Translate

28 February, 2015

తెలుగు సుద్దులు - వేమన పద్యములు (తెలుగు - ఇ కూటమిలో పెట్టబడినవి) -152



తెలుగు సుద్దులు…..(152)
.వెదొంగతనము రంకు దొరసియుండు జగతి
       రంకులా`డి కిం` శంక బుట్టు;
          దొంగకె`(న్న)రే వెలుంగొ`ప్పు కానట్లు        
       విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః                  
లోకంలో దొంగతనము, జారతనములకు అవినాభావ సారూప్యమున్నది.  దొంగతనము చేసేవ్యక్తికి ఎలా వెన్నెల ఇష్టముండదో (తన పని పూర్తిచేసుకొనడానికి చీకటిని అభిలషిస్తారు కనుక) అలాగే వ్యభిచారి కూడా భయం, భయంగా ఎవరన్నాచూస్తారేమోనని అనుమానంతోటే జీకటి బ్రతుకునే కోరుకుంటాడు/కోరుకుంటుంది (బహుశా నాటి కాలము కొంత భయము ఉండేదన్నమాట). జార, చోరత్వములు దూష్యములు కనుక, వేమన పద్యం ద్వారా చీకటి బ్రతుకులు బ్రతకక వాటికి దూరంగా ఉండమని హితవుపలుకుతున్నారు. ||22-02-2015||

18 February, 2015

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి- 064 (316 – 320)




ఓం గణేశాయనమఃగురుభ్యోనమః
                                                                         __/\__       
నారాయణం నమస్కృత్య  – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]
  


1.    ప్రాతికామి ఎవరు?
2.   ధృతరాష్ట్రుని కొడుకు ఒకడు యుద్ధం తరువాత బ్రతికి ఉన్నాడు? అతడెవరు?
3.   జరాసంధుడనే పేరు అతనికి ఎలా వచ్చిమ్ది?
4.   అర్జునునకు పార్ధుడనే పేరు ఎందుకు వచ్చింది?
5.    అజ్ఞాతవాసంలో సహదేవుని పేరేమి?
--------------------------------------------------------------------------------------
సమాధానములు (జవాబులు):
1.    దుర్యోధనుని సేవకుడు ద్రౌపదిని సభకు తీసుకురావడానికి; అనుద్యూతానికి ధర్మరాజుని తీసుకురావడానికీ ఇతడే వెళ్లాడు. సభాపర్వము ద్వితీయాశ్వాసము -206 పద్యము & 274 వచనము
|| అవనినాథుచేత నాజ్ఞాపితుం డయి
     సూతనందనుండు ప్రాతికామి
    పాండవాగ్రమహిషిపాలికిఁ జని భక్తి
    వినతుఁ డగుచు నిట్టు లనియె సతికి. (206)
|| కావున వారల ననుద్యూతంబునఁ బరాజితులం గావించి విరళ దేశనిర్వాసితులం జేయుట కార్యం బనిన   
    విని ధృతరాష్టుం డొడంబడి యప్పుడ యనుద్యూతార్ధంబు ధర్మనందనుం దోడి తేరం బ్రాతికామిం   
    బంచినం బితృనియోగంబును విధి నియోగంబు నతిక్రమింప నగునే యని. (274)

2.   యుయుత్సుడు -  

3.   జర అనే రాక్షసిచే సంధింపబడినవాడు సభాపర్వము ప్రథమాశ్వాసము 154 వచనము
|| అని దాని నతి ప్రీతిం బూజించి కొడుకు నెత్తికొని దేవీద్వయంబునకు నిచ్చి జరయనురాక్షసిచేత సంధింపఁబడినవాఁడు గావున జరాసంధుం డనుపే రిడి పురంబష్టశోభనంబు సేయించి యారాక్షసి కేఁటేఁట మహోత్సవంబు సేయించుచుం గొడుకు నతిగారవంబునం బెంచిన. (154)

4.   పృధ (ఇంద్రుని) యొక్క కొడుకు కనుక సంస్కృతంలో పార్ధశబ్దం పాండవులందరికీ ప్రయోగించబడ్డది.

5.    తంత్రీపాలుడు విరాటపర్వము ప్రథమాశ్వాసము 100 పద్యము
|| కీలారితనమునకు నేఁ
    జాలుదు నని కొలిచి మత్స్యజనపాలుకడన్
    మే లగునడవడిఁదంత్రీ
    పాలుం డనుపేరితోడఁ బరఁగుదు నధిపా. (100)
**********************************************************

15 February, 2015

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి- 063 (311 – 315)



ఓం గణేశాయనమఃగురుభ్యోనమః
                                                                         __/\__       
నారాయణం నమస్కృత్య  – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]

1.    అర్జునుని శంఖము పేరేమి? దానిని ఎవరు ఇచ్చారు?
2.   అర్జునుని కిరీటాన్ని పడగొట్టడానికి యత్నించిన వీరుడు ఎవరు? దేనితో?
3.   శతశృంగం నుండి వచ్చేటప్పటికి ధర్మరాజు వయస్సెంత?
4.   సంస్కృత శ్రీమహాభారతంలోని శ్లోకాల సంఖ్య సుమారుగా ఎంత?
5.    ధర్మవ్యాధుడెవరు? అతడెవరికి ధర్మబోధ చేశాడు?
--------------------------------------------------------------------------------------------------------------------
సమాధానములు (జవాబులు):
1.    దేవదత్తము ఇచ్చినవాడు అగ్ని -  ఆదిపర్వము – అష్టమాశ్వాసము

2.   కర్ణుడు నాగాస్త్రంతో నాగాస్త్రంనుండి అర్జునుని తప్పించడానికి కృష్ణుడు రథాన్ని అయిదు అంగుళాలు భూమిలోకి దించేశాడు.  దానితో ఆ నాగాస్త్రం అర్జునుని కిరీటాన్ని కొట్టిపోయింది. కర్ణపర్వము తృతీయాశ్వాసము 319-322 పద్యములు
|| పలుదెస మంటలు ప్రబ్బఁగ
     నలఘుస్ఫురణమున నిగుడు నయ్యస్త్రంబున్
     జలజాక్షుఁడు కని పంచాం
     గుళమాత్రము రథము ధరణిఁ గ్రుంగనదుముడున్. (319)
|| సుర గరుడఖచర విద్యా
    ధరఖేచరు లంబరం బుదాత్తధ్వనిసం
    భరితముగఁ బొగడి రమ్ముర
    హరు దివ్యప్ర సవిరచితార్చనతోడన్. (320)
|| కురువంశోత్తమ వారిదిక్కు ప్రజ సంక్షోభింప నప్పాఁపతూ
      పు రయం బుగ్రము కాగ బి ట్టడరి దంభోళిప్రభగ్నక్షమా
      ధర శృంగాకృతి గా హరించె బహురత్నస్ఫీతరశ్మిచ్ఛటా
      స్ఫురితం బైనకిరీటమున్ విజయునొప్పుం దేజముం గుందఁగన్. (321)
తే|| జనులు విహ్వలు లగునట్టి ఘనరవంబు
     దిశలయందు నాకసమున దీటుకొనఁగఁ
     గర్ణుఁ డట్లు భేధించె దిక్పతులచేత
     నైనఁ జెడనికిరీట మయ్యహిశరమున. (322)

3.   16 సంవత్సరాలు- ఆదిపర్వము షష్ఠాశ్వాసము – 142వచనము
అని పంచినం బురోచనుం డతిత్వరితగతి నరిగి దుర్యోధను కఱపినరూపున వారణావతంబున లాక్షాగృహంబు రచియించుచుండె నిట యుధిష్ఠర భీమార్జున యములుంగ్రమంబునం దొల్లి షోడశపంచదశ చతుర్దశ త్రయోదశవర్ష జాతులయి శతశృంగంబున నుండి హస్తిపురంబునకు వచ్చి యందుఁ గౌరవులం గలసి యస్త్రవిద్యలం గఱచుచుం బదుమూఁడేం డ్లుండి యపుడు ధృతరాష్ట్రునియోగంబున వారణావతంబునకు జననీసహితంబుగాఁ బోవ సమకట్టి మహాజవసత్త్వ సమేతంబు లయిన హయంబులం బూనినరథంబు లెక్కి ధనుర్ధరు లయి హస్తిపురంబు వెలువడునపు డప్పురంబునం గల బ్రాహ్మణక్షత్రియ ప్రముఖానేకజనంబులు శోకతప్త హృదయు లయి. (142)


4.   సుమారు లక్ష శ్లోకాలు ఆది పర్వము ప్రమాశ్వాసము పర్వ సంగ్రహము -34-64 (వచనములు, పద్యములు)
 ఆది పర్వము 9,984 ; సభా పర్వము 4,311 ; ఆరణ్య పర్వము    13,664 ; విరాట పర్వము 3,500 ;    
 ఉద్యోగ పర్వము 6,998 ; భీష్మ పర్వము 5,884 ; ద్రోణ పర్వము 10,919 ; కర్ణ పర్వము    4,900 ;  
 శల్య పర్వము 3,220 ; సౌప్తిక పర్వము 2,874 ; స్త్రీ పర్వము 1,775 ; శాంతి పర్వము 14,528 ;
  అనుశాసనిక పర్వము 12,000 ; అశ్వ మేధ పర్వము 4,520 ; ఆశ్రమవాస పర్వము 1,106 ;  
 మౌసల పర్వము 300 ; మహాప్రస్థానీక పర్వము 120; స్వర్గారోహణ పర్వము - 200
 మొత్తము శ్లోకాలు 1,00,803

5.    ధర్మవ్యాధుడు మాంసం అమ్ముకునే బోయవాడు కౌశికునకు పతివ్రత పంపితే ధర్మములు బోధిస్తాడు ఆరణ్యపర్వము పంచమాశ్వాసము 25 వచనము
|| ధర్మంబు బహుమార్గదృష్టం బయి సూక్ష్మం బయి యుండు నీవు కేవలస్వాధ్యాయ పరుండవు గాని ధర్మసూక్ష్మత యెఱుగవు కావున దడయక మిథిలానగరంబున కరుగు మందు జితేంద్రియుండును సత్యవాదియు మాతాపితృ భక్తుండును నయినవాఁడు ధర్మవ్యాధుం డనుకిరాతుండు నీకు నఖిలధర్మంబులు నెఱింగించి సంశయచ్ఛేదంబు సేయు నాదెసం బ్రసన్నుండ వగునది వనితలకుం బరిజ్ఞాంబు లేదు గావున వారెట్టియపరాధంబు సేసినను సహింపవలయుఁ గదా యనినఁ గౌశికుం డి ట్లనియె. (25)
**********************************************************