Translate

19 December, 2014

తెలుగు సుద్దులు - వేమన పద్యములు (తెలుగు - ఇ కూటమిలో పెట్టబడినవి)-123

తెలుగు సుద్దులు…..(123)
ఆ.వె||సజ్జనముల చెలిమి జాలింపగారాదు;
ప్రకృతి నె`రుగకు`న్న భక్తిలేదు
పలవలె`ట్టి రీతి భక్తి నిల్పుదుర`యా?
విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః
సత్పురుషుల, మంచివారి స్నేహమును విడిచిపెట్టకూడదు. పరమాత్మ తత్వమును తెలుసుకొనలేకపోతె భక్తి నిలువదు, స్థిరపడదు. రెండు పంగల కఱ్ఱలాంటివారు (చంచలత్వము కలిగిన వారు, కిమ్మత్తు – ప్రాపంచిక కోరికలు అభిలషించేవారు) ఎలా భక్తిని నిలబెట్టుకోగలరు? నిలబెట్టుకోలేరు- కనుక పరమాత్మ యందు సంపూర్ణ అవగహనతో, అనురక్తితో, ఆసక్తిచే, సతతము సజ్జనుల సాంగత్యం ద్వారా నిష్కామ భక్తి కలిగి యుండమని వేమన ముక్తి మార్గం (తరుణోపాయం) తెలుపుతున్నారు.||18-12-2014||

No comments:

Post a Comment