ఓం గణేశాయనమః – గురుభ్యోనమః
__/\__
నారాయణం నమస్కృత్య – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసం –
తతో జయముదీరయేత్||
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]
1. ద్యూతానికి పాండవులను తీసుకురమ్మని ఎవరిని పంపారు?
2. మయుడు భీమార్జునులకు
బహూకరించినవేవి?
3. “చిన్ననోటికి పెద్దమాటలా?” అంటారు. దీనికి ప్రతీక అయిన సన్నివేశమ భారతంలో ఏది? ఎవరు ఎవరితో
అన్నారు?
4. ధర్మరాజు చేసిన రాజసూయంలో దుర్యోధనుని విధి ఏమిటి?
5. అనుద్యూతం అంటే ఏమిటి?
సమాధానములు (జవాబులు):
1.విదురుని. - సభాపర్వము –
ద్వితీయాశ్వాసము – 154 పద్యము.
కం|| అవిలఘనీయ మీదు
ర్వ్యవసాయం
బనుచు సత్యవచనుఁడు ధర్మా
ర్ధవిదుం
డప్పుడు ధృతరా
ష్టృవిధాతృనియోగమున
కొడంబడి యంతన్. (154)
2.భీమునికి గద; అర్జునునికి
శంఖం (ధర్మరాజుకు మయసభాభవనము అందజేసి) మయుడు
ఇచ్చెను. –
సభాపర్వము – ప్రథమాశ్వాసము –
14 వచనము.
వ॥మఱియుసకలజనమనోహరంబు లైన ననావిధయంత్రంబులునుననవరతకుసుమఫలభరితంబు
లైనతరువనంబులును విక చకమలకుముదాభిరమంబు లైనజలాశయంబులును
వివిధవిచిత్రపతాకావిలంబితతోరణ
విటంకప్రదేశంబులునుం గలిగి దశకిష్కు సహస్రప్రమానవృత్తయతంబును
సహస్రకరప్ర్భప్రసర(విస్తార్) విభూతియును వివిధరత్నవిభవాభిశోభితంబునుం
గానపూర్వసభాభవనంబుఁబదునాలుగునెలలు
నిర్మించి దాని నెనిమిదివేల రాక్షసకింకరుల మహాకాయుల
మహజనవసత్త్వసంపన్నుల నంతరిక్షచరులం
బనిచి మోపించికొనివచ్చి ధర్మరాజున కిచ్చి గదయును
శంఖంబును భీమార్జునుల కిచ్చి ధర్మరాజుచేత
సత్కృతుం డయి మయుం డరిగిన. (14)
3.“ద్రౌపది అధర్మవిజిత”
అని సభలో దుర్యోధనుని తమ్ముడు వికర్ణుడన్నప్పుడు కర్ణుడు వికర్ణుని ఇలా
అంటాడు:
‘జిఱుతవాని కింత తఱుసంటిపలుకులు’
.- సభాపర్వము
– ద్వితీయాశ్వాసము – 228 పద్యము
ఆ|| ఎల్లవారు నెఱుఁగ నొల్లనిధర్మువు
బేల నీకుఁ
జెప్ప నేల వలసెఁ
జిఱుతవాని
కింత తఱుసంటిపలుకులు
సన్నె
వృద్ధజనము లున్నచోట. (228)
4.రాజులిచ్చిన కానుకలను గ్రహించుట. – సభాపర్వము –
ప్రథమాశ్వాసము – 288 వచనము.
వ॥అని వరలయనుగ్రహంబు వడసి హిరణ్యరజతరత్నదక్షిణాదానవిశయంబులందుఁ
గృపాచార్యునిఁ
గృతాకృతపరిజ్ఞానంబునందు
భీష్మద్రోణులను సకల వస్తువ్యయంబునందు విదురుని నానాదేశాగతు
లైనరాజులు దెచ్చి
యిచ్చిన యుపాయనంబులు గైకొన దుర్యోధనుని భక్ష్యభోజ్యాదివినియోగంబునందు
దుశ్శాసునుని నియోగించి.
(288)
5.రెండవ ద్యూతం. ఒక ద్యూతాన్ని
అనుసరించి వచ్చిన ద్యూతం. ధర్మరాజు రెండు జూదాలు ఆడారు.
మొదటి
జూదం ద్యూతం, రెండవది అనుద్యూతం.
- సభాపర్వము
– ద్వితీయాశ్వాసము – 274 వచనము.
వ॥కావున
వారల ననుద్యూతంబునఁ బరజితులం గావించి విరళదేశనిర్వాసితులం జేయుట కార్యం బనిన విని
ధృతరాష్ట్రుం
డొడంబడి యప్పుడ యనుద్యూతార్థంబు ధర్మనందనుం దోడి తేరం బ్రాతికామిం బంచినం
బితృనియోగంబును విధి నియోగంబు నతిక్రమింప నగునే యని. (274)
****************
No comments:
Post a Comment