తెలుగు సుద్దులు…..(126)
ఆ.వె||మన్నును దినుమం`టె మండేరు జనులార
మంట్టి లోని మేలు మరువనే`ల
నీళ్లలోని మేలు నిఖిలమై యుండురా!
విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః
మట్టిని తినమంటే జనులు మండిపడతారు; మట్టిలోని మంచిని మరిచిపోతేఎలాగా? నీళ్లలోని మంచి సర్వమై (సంపూర్ణంగా వ్యాపించి) ఉంటుంది. ఈ పద్యంలో వేమన పంచభూతాలలో మానవుని ఉనికికి మూలాధారమైన మన్ను (తనకు అవసరమైన ఆహారాన్ని నిత్యం అందిస్తున్నది; తను జీవనము సాగించడానికి, నివసించడానికి దోహదపడుతున్నది), నీటి యొక్క విశిష్టతను కూడా తెలియచెప్పుతూ, వాటిని తృణీకరించడము స్రేయస్కరము కాదని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా సృష్టికి మూలమైన పరమాత్మను గుర్తించి కొలవమంటే సామాన్యమానవులు ఈసడించుకోవటము, మండిపడటము తగదని హితవుపలుకుతున్నారు. ||25-12-2014||
No comments:
Post a Comment