Translate

Showing posts with label Dandakamulu- దండకములు. Show all posts
Showing posts with label Dandakamulu- దండకములు. Show all posts

07 November, 2015

భాస్కర దండకము




శ్రీసూర్యనారాయణా! వేదపారాయణా! లోకరక్షామణీ! దైవచూడామణీ! యార్తరక్షా నమో! పాపశిక్షా నమో! విశ్వకర్తా నమో, విశ్వభర్తా నమో, దేవతా చక్రవర్తీ, పరబ్రహ్మమూర్తీ, త్రిలోకైకనాథా! మహాభూతభేదంబులన్నీవయై బ్రోతు వెల్లప్పుడున్ భాస్కరా! పద్మినీ వల్లభా! గానలోలా! త్రిమూర్తిస్వరూపా! విరూపాక్ష నేత్రా!మహాదివ్యగాత్రా! యచింత్యావతారా! నిరాకార ధీరా! పరాకయ్య! యోయయ్య! తాపత్రతయాభీల దావాగ్ని రుద్రా! తనుద్భూతమింపార గంభీర సంభావితానేక కామాద్యనేకంబులుం దాక నేకాకినై చిక్కి ఏదిక్కునున్ గానకున్నాడా, నీవాడనో తండ్రీ! జేగీయామానాకటాక్షంబులన్ నన్ గృపాదృష్టి వీక్షించి, రంక్షించు వేగన్; మునీంద్రాది వంద్యా! త్రిగజన్నేత్రమూర్తీ! ప్రచండ స్వరూపుండవై యొంటి సారధ్యమున్, గుంటి అశ్వంబులేడింటిని, న్నొంటి చక్రంబునుందాల్చి మార్తాండ రూపుండవై చెండవా? రాక్షసాధీశులన్ గాంచి కర్మానుసారంబుగన్ దోషంబులన్ ద్రుంచి కీర్తిప్రతాపంబులన్ మించి, నీ దాసులన్ గాంచి,ఇష్ఠార్థములన్గూర్తువో, దృష్టివేల్పా! మహాపాపకర్మలకున్నాలయంబైన ఈ దేహభారంబు భారంబుగానీకో సురోత్తమా! యొప్పులం దప్పులం నేరముల్ మాని, సహస్రాంశుండవై నట్టి నీకీర్తి కీర్తింపగన్ నేర్తునా! ద్వాదశాత్ముండవై దయాళుత్వమున్ చూపి నాయాత్మ భేధంబులన్ బాపి పోషింప నీవంతు, నిన్న్ ప్రశంసింప నావంతు; నిన్ శేషషాధిపుల్ గానంగ (పొగడంగ), నీ దివ్యరూప ప్రభావంబులన్ గానంగ, నేనెంత! ఎల్లప్పుడున్ స్వల్పజీవుండ నౌదున్, మహాకష్టుడన్, నిష్టయున్ లేదు, నిశ్చింతగన్ చేయవే, కామితార్థప్రదా! యిమ్మహిన్ నిన్ను కీర్తించినన్ మహాజన్మ జన్మాంతరవ్యాధి, దారిద్ర్యముల్ పోయిఁ గామ్యార్థముల్ కొంగుబంగారు తంగేడు జున్నై ఫలించున్,  భాస్కరా! నమస్తే, నమస్తే నమ:.

__/\__

06 November, 2015

అమ్మవారి దండకము

శ్రీమన్మహాదేవ దేవీ మహీమండలావాసమైయున్న యో దేవతా సార్వభౌమామణీ! ధీమణీ! లోకసంచారిణీ! భక్తచింతామణీ! దుష్టశిక్షామణీ! మంజుభాషామణీ! పాపసంహారిణీ! పుణ్య సంచారిణీ! ముక్తికాంతామణీ! పావనీ! నిన్ను వర్ణింప  బ్రహ్మాది శేషుఁడు నున్నోపగాలేరు నేనంతవాడన్ మరిన్ మున్ను యాదానవానీక దుర్మార్గముల్బాపగా బెక్కు రూపంబులన్ బెక్కునామంబుల న్నుద్భవంబందవే! తొల్లి ఇంద్రాదిలోకంబులం జేరితాజేయు కల్లోలమున్ జూచి భీతాత్ములైయుండ పుణ్యాత్ములౌ దేవసంఘంబులన్ ద్రుంచగా జూచి మాంసాదికానేకశల్యాపురీషాదులన్ కల్గు కూపంబులన్ ద్రోయగా, దేవతానీక మాబాధలన్ జిక్కి తాజేయునం దేదియున్ గానకన్నోదేవి! యోశాంభవీ! శాంకరీ! కనకదుర్గాంభ! యో కంచికామాక్షి! యోకాళి! యోపార్వతీ! శ్రీభవానీ! సురాపూజితా దేవదేవీయటంచుం గడుం దీనతంబొంది విన్నార్తులై వేడనౌనికముల్ బొందియున్ పెక్కుతాబాహువుల్ ఖడ్గశూలాద్య నేకాయుధాల్ బట్టి ఘుంకార మొప్పార క్రోధాగ్ని జ్వాలాప్రకాశంబుచే వెల్గుంచున్ వచ్చు నీ మోములున్ గాంచి యాదానవానీకబృందంబు అబ్బబ్బ ఈరూపమేనాడుజూడంగ లేదంచు యోతల్లీ! యోమాత యోదేవీ! రక్షింపమంచున్ దగన్ వేడుచున్నట్టి యవ్వారినిన్ వీడి మహిషాసురున్ ద్రుంచి దేవాదులన్ గాంచి రక్షించవా?  భూమినిన్ గల్గు నేడే లోకంబులన్ బట్టి వర్ధిల్ల నీ మానవానీక మయ్యయ్యో! నీ యాగ్రహంబందునన్ జిక్కి బందీకృతుల్లాగ క్రోధంబుచే నీవు తీవ్రంబుగ తాపమున్ గల్గగాజేసితే, కేక లార్బటముల్ గల్గగన్ జేసితే, గొప్పగన్ పెక్కుగన్ పొక్కు లెక్కించితే దేహమాయాసమున్ నొప్పులన్ దీవులన్ గల్గగన్ చేసితే, నోటికారోగ్యము న్భాసియున్నోటిరుచుల్, నేత్రరోగంబులన్ గల్గగాజేసితే, వారు నిన్ గొల్చి నీయుత్సవం బొప్పుగా జేతుమోతల్లీ! యోదేవీ! యంచున్ గడుం బెక్కుదండబులన్ బెట్టగన్ జాలియున్ బొంది యారోగ్యమున్నొందగన్ జేసితే వారు ఆరోగ్యమున్ బొంది స్నానంబులన్ జేసి యానందవారాసినిన్ దేలి నీయుత్సవం బొప్పుగా జేయుచున్ జంతుజాలంబులన్, బండ్లు, పక్వాన్న, పానియముల్ భక్తితో దెచ్చి నీకర్పితం బొప్పుగా జేయ సంతోషమున్ జెంది నూకాలమారేళ్ళమారీమహంకాళి నామాద్యనేక నామంబులన్ జేర్చియున్ తాముండు నీరూప తేజంబులన్ జేర్చి భూత సంఘంబులన్, గాలిదయ్యంబులున్ ఢాకిని, మోహిని, రాక్షసానీకమున్ జేర్చియుం విందుకావించి సంతోషమున్ జెందుచున్నట్టి యోదేవి! యోమాత! ఈనాడు ఈగ్రామమందుండి ఈరీతి మాబిడ్డలన్ బాధ నొందింపగా నేల? మేమెన్నడున్ నీకు నేయొగ్గు గావింపలేదే? లేకున్న, యీపాపలిక్కూనలేమైన గావించినన్ తల్లి చందాన శాంతంబునన్ జెంది జ్ఞానంబులన్ గల్గగన్ జేయరాకిట్టి ఘోరంబుగన్ బాధ నొందింపగన్నేల నోయంబికా! శాంభవీ! పావనీ! లోకమాతా! మముంకావ నీకన్న వేరెవ్వరున్ లేరు, కాపాడి రక్షించు, మాబిడ్డలన్ జెందు యీపాప లాయసమున్ బాపి ఏబాధ లేకుండగా జేసి మాబిడ్డలన్ మాదుపొత్తిళ్ళలోజేర్చి  మీడేర్చినన్ నీకు మాశక్తి లోపంబు లేకుండ పండ్లు, పక్వాన్నముల్, భక్ష్య, లేహ్యంబాదిగాదెచ్చి నీకర్పితం బొప్పుగన్ జేతుమోతల్లి! దేవి భవానీ! పార్వతీ! శంభురాణీ! కృపాదృష్టిచే మమ్ముగాపాడు! నీకన్న మాకెవ్వరున్ వేల్పులున్నారు! నిన్గొల్చి యేటేట నీయుత్సవంబాదిగ జాతరల్ జేసి తీర్ధంబుగావించి యానందమున్ బొందుచుచున్నుండ, మాయందు నీకింత క్రోధంబు గలుగ మాజేయు లోపంబు లేమైననుండెనే? నుండినన్, మాతవై గాచి రక్షింపరాద, మాయాపదల్ బాపి కాపాడుచున్ పంటయున్, పాడియున్, సంపదైశ్వర్యమున్నిచ్చి బ్రోవంగ రాదేయటంచున్ వడిన్ నిన్ను యీరీతి స్తోత్రంబునున్ జేయు మాపిల్లలంగాంచి మా యాపదల్ దీర్చి మాబిడ్డలుఁబొందు నీతాపమున్ బాపి రక్షించు! మాతల్లివై చూడుమా! దాతవై బ్రోవుమా! తండ్రివై గావుమా! నేతవై బ్రోవుమా! దేవివై బ్రోవుమా! యమ్మ నూకాలమ్మ, మాహాకాళీదేవి, సురాపూజవల్లీ, మహామ్మారికాళీభవానీ, విశాలాక్షి, యోకంచికామాక్షి, యోశాంభవీ, శాంకరీ, పార్వతీ, యన్నపూర్ణా, మహాదేవి మీరందరున్నేక భావంబుతో మమ్ము రక్షింపుడీ! బ్రాహ్మణుల్, క్షత్రియుల్, వైశ్యులున్, సూద్ర సంఘంబులున్ నీదు నామంబులున్ మానసంబందు సద్భక్తితో సల్పి స్తోత్రంబులున్ జేయు నవ్వారికిన్ గాక, యీ దండకం బెప్పుడున్ భక్తిచేపల్కు నవ్వారికిన్,  శ్రద్ధచే వ్రాయు నవ్వారికిన్, పాపముల్ బాపియున్ మోక్షమున్ గల్గజేయంగ నేగోరితిన్! నాదు వాక్యంబులందుండు లోపంబులన్ నెంచ కేప్రొద్దు,నీదాసునిన్ గాంచి రక్షించుమీ, లోకమాతా నమస్తే నమస్తే నమ:. 
__/\__
 
 
 
 
 

04 November, 2015

శ్రీ సరస్వతీ దండకము



  శ్రీ సరస్వతీ దండకము
జయజయ జనయిత్రీ! కరాన్వీణ సంధాత్రీ! గాంధర్వవిద్యాకళా కణనాళాం, త్రివేదీవళీం, సాహిత్య, సంగీత నిర్వర్తి, తప్రోల్ల సద్భక్త గంగామనేకాభిచారక్రియా, హోమధూమావళీ మే చ కాధర్వమ్నాయరోమావళీం, కల్పశిక్షాకరా కల్పసాక్షాచ్చరిత్రాంనిరుక్తి ప్రియోశక్తిం భుజద్వంద్వతాసన్నుతానేన సంశోభితాం చన్దనాజాతివృత్తప్రభేద ప్రభిన్నేన విద్యామయీం త్వాం భజే భగవతీ! గుణద్దీర్ఘభావోద్భవాం సతతిం సందధానాం మహాశబ్దనిష్పాలక వ్యాక్రియాశాస్త్ర కాంచీకనాంపోకటీ మణ్డలేబిభ్రతీం జ్యోతిషాహారదణ్డేన తారోరయస్ఫుర్తి విద్యోతమానేన విభ్రాజితామాత్మ పక్షామరాగాన్వితాభ్యాం ముభాభ్యాంచ పూర్వోత్తరాభ్యాం, మహాదర్శనాభ్యాం, ప్రతిష్ఠౌపితోష్ట ప్రవాళం, పరబ్రహ్మకర్మార్ధ భేదాద్విధా స్త్వం శరీరం ప్రతిష్టాం పరాం ప్రాప్తయాచారు మీమాంసయామాంసలేవోరుయుగ్మేన సమ్యక్పరాచ్ఛాదనం, లాలయంతీంముహూ:పత్రధానే గుణాన్విత గానకృత్ఖండన పౌఢిమాఢౌకమానేన ద్రస్త్యాత్మనాతర్క వ్యాకరణ కావ్యాదిభి: కార్యముఖేధ్యానయన్తీం, ధృవందేవి వందే తమాం త్వామహమ్ గృహీణ మత్స్య పద్మాది సంరక్షితం పాణిపద్మద్వయం, పురాణం శిరస్తావకం, నిర్మలం, ధర్మశాస్త్రందలాభ్యాం భ్రూలలాట క్రియామస్తలాజస్య తద్భిందు వాచిత్రికం, ఫాలభాగేతదర్ధేందు నాంతేవిరచిర్వి పఞ్చీకలా క్వాణనాకోణచాపం ప్రణతిర్నేస్వయం భవతు స్వయంభవతు మమ శుభం భారతీ! త్వత్కృపాథార భూతప్రభూతం నమస్సోమసిద్ధాన్త కాన్తాదయాయై నమన్సూన్యనాదాత్మ మధ్యాన్వితాయై సుజ్ఞాన సోమస్త్య హృత్పజాయై నమస్తేస్తు సాకార సుస్నిగ్ధ భూమ్నే నమస్తేస్తు కైవల్య కళ్యాణ సీమ్నే నమస్సర్వ గీర్వాణ చూడామణి శ్రేణి శోణ ప్రభాజ్వాల బాలాతపస్మేర పాదాంబుజాయై నమస్తే శరణ్యై సమశ్శర్మదాయై నమశాశ్వతాయైనమాభిసుతాయై నమశ్శారదాయై నమస్తే నమస్తే నమ:. 
__/\__

01 November, 2015

ఈశ్వర దండకము






ఈశ్వర దండకము

శ్రీకంఠ లోకేశ లోకోద్భవ! స్థానసంహారకారీ! మురారిప్రియా! చంద్రధారీ! మహేంద్రాదిబృందారకానందసందోహసంధాయి, పుణ్యస్వరూపా, విరూపాక్షా! దక్షాధ్వర ధ్వంసకా! దేవ నీదైన తత్వంబు భావించి, బుద్ధి ప్రధానంబుఁగర్మంబు విజ్ఞానమధ్యాత్మయోగంబు సర్వక్రియాకరణంబంచున్ ప్రకాశంబులం బుద్ధిమంతుల్ విచారించుచో నిన్ను భావింతురీశాన సర్వేశ్వరా! శర్వసర్వజ్ఞ! సర్వాత్మకా! నిర్వికల్ప ప్రభావా! భవానిపతీ! నివులోకత్రయావర్తనఁబుల్ మహావాయుఖాతాగ్నిసోమార్కతోయంబులన్ జేసి సంచార చక్ర క్రియాయంత్రవహుండవై, దేవ దేవాదిదేవా, మహాదేవ నిత్యంబునత్యంతయోగస్థితిన్ నిర్మలజ్ఞానదీపప్రభాజ్వాల విధ్వంస, నిస్సారసంసారమాయాంధకారుల్, జితక్రోధ రోగాదిదోషుల్, యతీంద్రుల్, యతాత్ముల్, భవత్పాదం కేహరు ధ్యాన పీయూధారానుభూతిన్, సదాతృప్తులై, రవ్యయాభవ్య సేవ్యాభవా! భర్గభట్టారకా,భార్గవాఁగస్యకకుత్సాది నానాముని స్తోత్రదత్తావథానా లలాటేక్షనోగ్రాగ్ని భస్మీకృతానంగ భస్మానులిప్తాంగ గంగాధరా నీప్రసాదంబునన్ సర్వగీర్వాణగంధర్వులున్, సిద్ధసధ్యోరగేంద్రామరేంద్రాదులన్ శ్వాశతైశ్వర్య సంప్రాప్తులై రీశ్వరా! విశ్వకర్తా! సురాభ్యర్చితా! నాకునభ్యర్ధితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తీ, త్రిలోకనాథా! మహాదేవా! నమస్తే, మనస్తే, నమస్తే నమ:.  

__/\__