Translate

20 December, 2014

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి- 029 (141 – 145)



ఓం గణేశాయనమఃగురుభ్యోనమః
                                                                         __/\__   
    
నారాయణం నమస్కృత్య  – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]
 
1. అరణ్యంలోని పాండవులు నియమం తప్పి కౌరవుల మీదకు దండెత్తే స్థితిలో లేరుగదా! అని ధృతరాష్ట్రుడు ఒక  
   మహర్షిని ప్రశ్నిస్తాడు. ఎవరా మహర్షి?
2.
కిమ్మీరుని వధ విని కౌరవులకు గుండె బ్రద్దలైనట్లు అయిందట- ఎవరు చంపారు? కిమ్మీర వధ గురించి    
   కౌరవులకు ఎవరు చెప్పారు?
3.
ధర్మానికి కుదురు ఏది?
4.
తాను పొందిన దివ్యాస్త్రాలను అర్జునుడు సోదరులకు ప్రయోగించి చూపిస్తే ఒక మహర్షి వచ్చి వారిస్తాడు. ఎవరా       మహర్షిఎందుచేత?
5.
అర్జునుని వింటికి అజరమయిన నారి ఎవరి వల్ల వచ్చింది?




సమాధానములు (జవాబులు):
1.
మైత్రేయుడు. పాండవులు సమయం అతిక్రమిస్తే సూర్యచంద్రుల గతులు తప్పుతాయి అంటాడు
  మైత్రేయుడు. - ఆరణ్యపర్వము ప్రమాశ్వాసము - 100 పద్యము
||వారలు సమయము దప్పిన
    వారిజరిపుహితులగతు లవశ్యముఁ దప్పున్
   
వారికి నకారణంబ ని
    కారము నీకొడుకు సేసెఁ గడునహితుం డై. (100)

2.
కిమ్మీరుని భీముడు చంపిన విషయము విదురుడు ధృతరాస్ట్రునకు (కౌరవులకు) చెప్పాడు. -
   ఆరణ్యపర్వము ప్రమాశ్వాసము - 121 వచనము
  ఇట్లు ధర్మరాజువచనంబునఁ గిమ్మీరు నశ్రమంబున వధియించి తద్వనవాసులకు రాక్షసభయం
       బుడిపినమహావీరు నమ్మారుతాత్మజుధర్మార్జుననకులసహదేవులును ధౌమ్యాదిమహీసురవరులును
       బ్రశంసించి రని విదురుండు గిమ్మీరువధ సెప్పిన విని ధృతరాష్ట్రునకు హృదయచలనం బయ్యెనిట
       పాండవులు కామ్యకవనంబున నుండునంత. (121)

3.
దాక్షిణ్యము ధర్మమునకు కుదురు. - ఆరణ్యపర్వము సప్తమాశ్వాసము 442 పద్యము
||అమరఁగ దాక్షిణ్యము
   ర్మమునకుఁ
గుదు రండ్రు కీర్తి మహిమనెలవు దా
   నము సత్యము సుర పురిమా
   ర్గము శీలము సంశ్రయము సుఖంబుల కెల్లన్. (442)

4.
నారదుడు. లక్ష్యం లేకపోతే దివ్యాస్త్రాలు లోకాలనే దహిస్తాయి కనుక. - ఆరణ్యపర్వము
   చతుర్థాశ్వాసము  - 96 పద్యము; 95&97 వచనములు
అంత సురగణచోదితుండై నారదుం డర్జునుపాలికి వచ్చి యి ట్లనియె. (95)
ఎదురు లేక దివ్యాస్త్రంబు లిట్లు నీకుఁ
    బాడియే ప్రయోగింపంగఁ బాండుపుత్ర
    సిద్ధ మివి యధిష్ఠానవర్జితములయ్యె
    నేని మూఁడులోకములు దహించు మాత్ర. (96)
అని యర్జును వారించి నారదుం డరిగిన నమరు లెల్ల నిజస్థానంబుల కరిగి రిట్లు పాండవులు పదిమాసంబు
       లుండునంత నొక్కనాఁ డమరకన్యలు వచ్చి యర్జునున కి ట్లనిరి. (97)

5.
ఇంద్రుడిచ్చాడు. నివాతకవచులను చంపటానికి వెళ్లేముందు ఇంద్రుడు స్వయంగా నారిని గాండీవానికి  
     యోజించాడు. - ఆరణ్యపర్వము చతుర్థాశ్వాసము - 56 వచనము.
అని తన తొడిగినయిద్దివ్యభూషణంబుల నిమ్మణికిరీటంబున నన్ను విభూషితుం జేసి స్పర్శరూపం
    బైనయీయభేద్యకవచంబు నిచ్చి యజరం బయిన యిగ్గొనయంబు గాండీవంబునం దాన యోజించి   
    పదివేల హంస మయూర వర్ణమాననీయహయంబులం బూనినరథంబు మాతలిప్రయుక్తం బైనదాని నెక్కం  
    బనిచి నివాతకవచ వథార్థం బరుగు మని నియోగించిన నింద్రు వీడ్కొని చనుచున్ననాతో దేవత లి ట్లనిరి. (56)


**********

No comments:

Post a Comment