Translate

21 December, 2014

తెలుగు సుద్దులు - వేమన పద్యములు (తెలుగు - ఇ కూటమిలో పెట్టబడినవి)-124

తెలుగు సుద్దులు…..(124)
ఆ.వె||ఇట్టి కనుల బ్రహ్మమె`ట్టు చూడగవచ్చు
జూచుకనులు వేరు చూపు వేరు
చూపు లోన నుం`చి చూడంగ వలవదా?
విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః
బాహ్య విషయాలాను గుర్తించగల మన బాహ్య నేత్రములతో బ్రహ్మను (పరమాత్మను) గుర్తించలేము (చూడలేము). పరమాత్మను దర్శించాలంటే అంతర దృష్టి (లోచూపు- తన్ను తాను తెలుసుకొనె ప్రయత్నము) అవసరము – ఆత్మ పరిశీలన అవసరమని దానికి తగిన విధంగా మన దృష్టిని మలుచుకోమని యోగిగా వేమన హితవు పలుకుతున్నారు. ||20-12-2014||

No comments:

Post a Comment