ఓం గణేశాయనమః – గురుభ్యోనమః
__/\__
నారాయణం నమస్కృత్య – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసం – తతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]
1. సభలో గుప్తంగా చేయవలసిన పనులేవి? ఎందుచేత?
2. తిక్కన ప్రయోగం “కుంతీసుతమధ్యముండు” అనే సమాసం ఎవరిని చెపుతుంది?
3. అర్జునకు బీభత్సుడనే పేరు ఎందుకు వచ్చింది?
4. ఉత్తర గోగ్రహణంలో అర్జునుడు మన సేన మీదకు వస్తున్నాడు అని ద్రోణుడంటే కర్ణ
దుర్యోధనులేమన్నారు?
5. “వచ్చినవాడు ఫల్గుణుడు” అన్న ప్రసిద్ధమయిన పద్యము ఎవరు అన్నది?
సమాధానములు (జవాబులు):
1. అ) ఆవులింత ఆ) తుమ్ము ఇ) నవ్వు ఈ) ఉమ్మివేయడం ఇవి రహస్యంగా చేయాలి. ప్రక్కవారికి
ఇవి అహస్యం కలుగచేస్తాయి కనుక. - విరాట పర్వము – ప్రథమాశ్వాసము – 137 పద్యము
ఆ||ఆవులింత తుమ్ము హాసంబు నిష్టీవ
నంబు గుప్తవర్తనములు గాఁగఁ
జలువవలయు నృపతి గొలువున్న యెడల బా
హిరము లైనఁ గెలని కెగ్గు లగుట. (137)

2. అర్జునుని – కుంతి పాండవులందరినీ తనకొడుకులవలెనే చూసుకొనేది. ఆభావం తెలియజేయటానికే ఆపదం
తిక్కన ప్రయోగించాడంటారు. - విరాటపర్వము – చతుర్థాశ్వాసము - 95 పద్యము
శా||సింగం బాఁకటితో గుహాంతరమునం జేడ్పాటుమై నుండి మా
తంగస్ఫూర్జితయూథదర్శనసముద్యత్క్రోధ మై వచ్చునో
జం గాంతారనివాసఖిన్న మతి నస్మత్సేనపై వీఁడె వ
చ్చెం గుంతీసుతమధ్యముండు సమరస్థేమాభిరామాకృతిన్. (95)
శా||సింగం బాఁకటితో గుహాంతరమునం జేడ్పాటుమై నుండి మా
తంగస్ఫూర్జితయూథదర్శనసముద్యత్క్రోధ మై వచ్చునో
జం గాంతారనివాసఖిన్న మతి నస్మత్సేనపై వీఁడె వ
చ్చెం గుంతీసుతమధ్యముండు సమరస్థేమాభిరామాకృతిన్. (95)
3. బీభత్సంగా యుద్ధం చెయ్యడు కాబట్టి – నకుర్యాంకర్మ బీభత్సం అని సంస్కృతము. శుభం కలిగించాలనే
సంకల్పం కలవాడనే అర్ధం కూడా చెపుతారు. (భదికల్యాణే అనే ధాతువుకు భీభత్సపదం సన్నంతం.) -
విరాటపర్వము – చతుర్ధాశ్వాసము - 144 పద్యము
తే||వీరులకుఁ జూడ బీభత్సవిధము గలుగ
నట్టి కార్యంబు సేఁతకు నెట్టిసమర
భంగులను దడఁబడక బీభత్స సేయ
దాన బీభత్సుఁ డనునభిధానమయ్యె. (144)
తే||వీరులకుఁ జూడ బీభత్సవిధము గలుగ
నట్టి కార్యంబు సేఁతకు నెట్టిసమర
భంగులను దడఁబడక బీభత్స సేయ
దాన బీభత్సుఁ డనునభిధానమయ్యె. (144)
4. “నా బాణాలతో అర్జునుని సంహరిస్తా” నని కర్ణుడన్నాడు. అందరినీ మళ్ళీ అరణ్యవాసానికి పంపుతానని దుర్యోధనుడన్నాడు. ఈ మాటలకు భీష్ముడూ, ద్రోణుడూ, కృపుడూ, అశ్వత్థామా లోలోపల నవ్వుకొన్నారు. - విరాటపర్వము – చతుర్థాశ్వాసము - 99,101&103 పద్యములు
ఆ||ఆతఁడు వచ్చెనేని నస్మచ్ఛిలీముఖ
పాతచలితహృదయపద్ముఁ జేసి
వెగడుపఱిచి యోధవీరుల కెల్ల ను
త్సవ మొనర్తు బాహుదర్ప మొప్ప. (99)
ఆ||తప్పఁ బలికి తీవు సెప్పెద విను మితఁ
డర్జునుండ యేని నడవి కేగి
బ్రాతృయుతము గాఁగఁ బండ్రెడువత్సర
ములును నంద నిలువవలఁయు మగుడ. (100)
క||అనుపలుకులకును భీష్ముం
డును ద్రోణుఁడు ద్రోణసూనుఁడును గృపుఁడును మే
లని యియ్యకొనిరి హృదయా
ననురూపము లైన తెలువు లాస్యముఁబొందన్. (103)
5. భీష్ముడు. ఉత్తర గోగ్రహణ సందర్భంలో. విరాటపర్వము – చతుర్థాశ్వాసము - 234 పద్యము
ఉ||వచ్చినవాఁడు ఫల్గునుఁ డవశ్యము గెల్తు మనంగ రాదు రా
లచ్చికినై పెనంగినబలంబులు రెండును గెల్వ నేర్చునే
హె చ్చగుఁ గుం దగుం దొడరు టెల్లవిధంబుల కోర్చు టట్లు గా
కిచ్చఁ దలంచి యొక్క మెయి నిత్తఱిఁ బొం దగుచేఁతయుం దగున్. (234)
No comments:
Post a Comment