Translate

Showing posts with label Puranamulu-పురాణములు-Srimadamdhra Mahabharatham -శ్రీ మదాంధ్రమహాభారతము. Show all posts
Showing posts with label Puranamulu-పురాణములు-Srimadamdhra Mahabharatham -శ్రీ మదాంధ్రమహాభారతము. Show all posts

16 October, 2015

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి – 110 (546-550)



ఓం గణేశాయనమః – గురుభ్యోనమః  
 __/\__
నారాయణం నమస్కృత్య – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసం – తతో జయముదీరయేత్||
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తి గారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారముగా.]

1.   ధర్మరాజు ధ్వజం ఏమిటి?
2.  పాండవుల కొడుకు ఒకడు, మనుమడొకడు ధర్మరాజు అశ్వమేధం చూశారు – ఎవరు వారు?
3.  తాను మరణిస్తూ భీష్ముడు పాండవులకు ఏమని సలహా ఇచ్చాడు?
4.  “వీని మనస్సు ఇప్పుడు నిష్కల్మషమయింది” అని వ్యాసమహర్షి ఒకరిని మెచ్చుకున్నారు, అతను ఎవరు?
5.  చివరగా వ్యాసుడు ధృతరాష్ట్రునికి చెప్పిన ధర్మమేమిటి?
----------------------------------------------------------------------------------------------------
సమాధానములు (జవాబులు):
1.   చంద్రుడు –   
2.   బభ్రువాహనుడు, పరీక్షిత్తుడు- అశ్వమేధపర్వము- చతుర్థాశ్వాసము – 208 పద్యము
తే॥బభ్రువాహనునకుఁ బరమవిశేషంబు
    మెఱయ గారావించి మేలివస్తు
    కోటు లొసఁగి ప్రీతిఁ గూరినమనముతో
    నతనిఁ దత్పురమున కరుగఁబమనిచె. (208)
3.ఆనృశంస్యము, సత్యము విడువక బ్రతుకుడని – ఆనుశాసనికపర్వము – పంచమాశ్వాసము – 468 వచనము
వ॥నీకు నే ననుజ్ఞ యిచ్చితి వసువులం బొందు మనినం బరమానందంబునం బొంది పాండునందనులను ధృతరాష్ట్రునిం దక్కటివారలను గనుంగొని మీచేత ననుజ్ఞాతుండన కదా యని పలికి యందఱం గౌఁగలించుకొని ‘యానృశంస్యంబును (అక్రూరభావమును) సత్యంబును నిత్యంబులుగాఁ బాటించి బ్రదుకుం డని’చెప్పి తాను దొల్లి రాజులగెల్చి తెచ్చినధనంబులు విప్రజనంబుల్ కిచ్చి ధర్మతనయుం జూచి యెల్ల బ్రాహ్మణులునుం బూజనీయులు ఋత్విజులు నాచార్యులు వృద్ధులు విశేషించి పూజింపవలయువా రని నిర్దేశించి యూరకుండి ధారణానుక్రమంబున సమాహితాత్ముండయి వాయువుల సన్నిరుద్ధంబుచేసిన నవిఉర్ధ్వగతిం గైకొనియె నమ్మహాత్ముండవయవంబులం బ్రాణంబులు పాపికొనుచు వచ్చునయ్యై చోట్లు శల్యరహితంబులగు చుండె నట్లగుటం గాంచి కృష్ణాదులగు నఖిల జనంబులు నాశ్చర్యభరితాంతఃకరణు లగుచుఁ గీర్తించి రాసంయమచతురునిచే సర్వావయతబను సన్నిరుధ్ధం బై యాత్మ మూర్ధంబు భేదించి మహోల్కా కారంబున నాకసంబున కెగసి కొంతదవ్వరిగి యంత నంతర్హితం బయ్యెనప్పుడు పుష్పవృష్టి గురిసె దేవదుందుభులు మొరసె నంబరంబున సిద్ధులు సాధ్యులుం బొగడుచుం బ్రమోదంబునొంది రిట్లు దేవవ్రతుండు దివంబునకుం జనుటయు. (468)
4.ధృతరాష్ట్రుని – ఆశ్రమవావాసానికి వెళ్లేముందు. – ఆశ్రమవాసపర్వము – ప్రథమాశ్వాసము – 51,52 పద్యములు
సీ॥అనుటయుఁ బ్రియమంది యమ్మాహాముని యమ్మహీశ్వరుతోఁ బాండుఁనృపాలు
    గద్దియ నిడికొని క్రతువులు చేయించి యవిరళభోగానుభవము నడిపి
    యీతనివారలఁ బ్రీతి నీక్షించి తా శిష్యుండపోలె సంసేవనంబు
    భక్తిమై నొనరించెఁ బదపడి నీవును దిగ్విజయాదులఁ దేజ మితని
తే॥నొందునట్లుగఁ జేసితి వొనరఁ బిదపఁ
    దాన పదమూఁడువర్షముల్ ధరణియేలె
    నీవు శుశ్రూష యెంతయు నియతి నడపి
    తితనిమది లేదు కలఁక యొక్కింతయేని. (51)
క॥కేవలతపఃక్రియాసం
    సేవనతాత్పర్య మిపుడు చిత్తంబునతయం
    దావేశించినయది యీ
    భూవరునకు నితని ననిచి పుచ్చు మడవికిన్. (52)
5.ధీర్ఘవైరమూ, క్రోధమూ లేకుండా మనస్సు వాక్కూ ఏకాగ్రమయితే అదే పరమపదాప్తి సాధనం. మోక్షకారణం. – ఆశ్రమవాసపర్వము – ద్వితీయాశ్వాసము - 75పద్యము.
ఆ॥వినుము దీర్ఘవైరవృత్తియుఁ గ్రోధచిం
    తనము లేక వాక్కు మనమునొక్క
    అంద మగుట సకలజనముల కనుబద్ధ
    సంపదా ప్తిపరమసాధనంబు. (75)
 సమాప్తము   
__/\___
******************************************************************************

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి – 109 (541 - 545)



ఓం గణేశాయనమః – గురుభ్యోనమః  
 __/\__
నారాయణం నమస్కృత్య – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసం – తతో జయముదీరయేత్||
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తి గారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారముగా.]
1. ధర్మరాజు సత్యం విడువ డని దుర్యోధనునకు కూడా నమ్మకం - దీనికి ఉదాహరణం ఏమిటి?
2.ధృతరాష్ట్రుని వనవాసానికి పౌరుల సమ్మతిని తెలిపినది ఎవరు?
3. కృష్ణుడు అశ్వత్థామను ఏమని శపించాడు?
4.ధృష్టద్యుమ్నునికి మరో పేరు ఉంది, అదేమి?
5.ఉద్యోగం అంటే ఏమిటి? ఉద్యోగపర్వం అనే పేరు ఎందుకు వచ్చింది
----------------------------------------------------------------------------------------------------
సమాధానములు (జవాబులు):
1. భీష్ముడు చెప్పినా నమ్మక దుర్యోధనుడు ధర్మరాజు దగ్గరకు అజ్ఞాతవాసం చెడిపోయిందని దూతను పంపాడు.  అపుడే ధర్మరాజు “నిండె సమయాబ్దములు నిండె నిండె” అని ముమ్మారు నిండినట్లు చెపుతాడు. – విరాటపర్వము – పంచమాశ్వాసము – 367 వచనము; 368- 370 పద్యములు
వ॥….. గాంగేయునివచనంబు లప్రమాణంబులు సేసి ధర్మతనయుం డసత్యంబున కియ్యకొనమి యెఱింగి యాతనిపాలికి దూతం బుత్తెంచిన వాఁడు నేతెంచి కాంచి యిట్లనియె. (367)
తే॥వాలి యజ్ఞాతవాససంవత్సరంబు
     నిండ కుండంగ మున్నపార్థుండు బయలు
     మెఱసి సమయంబు దప్పె నీ వెఱిఁగి దీని
     కేది దగు నది సేయుము మేదినీశ. (368)
వ॥అని పునర్వనవాసకరణంబు దోఁప నాడిన నవ్వి యధిష్ఠితసత్యవ్రతుం డ్యిన యుధిష్ఠిరుం డతని కి ట్లనియె. (369)
క॥నిండె సమయాబ్దములు నిం
     కొం డన లే దిపుడ చని సుయోగధనుతో భీ
     ష్ముండును గురుఁడును వినఁగా
     నిండె ననుము నిండె నిండె నిక్కంబునకున్. (370)
2.శంభువనే విప్రుడు – ఆశ్రమవాసపర్వము – ప్రథమాశ్వాసము -97 వచనము
వ॥అట్లేడ్చి యుడిగి తమయంతవట్టునుం గూడుకొని కార్యవచనంబు లార్యచరితుండును జాతురాలాపకల్యుండును నగు శంబువను విప్రోత్తమునకుం జెప్పి యిత్తెఱంగున ధృతతరాష్ట్రునితో నాడు మని నియోగించిన నాతం డారాజు నగ్ర భాగంబునఁజేరి సవినయంబుగా ని ట్లనియె. (97)
3.నీవు బాలఘాతివి అయ్యావు – “అన్నం దొరకక అసహాయుడవై దుర్గంధ రక్తంలొ శరీరం తడుస్తూ మూడువేల ఏళ్ళు తిరుగుతావు”అని శపించాడు,  దీన్ని వ్యాసుడు కూడా ధ్రువీకరించాడు. – సౌప్తికపర్వము –ద్వితీయాశ్వాసము – 86 వచనము
వ॥… తనచిత్తంబున రోషం బావహిల్లుటయు బాలఘాతి వగునీకు నశనంబు దుర్ల భం బై సహాయరహితుండ వై దుర్గంధరక్తంబు నంగంబు దిగ్ధం బగుచుండ మూఁడువేలేండ్లు తిరుగుము నాచేత రక్షితుండై యక్కుమారుండు కృపాచార్యువలన ధనుర్వేదవిదుం డై సర్వశస్త్రాస్త్రంబులు పడసి బహుసంవత్సరంబులు వసుధఁ బాలింపఁగలవాడు వానికి జనమేజయుం డనుమహారాజు ప్రభవించి నీవు చూచుచుండ నుజ్జ్వలుం డై ప్రవర్తించు మదీయంబు లగుతపస్సత్యంబులమహనీయప్రభావంబులు చూడు మని యాడె నప్పుడు కృష్ణద్వైపాయనుండు గురునందనున కి ట్లనియె. (86)
4.శ్వేతుడు - 
5.ప్రయత్నం – సంధికోసం ప్రయత్నాలు సాగిన పర్వము కనుక. ******************************************************************