ఓం గణేశాయనమః – గురుభ్యోనమః
__/\__
నారాయణం నమస్కృత్య – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసం – తతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి(క్విజ్) పుస్తకము(1994)ఆధారంగా]
2. రౌమహర్షణి పౌరాణికుడెవరు? అతని తండ్రి ఎవరు?
3. “గత కాలము మేలు వచ్చుకాలము కంటెన్” దీని అర్ధ్మ ఏమిటి? ఎవరెవరితో అన్నారు?
4. నన్నయ ఆంధ్రదేశాన్ని, గోదావరిని, శ్రీపర్వతాన్ని భారతంలోఏ సందర్భంలో ప్రస్తావించారు?
5. ధృష్టద్యుమ్నుడు బ్రాహ్మణ వేషములో ఉన్న వారిని క్షత్రియులని(పాండవులను) ఎలా గ్రహించాడు?
-------------------------------------------------------------------------------------------------------------
సమాధానములు (జవాబులు):
1. ఆపస్తంబ సూత్రః ముద్గల గోత్రం. – ఆది పర్వము – ప్రథమాశ్వాసము – 9 పద్యము.సీ|| తనకులబ్రాహ్మణు ననురక్తునవిరళజపహోమతత్పరు విపులశబ్ద
శాసను సంహితాభ్యాసు బ్రహ్మాండాదినానాపురాణ విజ్ఞాననిరతుఁ
బాత్రు నాపస్తంబసూత్రు ముద్గలగోత్ర జాతు సద్వినుతావదాతచరితు
లోకజ్ఞు నుభయభాషాకావ్యరచనాభిశోభితు సత్ప్రతిభాభియోగ్యు
ఆ|| నిత్యసత్యవచనుమత్యమరాధిపా
చార్యు సుజను నన్న్య పార్యుఁ జూచి
పరమధర్మ విదుడు వరచళుక్యాన్వయా
భరణుఁ డిట్టులనియెఁ గరుణతోడ. (9)
2. ఉగ్రశ్రవసుడను సూతుడు; వ్యాసుని శిష్యుడైనరోమహర్షణుడు. - ఆది పర్వము – ప్రథమాశ్వాసము – 27
పద్యము & 28 వచనము
సీ|| నైమిశారణ్యపుణ్యక్షేత్రమునఁగులపతి శౌనకుం డనుపరమమౌని
బ్రహ్మర్షిగణసముపాసితుండై సర్వలోకహితార్ధంబు లోకనుతుడు
ద్వాదశవార్షికోత్తమసత్రయాగంబు మొగిఁ జేయుచున్న యమ్మునులకడకు
వచ్చి తా నుగ్రశ్రవసుఁడనుసూతుCడురౌమహర్ష ణి సుపౌరాణికుండు
ఆ|| పరమభక్తితోడఁబ్రణమిల్లి
యున్నయక్కథకువలనమునినికాయమెల్ల
వివిధ పుణ్యకథలువినువేడ్క నతనిఁ బూ
జించి రపరిమితవిశేషవిధిల. (27)
వ|| అక్కథకుండు వెండియునమ్మునిసంఘంబునకు నమస్కారంబు సేసి యనేక పురాణ
పుణ్యకథాకథనదక్షుండవ్యాసశిష్యుం డైనరోమహర్షణునకుఁ బుత్రుండ నవలన నెక్కథ విన
వలతు రనిన నమ్మును లతని కి ట్లనిరి. (28)
3. రాబోయే కాలం కంటే గడిచిన కాలం చాలామంచిది. ఈ మాటలు వ్యాసుడు సత్యవతితో అన్నాడు.
పాండవులను చూసి సంతొషిస్తున్న సత్యవతిని చూసివ్యాసుడు “ తల్లీ! ఈ ధృతరాష్ట్రుని పుత్రులు క్రూరులు,
ధర్మరహితులు, వీరివల్ల వంశానికి చేటుకలుగుతుంది. అది మీరు చూడరాదు. మీకు జరిగిన కాలమే
మంచిది; ముందున్న కాలముగడ్డురోజులు. అందుచేత మీరు తపోవనానికిరండి” అనిచెప్పగా, సత్యవతి,
కోడండ్రగు అంబికను, అంబాలికను తీసుకొని తపస్సుచేసుకొనుటకు తపోవనమునకు వెళ్ళెను.–
ఆదిపర్వము – పంచమాశ్వాసము – 159,160 పద్యములు & 161 వచనము.
క|| మతిఁ దలఁపఁగ సంసారం
బతిచంచల మెండమావులట్టులసంప
త్ప్రతతు లతిక్షణికంబులు
గత్కాలముమేలు వచ్చుకాలముకంటెన్.(159)
క|| క్రూరులు విలుప్త ధర్మా
చారులు ధృతరాష్టసుతు లసద్వృత్తులు ని
ష్కారణవైరులు వీరల
కారణమున నెగులు పుట్టుఁ గౌరవ్యులకున్. (160)
వ|| దాని ధృతరాష్ట్రుండుతాన యనుభవించుం గాని మీరి దారుణంబుఁ జూడక వీరి విడిచి తపోవనంబున
కరుగుం డని చెప్పి చనినసత్యవతియుఁ బారాశర్యు నుపదేశంబు భీష్మవిదురల కెఱింగించి కోడండ్ర
నంబికాంబాలికలం దోడ్కొనివనంబునకుం జని తానును వారు నతిఘోరతపంబు సేసి కొండొక
కాలమునకు శరీరంబులు విడిచిపుణ్యగతికిం బోయి రిట ధృతరాష్ట్రుండును. (161)
4. అర్జుని తీర్ధయాత్ర సందర్భములో. – ఆది పర్వము – అష్టమాశ్వాసము –139 పద్యము.
సీ|| దక్షిణగంగ నాఁ దద్దయునొప్పిన గోదావరియు జగదాది యైన
భీమేశ్వరంబును బెడఁగగుచున్న శ్రీపర్వతంబును జూచి యుర్విలోన
ననఘ మై శిష్టాగ్రహారభూయిష్ట మై ధరణీసురోత్తమాధ్వరవిధాన
పుణ్యసమృద్ధ మై పొలుచువేఁగీ దేశవిభవంబుఁ జూచుచు విభుఁడుదక్ష
తే|| ణాంబురాశీతీరంబున కరిగిదురిత,
హారి యైన కావేరీమహాసముద్ర
సంగమంబున భూసురేశ్వరుల కభిమ,
తార్ధ దానంబుఁ జేసి కృతార్ధుఁ డగుచు. (139)
5. చాటునుండి పరిశీలించి వారు చెప్పుకొనే ఆయుధవిద్యారహస్యాలు,వ్యూహాలు మొదలగుమాటలను బట్టి.– ఆది
పర్వము – సప్తమాశ్వాసము – 228 పద్యము.
సీ|| అంత నయ్యేవురు నయ్యయికథ లొప్పఁజెప్పుచు మఱి రధసింధురాశ్వ
విషయంబులునుసమవిషమమహావ్యూహనిర్భేదనోపాయనిపుణవిధులు
నాయుధవిద్యారహస్యప్రయుక్తులుఁబలికిరి పలికినబాసఁ జూడ
నత్యుత్తమక్షత్రియాన్వయు లగుదురు చరితఁ జూడఁగవిప్రజాతు లగుదు
ఆ|| రెఱుఁగ రాదు వారినీరెండుజాతుల,
వార కాని కారువైశ్యశూద్ర
హీనజాతు లనిన నెంతయుసంతస,
మందెఁబృషతపుత్రుఁడాత్మలోన. (228)
No comments:
Post a Comment