Translate

07 December, 2014

తెలుగు సుద్దులు - వేమన పద్యములు (తెలుగు - ఇ కూటమిలో పెట్టబడినవి) - 117



తెలుగు సుద్దులు…..(117)
               
.వె||పురుషుడెన్ని గతుల బుట్టింది మొదలుగ
      పాప చింత జేయు పామరమున
      మదిని గుంటికుక్క మాంసము దిన్నట్లు 
        విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః
మానవుడు అజ్ఞానంతో, మనోవైకల్యముతో మోహంలో పడి కోరికలతో పుట్టింది మొదలు, కుంటికుక్క ఎలాగా మాంసపు ముక్కకోసం పరిగెత్తలేక, పొందకూండానే దాన్ని తింటున్నట్లు ఊహించుకున్నట్లు, ఎన్నోరకాల చెడు, నిష్ప్రయోజనమైన (పరమాత్మకు సంబంధించని, వ్యర్థమైన) ఆలోచనలు, భావనలు చేస్తుంటాడు. కుక్కకు ఎలాగా దాని వలన కడుపు నిండదో, కోరిక తీరదో అలాగే మోహంలో పడిన మానవునికి కూడా పాపపు  చింతనల వలన అపూర్వమైన మానవజన్మ నిరర్థకమవుతుందని వేమన హెచ్చరిస్తున్నారు.
ఇంకో విధంగా, స్వతసిద్ధమైన గుణాలు (కుక్క- సాధారణ వీధికుక్కమాంసాహారి కనుక, అవటితనములోకూడా మాంసం తింటున్నట్లు కలలు కనడం సహజం కనుక) సమయములోను వదలి పెట్టవు సుమా అని కూడా తెలియచెప్పుతున్నట్లున్నది. బహుశా తేలికగా తెలియడానికి కుక్కను ఉదాహరణగా చెప్పియుండవచ్చు. కనుక మిత్రులు కుక్కను కించపర్చినట్లు భావించవలదని మనవి.||06-12-2014||

No comments:

Post a Comment