Translate

11 December, 2014

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి- 020 (096 – 100)


ఓం గణేశాయనమఃగురుభ్యోనమః

__/\__

నారాయణం నమస్కృత్య  – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]
          1.      అరణ్యంలో భీముని ఒక పెనుపాము పట్టుకుంది, ఎవరా పెనుపాము?
          2.     మానవుడు దేనిచేత సహాయం కలవాడవుతాడు?
          3.     రూపం ఉన్నా హృదయం లేనిది ఏది?
          4.     ఘోషయాత్రకు వెళ్ళడంలో దుర్యధనుని అభిప్రాయం ఏమిటి?
          5.     గాలి కంటే వేగం కలది ఏది?

సమాధానములు (జవాబులు):

1.అగస్త్యమునిచే శపింపబడిన నహుషుడు (చక్రవర్తి) ఆరణ్యపర్వము చతుర్థాశ్వాసము 119 పద్యము
సీ|| వినవయ్య నహుషుఁ డన్ జన్పతి నేను మీ పూర్వజులకు నట పూర్వజుండ
    ననఘ సుత్రామున కెన యగువాఁడ నైశ్వర్యగర్వంబున నార్యవృత్తి
    విడిచి వివేకంబు సెడి సహస్రోత్తమబ్రాహ్మణకృత మైన బ్రహ్మరథము
    నెక్కి బ్రాహ్మణులకు నక్కజం బగునవమానంబు సేసినదాన నాకుఁ
|| గలశభవుఁ డగస్త్యుఁ డలిగి యత్యుగ్రాహి
    వగుమనియును శాపమొగినయిచ్చె
    మునివ రేఱ్యుశాపమునఁ జేసి యిప్పాట
    నవయు చున్నవాఁడ నాఁటఁగోలె. (119)

2.మానవుడు ధైర్యము చేత సహాయం కలవాడవుతాడు. - ఆరణ్యపర్వము సప్తమాశ్వాసము 428 పద్యము
కం|| శ్రుతమువలన శ్రోత్రియుఁడగు
      నతులతపోయుక్తిఁగడుమహత్వముపడయున్
      ధృతిచే సహాయయుతుఁ డగు
      నతిశయముగ బుద్ధిమంతుఁ డగు బుధసేవన్. (428)

3.రూపం ఉన్నా హృదయం లేనిది ఱాయి. - ఆరణ్యపర్వము సప్తమాశ్వాసము 437 & 438 పద్యములు
తే|| మొనసినిద్రించియును గన్ను మూయదెద్ది
    పుట్టియునుజేతనత్వంబుఁబొరయ్దెద్ది
    యరయ రూపుగల్గియు హృదయంబులేని
    దెద్ది వేగంబుకతమున నెద్దిపొలుచు (437)
తే|| అనినఁ గన్ను మూయదు సుప్త మయ్యు మీను
    పుట్టియును గ్రుడ్డు చేతనం బొరయ కుండు
    హృదయరహితంబు రారూప మేఱు రయము
    కతన వర్ధిల్లు నని చెప్పెఁ గౌరవుండు. (438)

4.అరణ్యవాసంలోఉన్న పాండవులూ, ద్రౌపదీ తన వైభవము చూసి మనస్సులో కుమిలిపోవాలని (ఘోషయాత్రకు వెళ్ళడంలో) దుర్యధనుని అభిప్రాయం. ఆరణ్యపర్వము పంచమాశ్వాసము 347,351 వచనములు & 348-350,352 పద్యములు.
|| పాండవు లిప్పుడు పరమదుఃఖార్తు లగుచు ద్వైతవనసరోవరసమీపంబున నున్న వా రని వింటిమి నీవు సకలసామ్రాజ్యవిభవంబు మెఱసి చని యందు నీ తేజంబు ఘర్మసమయంబునాఁటి తపను తేజంబై పగతురకన్నులు కమర నతి దుస్సహం బగునట్లుగాఁ జేయుము తొల్లి నహుషపుత్రుం డయినయయాతియుం బోలె నుజ్జ్వలుండవై యున్న నిన్నుం జూచి పాండవులు హృదయ భేదంబుగా వగచెదరు మిత్ర జన మోదంబును శత్రుజనఖేదంబునుంగ దా  సంపదలకుం దగి యెడుఫలంబు. (347)
కం|| ధన ధాన్యపుత్ర బాంధవ
      జనలాభంబులును దలఁప సరిగావు సుఖం
      బునఁ దాను దనరి శత్రులు
      ఘనతరదుఃఖముల నుండఁగని యలరుటకున్. (348)
|| నారలు గట్టి కూర లశనంబుగ నుగ్రవనంబులో విప
    ద్భారము నొంది వందురినఫల్గును నుజ్జ్వలరాజ్యవైభవో
    దారుల మై కనుంగొని ముదంబునఁ బొందఁగఁ గాంచుకంటె నిం
    పారఁగ నొండు గల్గునె కృతార్ధత యెందును గౌరవేశ్వరా. (349)
తే|| అతులసౌభాగ్యపుణ్యసమగ్ర గరిమ
    నొప్పు చున్న నీ దేవుల యొప్పు సూచి
    ధృతి దఱిఁగి తన్నుఁ దాన నిందించుకొనుచు
    హృదయమునఁ బాండవాంగన యెరియవలదె. (350)
|| అనిన నిది వోలు నని నాగ కేతనుండు సంప్రీతుం డై కొండొక విచారించి రాధేయుం జూచి యిట్లనియె. (351)
కం|| నాతలఁపును నిట్టిద నీ
      వీ తెఱఁ గెఱిఁగించి తది యభీష్టము మన మా
      ద్వైతవనంబున కరుగుట
      భూతలపతి యనుమతింపఁ బోలఁడు మదిలోన్. (352)

5.గాలి కంటే వేగం కలది మనసు. - ఆరణ్యపర్వము సప్తమాశ్వాసము 435 పద్యము.
|| తల్లివ్రేఁగు సువ్వె ధరణికంటెను నాక
    సంబుకంటెఁ బొడవు జనకుఁ డరయ
    గాడ్పుకంటె మనసు గడుశీఘ్రగతి తృణో
    త్కరముకంటెఁ జింతకరముతఱచు. (435)
  
***********
 

No comments:

Post a Comment