Translate

10 December, 2014

తెలుగు సుద్దులు - వేమన పద్యములు (తెలుగు - ఇ కూటమిలో పెట్టబడినవి)-119



తెలుగు సుద్దులు…..(119)
.వె||మొదట బోయు నీరు (మొగి) బీజముల కె`క్కి
       మొదటి కు`రుక వేగ మొలకలె`త్తు
       మొలక పృథివి బెరిగి వెలయును వృక్షంబు
         విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః
మొదట పోసిన నీరు ముందుగా మొత్తం విత్తనములకు చేరి (విత్తనములు తీసుకొని), నీరు వేగంగా పారి మొలకలు వస్తాయి, మొలక భూమిలో పెరిగి పెద్ద చెట్టుగా అవిర్భిస్తుంది (భూమిలోనుండి పుట్టుకు వస్తుంది). అన్న(ఆహారం) రసం/జీవశక్తి (నీరు) బీజములకు చేరి, శుక్లము, అండము, పిండము (మొలక), మాతృగర్భము (పృథివి), శిశువుగా(వృక్షము) అన్వయించుకుంటే ఇక్కడ వేమన ఉత్పత్తి విధానం కూడా తెలుపుతున్నట్లున్నది. ||10-12-2014||

No comments:

Post a Comment