ఓం గణేశాయనమః – గురుభ్యోనమః
__/\__
నారాయణం నమస్కృత్య – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసం – తతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి
మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]
1. గాండీవం అర్జునకు ఎవరిచ్చారు?
2. ఎవరి దోషం వల్ల ధృతరాష్ట్రుడు పుట్టిగ్రుడ్డి అయ్యాడు?
3. ద్రౌపది గాక భీమునికి ఎందరు భార్యలున్నారు? వారి పేర్లేమి? వారి వలన కలిగిన పుత్రుల పేర్లేమి?
4. శంతనుని అన్నగారి పేరేమి? అన్న ఉండగా శంతనునికి రాజ్యం ఎలా వచ్చింది?
5. అక్షౌహిణి అంటే ఏమిటి?
-----------------------------------------------------------------------------------------------------------------
సమాధానములు (జవాబులు):
1. వరణుడు. – ఖాండవ వనదహనానికి ముందు అగ్నిహోత్రుడు వరుణిని తలచుకొని, వరుణకు సోము డిచ్చినబ్రహ్మ నిర్మితమయిన గాండీవాన్ని అర్జునుకిమ్మంటాడు; అపుడు అక్షయ తూణీరం అర్జునకూ; చక్రము, గద
కృష్ణునికి వచ్చాయి. – ఆది పర్వము – అష్టమాశ్వాసము- 252 వచనము & 253 పద్యము.
వ॥అనిన నగ్ని దేవుండప్పుడు వరుణం దలంచి వానిం దనకు సన్నిహితుంజేసికొని
తొల్లి నీకు సోముం డిచ్చిన
బ్రహ్మనిర్మితకార్ముంకంబు నక్షయబాణతూణీర
యుగళంబును గంధర్వజహయంబులం బూనిన రథంబు
నియ్యతిరథుండయిన యర్జునున కిమ్ము
మఱి చక్రంబును గదయును వాసుదేవున కి మ్మని పంచిన. (252)
మ॥అమరాహీంద్రవియచ్చరాదుల క
జేయంబప్రధృష్ట్యం బభే
ద్యము వజ్రస్థిర మన్యసాధనభిదాదక్షంబు నై సర్వలో
కమనోజ్ఞం బయిదివ్యమై వెలుఁగునగ్గాండీవ మన్ చాపర
త్నము నిచ్చెన్ వరుణుండు పార్ధునకు
నుద్యద్విక్ర మోద్భాసికిన్. (253)
2. మాతృ దోషం వల్ల. వ్యాసుని
రూపం చూసి అంబిక కళ్ళు మూసుకుంది.
అందుచేత జన్మించే కుమారుడు
గ్రుడ్డివాడవుతాడని వ్యాసుడు చెపుతాడు. - ఆది పర్వము – చతుర్థాశ్వాసము - 254 పద్యము & 255
వచనము.
మధ్యాక్కర||అవసరజ్ఞుం డయి వ్యాసు
డేతెంచె నంత నత్తపసి
కవిలగడ్డంబును గవిలజడలును
గవిలకన్నులును
దవినయన్నువనల్ల నైనదీర్ఘపుందనువును జూచి
యువిద గన్నుంగవ మొగిచి తెఱవక
యుండె భయమున. (254)
వ॥కృష్ణద్వైపాయనుండును దానికిం బుత్రదానంబు సేసి యీయంబికయందు
బలపరాక్రమవంతుం
డయినకొడుకు పుట్టువాఁడు మాతృదోషంబున నంధుండగు
ననిన విని విషణ్ణచిత్త యయి సత్యవతి
వెండియుం గృష్ణద్వైపాయనుం బ్రార్థించి యింక నంబాలికయం దొక్కకొడుకుం
బడయు మని నియోగించిన
నెప్పటియట్ల యమ్మునివరుండు నంబాలికకడకుం జనిన నదియుందనవేషంబునకు
వెఱచి వెల్లనై యున్న
నక్కోమలికిం బుత్రదనంబు సేసి యీయంబాలిక యందు మహాబలపరాక్రమగుణవంతుండు
వంశకరుండు
నగుసుపుత్రుండు పుట్టు వాఁడును మాతృదోషంబునఁ బాండుదేహుం డగు నని
చెప్పి యరిగిన. (255)
3.హిడింబ - ఘటోత్కచుడు; జ(ల)రంధర – సర్వగుడు. - ఆది పర్వము – చతుర్థాశ్వాసము – 116 వచనము.
వ॥…భీమసేనునకు జర(ల)ధరకు సర్వగుండు పుట్టె……మఱియు భీమసేనునకు హిడింబకు
ఘటోత్కచుండుపుట్టె… (116)
4.దేవాపి. – ప్రతీపునికిశిబిపుత్రి యయిన సునందకు దేవాపి, శంతనుడు, బ్లాహికుడు అనిముగ్గురు కొడుకులు
పుట్టిరి. పెద్దవాడు దేవాపి “నాకు రాజ్యమక్కరలేదని” అడవులకు తపస్సుకు వెళ్ళిపోయాడు. అందుచే
శంతనుడు రాజయ్యాడు. - ఆది పర్వము – చతుర్థాశ్వాసము –114 వచనము.
వ॥వానిపేరం గురుక్షేత్రంబు నాఁ బరఁగె నట్టికురునకు దాశార్హియైనశుభాంగికినివిదూరథుండు పుట్టె
వానికిమాధవియయినసంప్రియకు ననశ్వుండుపుట్తె నయ్యనశ్వునకు మాగధియైనయమృతకుం
బరీక్షితుండు పుట్టె వానికి బహుదనసుత యయినసుయశకు భీమసేనుండు పుట్టె
వానికింగైకేయియయినకుమారికిఁ బ్రతిశ్రవసుండు పుట్టె వానికిఁ బ్రతీపుఁడు పుట్టెఁ బ్రతీపునకుశిబిపుత్రి యయిన
సునందకు దేవాపి శంతను బాహ్లికు లనఁగా మువ్వురు పుట్టి రందు దేవాపిబాల్యంబునంద తపోవనంబున
కరిగిన శంతనుండు రాజయ్యె వనికి గంగాదేవికి దేవవ్రతుం డైన భీష్ముండుపుట్టె….(114)
5.అక్షౌహిణి అనగా –21870 రధములు;21870 ఏనుగులు;65610 గుఱ్ఱములు;1,09,350 వీరభటులు(కాల్బలము) కలిగిన సేన. (21870+21870+65610=1,09,350; మొత్తంసంఖ్య-8=9;1,09,350+1,09350=2,18,700=18=9)
ఇటువంటి 18అక్షౌహిణుల సేన కురుక్షేత్ర యుద్ధములోపాల్గొంది.- ఆది పర్వము – ప్రథమాశ్వాసము – 81
వచనము.
వ॥ఇరువదియొక్క వేయునెనమన్నూటదడెబ్బదిరథంబులు నన్నియేనుంగులునఱువదేనువేలునాఱునూటపది
గుఱ్ఱంబులు లక్షయుం దొమ్మిదివేలున్ మున్నూటయేఁబండ్రువీరభటులును గలయది యొక్క యక్షౌహిణి
యయ్యె నట్టియక్షౌహిణులు పదునెనిమిదింట సన్నద్ధు లై కురుపాండవులు యుద్ధంబు సేయుటం జేసి
యాశమంతపంచకంబు కురుక్షేత్రంబు నాఁబరంగె నట్టి కురుక్షేత్రంబునందు. (81)
*******

No comments:
Post a Comment