; వ్యాసుని మాటప్రకారము ధర్మరాజు అర్జునకు బోధించెను. -  

     ఆరణ్యపర్వము ప్రథమాశ్వాసము 276&280 వచనములు; 281 పద్యము

అని ధర్మతనయు నేకాంతప్రదేశంబునకుం దోడ్కొని చని సత్యవతీసుతుండు   
     విధిదృష్టవిధానంబునం బ్రతిస్మృతి యను విద్య నుపదేశించి దీనిశక్తి నర్జునుండధిక   
     తపోవీర్యవిభవుండై యింద్రయమవరునకుబేరాది దేవతలను నీశ్వరునిఁ బ్రత్యక్షంబు సేసికొని  
   వారలవలన్ దివ్యాస్త్రంబులు వడసి శరువుల జయించు మఱి యివ్వనంబు భవచ్చిరనివాసంబునం 
   జేసి విరళఫలకుసుమపాదపం బై మృగకులోపరోధియై యొప్పుకున్నయది యొక్కచోటన పెద్దకాలం     బునికి యెవ్వరికిం బ్రీతిజనకంబు గాదు కావున నొండువనంబున కరుగునది యని చెప్పి   
   యమ్మునివరుం డరిగినఁ దద్వాక్యముదితు లై  ద్వైతవనంబు వాసి పాండవులు బ్రాహ్మణ  
   వరులతోన కామ్యకవనంబున కరిగి సరస్వతీతీరంబునందు నివాసంబు సేసి కొండక కాలం బుండ  
   నొక్కనాఁ డజాతశత్రుం డర్జునుఁ జూచి యి ట్లనియె. (276)

దివ్యాస్త్రవిదులైనవారల నోర్చునట్టియుపాయంబు కృష్ణద్వైపాయనుండు ప్రసాదించి చెప్పె నీవిద్య      నీవు  ప్రతిగ్రహించి కవచకార్ముకప్రాసఖడ్గధరుండవై యన్యుల జేయుండ వై యుత్తరదిక్కున  
    కరిగి తపోయోగబలంబున నింద్రుఁ బ్రత్యక్షంబు సేయుము తొల్లి వృత్రునకు వెఱచి వేల్పులు

      తమయాయుధంబులు నింద్రునందు సమర్పించి రవి యెల్ల నీకుఁ దత్ప్రసాదంబున నగు మఱి  

    యింద్రు నుపదేశంబున నీశ్వరు నారాధించి తదను గ్రహంబున నిష్టసిద్ధివడయు మిది వేద  

    వ్యాసునుపదేశం బని.         (280)
  కం|| ధృతినియమవ్రతునకు దీ
        క్షితునకుఁ బార్థునకు విగతకిల్బిషునకు
        ర్మతనూజుఁడు ప్రీతిఁ బ్రతి
        స్మృతి నుపదేశించెఁ దానమిత్రజిగీషన్. (281) 

2. శౌనకుడు. - ఆరణ్యపర్వము ప్రథమాశ్వాసము 19వచనము
శోకమూర్ఛితుండై మహీతలంబుపయిం బడినయాతని నాశ్వాసించి శౌనకుండనుబ్రహ్మఋషి తొల్లి

      యాత్మవ్యవస్థానార్థంబు జనకగీతంబు లయినశ్లోకంబుల యర్థంబులు యుధిష్ఠిరున కి ట్లనియె. (19)


3. వైద్యుడు. - ఆరణ్యపర్వము సప్తమాశ్వాసము 439 వచనము
చెప్పిన నయ్యక్షు డతనితోఁ దెరువు నడుచువానికి రోగార్తునకు గృహస్థునకు   
    మృతింబొందినవానికి నెవ్వరెవ్వరుచుట్టంబు లనిన నప్పుడమిఱేఁ డన్నలువురకుం గ్రమంబున   
    సార్థంబును వైద్యుడును సద్భార్యయుఁ గృతం బగుధర్మంబును బరమమిత్రంబు లని  
    నిర్దేశించుటయు వాఁడు వెండియు ని ట్లనియె.       (439)


4. గ్రుడ్డు. - ఆరణ్యపర్వము సప్తమాశ్వాసము 438 పద్యము
తే|| అనినఁ గన్ను మూయదు సుప్త మయ్యు మీను
    పుట్టియును గ్రుడ్డు చేతనం బొరయ కుండు
    హృదయరహితంబు రారూప మేఱు రయము
    కతన వర్ధిల్లు నని చెప్పెఁ గౌరవుండు. (438)

5. ద్రౌపది. యాజ్ఞసేని అనికూడా ( యాజ్ఞసేని యజ్ఞ వేదిం బుట్టె) . ఆదిపర్వము - సప్తమాశ్వాసము 277

     వచనము.
వారలు ధర్మానిలశక్రాశ్వినులు దమకు నాధారకర్తలు గా ధర్మజభీమార్జుననకులసహదేవు  
    లనంగాఁ బుట్టిరి మఱికమలభవప్రముఖనిఖిలసురగణప్రార్థితుండయి నారాయణుసితాసిత  
    కేశద్వయంబు బలదేవవాసుదేవులై  దేవహితార్థంబుద్భవించిన నందు వాసు దేవుండు వారలకుఁ      గార్యసహాయుం డయ్యె నయ్యింద్రుల కేవురకును నేకపత్నిగాఁ దపంబు సేసిన శ్రీమూర్తియయిన  
    యాజ్ఞసేని యజ్ఞవేదిం బుట్టె నమ్మవేని వీరలపూర్వదేహంబులఁ జూడు మని కృష్ణద్వైపాయనుండు  
    ద్రుపదునకు దివ్యదృష్టి యిచ్చి చూపిన. (277)
 

No comments:

Post a Comment