ఓం గణేశాయనమః – గురుభ్యోనమః
__/\__
నారాయణం నమస్కృత్య – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసం – తతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]
1. ఉత్తర గోగ్రహణ సమయంలో సంధిచేసుకొమ్మని దుర్యోధనునికి చెప్పిన దెవరు?
2. అజ్ఞాతవాసం ముందు “నేను ఇక నడవలేను” అన్న ద్రౌపదిని ఎత్తుకొని వచ్చినదెవరు?
3. కీచకుడూ, భీముడూ భయపడుతూ చప్పుడు చేయకుండా కొట్టుకున్నారుట, భయమెందుకు?
4. ఉత్తర గోగ్రహణంలో యుద్ధానికి ముందు అర్జునుడు గురు, కృప, భీష్ములకు నమస్కరించాడు, ఎట్లు?
5. “ఈ చిఱుత గద్దియకుం దగడే నరేశ్వరా?” ఆ చిఱుత గద్దియ ఎవరిది? తగిన వాడెవడు?
సమాధానములు (జవాబులు):
1. భీష్ముడు. – విరాటపర్వము – చతుర్థాశ్వాసము - 234 పద్యము
ఉ||వచ్చినవాఁడు ఫల్గునుఁ డవశ్యము గెల్తు మనంగ రాదు రా
లచ్చికినై పెనంగినబలంబులు రెండును గెల్వ నేర్చునే
హె చ్చగుఁ గుం దగుం దొడరు టెల్లవిధంబుల కోర్చు టట్లు గా
కిచ్చఁ దలంచి యొక్క మెయి నిత్తఱిఁ బొం దగుచేఁతయుం దగున్. (234)

2. అర్జునుడుః ముందు ధర్మరాజు నకులిని ఎత్తుకొమ్మన్నాడు. ఆతడు నేను అలసిపోయా నన్నాడు.
అప్పుడు సహదేవునికి చెపితే అతడూ అంతే అన్నాడు. అప్పుడు అర్జునునికి చెప్పాడు ధర్మరాజు.
- విరాట పర్వము – ప్రథమాశ్వాసము – 154 పద్యము
ఉ||ఇమ్మదిరాక్షి డస్సె మన కీనడుమన్ విడియంగ నొండుచో
టిమ్మును గాదు నిక్కమున కేమును డస్సితి మట్లు గాన నీ
వెమ్మెయి నైన దీని భరియించి పురంబుసమీపభూమికిం
దె మ్మని చెప్ప నాతఁడును దెచ్చెఁ బ్రియంబునఁ బుష్పకోమలిన్. (154)
3. తన చెడ్ద పని అందరికి తెలుస్తుందని కీచకుని భయం. అజ్ఞాతవాసం చెడిపోతుందని భీముని భయం. -విరాట
పర్వము – ద్వితీయాశ్వాసము – 345 పద్యము
క||తనయగపా టొరు లెఱుఁగుదు
రని సూతుఁడు సమయభంగమగుటకు భీముం
డును గొంకుచుఁ జప్పుడుసే
యనిగూఢవిమర్దనప్రహారములఁ దగన్. (345)
క||తనయగపా టొరు లెఱుఁగుదు
రని సూతుఁడు సమయభంగమగుటకు భీముం
డును గొంకుచుఁ జప్పుడుసే
యనిగూఢవిమర్దనప్రహారములఁ దగన్. (345)
4. రెండేసి బాణాలు పాదాల దగ్గర పడేటట్లు వేసి పాదాభివందనం చేశాడు.- విరాటపర్వము – చతుర్థాశ్వాసము -
252& 255 వచనములు
వ॥ఇప్పుడు నాకుఁ బ్రణామంబులుగాఁ బాదంబులమొదలం బడ రెం డమ్ము లేసి పెద్దకాలం బేనిఁ బాసి
వ॥ఇప్పుడు నాకుఁ బ్రణామంబులుగాఁ బాదంబులమొదలం బడ రెం డమ్ము లేసి పెద్దకాలం బేనిఁ బాసి
యున్నవాఁడు
గావునఁ గుశలప్రశ్నంబుగాఁ జెవులు సోఁకియుం జోఁకములుగా రెం డమ్ము లేసె నని పలికి
వెండియు
ని ట్లనియె. (252)
వ॥అనియెఁ గృపాచార్యభీష్ములు పార్థుబాణపాతప్ర్కారంబులు ప్రణామకుశలప్రశ్నంబులు గా నంతరంగంబులం
గనికొని సంతసిల్లిరి ధనంజయుండును దక్కిన వారికి దుర్నిరీక్ష్యుం డగుచు నమ్మోహరంబుదెస ననాదరంబు
సేసి గోవుల పజ్జంబోవు చుండె నతనిం జూచి సురనదీసూనుండు కురువీరులతో ని ట్లనియె. (255)
5. విరాటునిది – తగినవాడు ధర్మరాజు - విరాట పర్వము – పంచమాశ్వాసము – 321 పద్యము
ఉ||ఈతఁ డజాతశత్రుఁడు మహిం దగ దిగ్విజయంబు సేసె వి
ద్యాతిశయార్ధి వాసవుమహాసన మైనను నెక్క నర్హుఁ డు
ద్ద్యోతితమూర్తి గౌరవకులోద్వహుఁ డార్యనికాయసంతత
ఖ్యాతచరిత్రుఁ డీచిఱుతగద్దియకుం దగఁడే నరేశ్వరా. (321)
***********
No comments:
Post a Comment