ఓం గణేశాయనమః – గురుభ్యోనమః
__/\__
నారాయణం నమస్కృత్య – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసం – తతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి
మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా [
1. పాండవుల పురోహితుడెవరు? ఎవరి సలహాతో పాండవులు వారిని పురోహితునిగా చేపట్టారు?
2. నకులునికి ద్రౌపదిగాక మరోభార్యఉంది ఎవరామె? వారి పుత్రుని పేరేమి?
3. తన పేరు కలిగిన స్త్రీనే వివాహమాడిన ముని ఎవరు?
4. బ్రహ్మశిరోనామకాస్త్రం ఇచ్చి ద్రోణుడు అర్జునుని ప్రత్యేకంగా ఒక గురు దక్షిణ ఇమ్మని కోరాడు, అదేమిటి?
5. ధృతరాష్ట్రుని తల్లి ఎవరు?
-------------------------------------------------------------------------------------------------------------
సమాధానములు (జవాబులు):
1. అంగారపర్ణుని (గంధర్వుడు) సలహాపై దేవలుని తమ్ముడు ధౌమ్యుడుని పురోహితునిగా పెట్టుకొన్నారు. - ఆది
పర్వము – సప్తమాశ్వాసము-157 వచనము & 158 పద్యము.
వ॥అనిన గంధర్వుండు పెద్దయుంబ్రొద్దువిచారించి యిచ్చోటికిం గుఱంగటనుత్కచంబనుపుణ్యతీర్థంబునం
దపంబుసేయు చున్నవాని ధౌమ్యుం డనుబ్రాహ్మణునిఁ బురోహితుఁగాఁబ్రార్థింపుం డమ్మహాత్ముండు మీకుఁ
బురోహితుం డైన సర్వార్థ సిద్ధి యగు ననిన సంతసిల్లి వానికి నాగ్నేయాస్త్రంబు విధియుక్తంబుగా నిచ్చి మాకు
నీ యిచ్చినహయంబుల నీయంద సంగ్రహించి యుండుము ప్రయోజనంబు గలనాఁడు గొనిపోయెద మని
గంధర్వు వీడ్కొని పాండవులు భాగీరథి నుత్తరించి యుత్కచం బను పుణ్యతీర్థంబున కరిగి యందు.(157)
ఉ|| వీతసమస్తదోషుఁ డయి వేడ్కఁ దపం బొనరించు చున్న వి
ఖ్యాతుఁ బురిహితప్రవరుఁ గా వరియించిరి భక్తితో జగ
త్పూతచరిత్రు సాధుజనపూజితు ధార్మికు ధౌమ్యు దేవల
భ్రాతృవరున్ మహాత్ము హితభాషణు భూసర వంశ భూషణున్. (158)
2. కరేణుమతి – నిరమిత్రుడు.- ఆది పర్వము – చతుర్థాశ్వాసము – 116 వచనము
వ॥....నకులునకుఁ జైద్య యయిన క రేణుమతికి నిరమిత్రుండు పుట్టె సహదేవునకు స్వయంవరలబ్ధ
యైనవిజయకు సుహోత్రుండుపుట్టె .... (116)
3. జరత్కారుడు(ముని) వాసుకి సోదరి జరత్కారువును వివాహమాడాడు. - ఆది పర్వము –
ద్వితీయాశ్వాసము – 154 పద్యము & 155 వచనము
శా|| ధన్యం బయ్యె భవత్కులం బతికృతార్ధం బయ్యె నస్మత్కులం
బన్యోన్యానుగు ణాభిధానములఁ జిత్తానంద మొందన్ వివే
కన్యాయాన్విత భూసురోత్తమ జరత్కారూ జగన్మాన్య యి
క్కన్యాభిక్షఁ బరిగ్రహింపుము జరత్కారున్ మదీయానుజన్. (154)
వ॥అనిన విని యొడంబడి జరత్కారుండు సనామ యగుటంజేసి యక్కన్యకను వివాహం బై
ప్రథమసమాగమంబునం దనధర్మపత్నికి సమయంబు సేసె నాకు నీ వెన్నండేని యవమానంబు దలంతువు
నాఁడ నిన్నుం బాసి పోవుదు నని నాఁటంగోలె. (155)
4.
బ్రహ్మశిరోనామకాస్త్రం ఇచ్చి ద్రోణుడు అర్జునుని తనతో ఎన్నడూ ప్రతియుద్ధం
చేయవలదని(ఈ అస్త్రంతో)
ప్రత్యేకంగా ఒక గురు దక్షిణగా కోరాడు, సామాన్యమానవుల
మీద ప్రయోగిస్తే అది లోకాలనుకాలుస్తుందని;
అర్జునికి ధీటైనవారు
తలపడినప్పుడుమాత్రమే వాడవలసినదిగా చెప్పి ఈ వరంకూడా అడుగుతాడు. - ఆది
పర్వము – షష్ఠాశ్వాసము – 98&100 వచనములు; 99 పద్యము
వ॥ఇట్లు పాండుకుమారు లపారగుణంబుల నెల్లవారికి నారాధ్యు లయి పరఁగుచున్న నందు ధనుర్విద్య
నర్జునుదృఢముష్టిలాఘవలక్ష్య వేధిత్వదూరాపాతజిత శ్రమత్వంబులకునసిగదాశక్తితోమరాదిప్రహరణ
ప్రవీతకుం బరమహీపాల పరాజయోత్పాదనపరాక్రమంబునకుఁదనవలనిభక్తిస్నేహంబులకుమెచ్చి
భారద్వాజుండు వానికి బ్రహ్మశిరం బనుదివ్యబాణంబు సప్రయోగనివర్తనంబుగానిచ్చి యి ట్లనియె. (98)
ఉ॥దీని నగస్తి నాఁ బరఁగుదివ్యమునీంద్రుఁడు దొల్లి ప్రీతితో
భూనత యగ్ని వేశుఁ డనుభూరిమునీంద్రున కిచ్చె వారలున్
మానుగ నాకు నిచ్చిరి క్రమంబున నేనును నీకు నిచ్చితిన్
దీనికి నీవ యర్హుఁడవు తేజమునం గడుఁబెద్ద గావునన్. (99)
వ॥దీని మానవులయందుఁ బ్రయోగింపకుండునది యల్పతేజులయందుఁ బ్రయుక్తంబయి యిదిజగంబులఁ గాల్చు
నిన్ను బాధించునట్టిమనవులు గలిగిరేని బ్రయోగించునది వారి నశ్రమంబున సాధించు నని దానిమహిమ
సెప్పి నీవు నీబంధుసమక్షంబున నాకు గురుదక్షిణ యి మ్మది యెయ్యది యనిన నాయుద్ధంబు
సేయునపుడు నాతో నెన్నఁడుఁ బ్రతియుద్ధంబు సేయకుండు మిదియ నాకు గురుదక్షిణ యి మ్మది యెయ్యది
యనిన నాయుద్ధంబు సేయునపుడు నాతో నెన్నఁడుఁ బ్రతియుద్ధంబు సేయకుండు మిదియ నాకు గురుదక్షిణ
యనిన నర్జునుండు వల్లె యని యాచార్యునకు నమస్కరించి దాని కొడంబడియె నంత దుర్యోధనుండు
యుధిష్ఠిరుయౌవరాజ్యాభిషేకంబునకు భీమార్జునయములపరాక్రమంబునకు మనంబున సహింపక కర్ణ
శకునిదుశ్శాసనులతో మంతనం బుండి యి ట్లనియె. (100)
5. అంబిక. - ఆది పర్వము – చతుర్థాశ్వాసము -256 పద్యము.
క|| బలవ న్మదనాగాయుత ( మదనాగఅయుత=మదపుటేనుఁగులు పదివేల)
బలయుతుఁడు సుతుండు పుట్టెఁ బ్రజ్ఞాచక్షుం ( ప్రజ్ఞాచక్షుండు=గ్రుడ్డివాడు)
డలఘుఁడు ధృతరాష్ట్రుం డా
లలనకు నంబికకుఁ గురుకుల ప్రవరుం డై. (256)
************************************************************************************
[
No comments:
Post a Comment