ఓం గణేశాయనమః – గురుభ్యోనమః
__/\__
నారాయణం నమస్కృత్య – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసం – తతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]
1. పాండవులు రహస్యపు పేర్లు పెట్టుకొన్నారు గదా, ఆ పేర్లు ఎప్పుడైనా ఉపయోగించినట్లు దాఖలా ఉందా?
2. భారతంలో కూడా కైకేయి ఉందంటారు, ఎవరామె?
3. పాండవులు అజ్ఞాతవాసం విరాటుని కొలువులో చేస్తున్నట్లు తెలిసిన వ్యక్తి ఎవరు?
4. కీచకుడు చనిపోయేసరికి అజ్ఞాతవాసం ఎంత మిగిలింది?
5. కృపుని జెండా ఏమిటి?
--------------------------------------------------------------------------------

సమాధానములు
(జవాబులు):
1. ఉపకీచకులు కీచకుని శవానికి కట్టి తీసుకు వెడుతూ ఉండగా ద్రౌపది ఆ పేర్లతోనే (జయ, జయంత, విజయ, జయత్సేన, జయద్బల) పిలుస్తుంది; ఇతరులు గంధర్వులనుకొనేటట్లు. - విరాట పర్వము – తృతీయాశ్వాసము – 20 & 21 పద్యములు
ఆ||అనద నైతి నిచట నాలికుయ్యాలింపుఁ
డకట మీరు గలుగ నా క్రమించి
నన్నుఁ గట్టి సూతనందను లిమ్మెయి
వెఱపు లేక భంగపఱచు వారు. (20)
ఉ||ఆనతవైరి యోజయ మహాద్భుతవిక్రమ యోజయంత దు
ర్మానవిఘూర్ణ మానరిపుమర్దన యోవిజయాభిధాన తే
జోనిహితాహితప్రకటశూరగుణప్రతిభాస యోజయ
త్సేన విరోధిబాహుబలజృంభణభంజన యోజయద్బలా. (21)
2. సుదేష్ణ- ఈమె కేకయ రాజు కుమార్తె, అందుకని కైకేయి అనబడుతుంది. - విరాట పర్వము –

తృతీయాశ్వాసము – 55 వచనము
వ॥అనుచుం గన్యకాజనపరివృత యై యరిగి యంతఃపురంబు సొచ్చి సహోదర మరణశోకాతుర
వ॥అనుచుం గన్యకాజనపరివృత యై యరిగి యంతఃపురంబు సొచ్చి సహోదర మరణశోకాతుర
యగుకైకేయికడకుం జనునప్పుడు.(55)
3. ధౌమ్యుడు – ఇతడే పాండవులకు సేవా ధర్మాలు చెప్పాడు. పాండవులు విరాటుని కొలువులో
చేరేముందు ఒక ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. - విరాట పర్వము – ప్రథమాశ్వాసము – 147 వచనము
వ॥తదనంతరంబ హుతవహునకుం బురోహితునకుం బ్రదిక్షిణంబు సేసి యమ్మహీసురవరేణ్యుననుమతి

వడసి పాండవులు పాంచాలిం బురస్కరించుకొని యాతండును దోడన
యరుగుదేరం గదిలి
శుభనిమిత్తంబులు గైకొనుచుం జని దశార్ణ దేశంబున కుత్తరంబునఁ
బామ్చాలజనపద యామ్యదిగ్భాగంబున
సాళ్వశూరసేన విషయంబులలోనం గాళిందీదక్షిణతీరం బొరసికొని
పశ్చిమాభిముఖప్రయాణంబుల నెడనెడ
వన్యాహారంబుల శరీరయాత్రలు నడుపుచు నానామృగవివిధ విహారంబులను
మనోహరకుసుమకదంబగంధమకరందబిందు సందోహసుందరతరుచ్ఛాయాసేవనంబులను
గమలపరాగపరంపరాధూసరితభాసురజలాశయ
సమవ గాహనంబులను
సరిత్సంగమస్నానాద్యనుష్ఠానంబులను
బహుప్రకారపాదప గుల్మలతావలోకనంబులను
బక్షికులప్రకరానెకభంగివిరుతాకర్ణనంబులను వినోదించుచుఁ
గాననమార్గంబుల నరిగి
మత్స్యమండలంబుగడి నేరి ధౌమ్యుని వీడుకొని రవ్విప్రవరుండును నొక్కపుణ్యాశ్రమంబున
వసియించె వారు మఱియు నూళ్లుసొరక యడవితెరువుల
నడచి విరాటునగరంబున
కనతిదూరంబగుకాంతారంబున దఱిమి పోవుసమయంబునఁ బథిశ్రమంబు నూని యాజ్ఞసేని యి ట్లనియె.
(147)
4. 13 రోజులు. విరాట పర్వము – తృతీయాశ్వాసము – 63 పద్యము
ఉ||ముందటియట్ల యింకఁ బదుమూఁడుదినంబులమాత్రకున్ భవ
న్మందిరవాస మియ్యకొనినం గడతేఱు మదియవాంఛ యం
తం దగఁ దోఁచి మత్పతు లుదా త్తమతిన్ భవదీయవాంఛితం
బుం దలకొల్పఁ జాలుదు రపూర్వమనఃప్రమదంబు సేకుఱున్. (63)
5. వృషభము - - విరాట పర్వము – పంచమాశ్వాసము – 4 పద్యము
సీ||కాంచనమయవేదికాకనత్కేతనోజ్జ్వలవిభ్రమమువాఁడు కలశజుండు
సింహలాంగూల భూషితనభోభాగకేతుప్రేంఖణమువాఁడు ద్రోణసుతుఁడు
గనకగోవృషసాంద్రకాంతిపరిస్ఫుటధ్వజసముల్లాసంబువాఁడు కృపుఁడు
లలితకంబు ప్రభాకలితపతాకావిహారంబువాఁడు రాధాత్మజుండు
తే||మణిమయోరగరుచిజాలమహిత మైన
పడగవాఁడు కురుక్షితిపతి మహోగ్ర
శిఖరఘనతాళతరు వగుసిడమువాఁడు
సురనదీసూనుఁ డేర్పడఁ జూచికొనుము. (4)
*************
No comments:
Post a Comment