తెలుగు సుద్దులు…..(120)
ఆ.వె||మగని కాలమం`దు మగువ కష్టించిన
సుతుల కాలమం`దు సుఖము బొందు
కలిమి లేమి రెండు గలవెం`త వారికి
బలిమి పుత్రబలిమి బలిమి వేమా!
భావముః
వయస్సులో ఉన్నప్పుడు (కాయకష్టం చేయగలిగినపుడు) భార్యా, భర్తలిరువురు కష్టపడి సంపాదించుకొని, పొదుపుగా జీవనం సాగించి, డబ్బు, సంపద కూడబెట్టుకుంటే (దాచుకుంటే) పెద్దవయస్సులో పిల్లలదగ్గర ఉండవలసినా ఆర్థికంగా ఇబ్బందిలేకుండా సుఖజీవనం చేయవచ్చు. ఎంతవారికి కూడా కలిమి, లేమి (ధనికత్వము, బీదతనము), కష్టము, సుఖము అనేవి ఉంటాయి కదా! పెద్దతనంలో స్వంత ఆర్ధికబలం, పుత్రుల ఔదార్యము, సౌమ్యత పెద్దవారికి బలిమి (మానసిక స్థైర్యము) కదా వేమా!
ఈ పద్యంలో, సంసారం నడపడంలో భార్య పాత్రకున్న విశిష్టత తెలుపుతున్నారు. అందరిని సోమరితనం తగదని, కష్టించి పనిచేయవలసినదిగా హితవు పలుకుతున్నారు. అంతే కాకుండా, పెద్దతనంలో పిల్లల్లకు భారం కాకుండా సుఖజీవనం పొందడానికి ముందునుంచే జాగ్రత్తపడవలసిన ఆవశ్యకతను, పొదపరి తనము గురించి కూడా హితవు పలుకుతున్నారు. నేటి పరిస్థితులలో దీనికి మరింత ప్రాముఖ్యత కలదని చెప్పనక్కరలేదుగదా! ||12-12-2014||
No comments:
Post a Comment