తెలుగు సుద్దులు…..(122)
ఆ.వె||తారకంబు జూచు దారి వేరే కల్దు$;
సమముగాను జూడ జక్కబడును;
వెర్రిగాను జూడ వెలుగె`ల్ల పారురా!
విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః
కంటినల్లగ్రుడ్డు చూపెట్టిన తీరు బట్టి మనకు కన్ను ఒకటే అయినా వివిధ రకాలుగా గోచరిస్తుంది. కనుగ్రుడ్డు సరిగా పెట్టినపుడు చూస్తే చక్కగా అందంగా, సుందరంగాకన్పిస్తుంది. అదే కంటినల్లగ్రుడ్డు వెర్రిగా (మెల్లకన్నుగా, వికృతంగా) పెట్టితే అది చూచి జనం భయంతో పారిపోతారు. కనుక మనం ప్రవర్తించే తీరుబట్టి యుంటుందని; అంతే కాకుండా మనం మంచి బుద్ధితో చూస్తే మంచిగాను, చెడ్డబుద్ధితో చూస్తే చెడ్డగాను కన్పిస్తుందని గ్రహించవలసినదిగా వేమన హితవు పలుకుతున్నారు. ||16-12-2014||
$వేఱుగ గఁద్దు (పాఠాంతరము)

No comments:
Post a Comment