Translate

13 December, 2014

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి- 022 (106 – 110)


ఓం గణేశాయనమఃగురుభ్యోనమః
__/\__

నారాయణం నమస్కృత్య  – నరంచైవ నరోత్తమమ్|

దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్|

[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]

1. సాల్వునితో కృష్ణుడెంత కాలము యుద్ధం చేసాడు?
2. ఘోషయాత్ర మాటకు అర్ధమేమిటి?
3. వ్యాసుని వ్రాయసకాడు ఎవరు?
4. అరణ్యవాసం చేస్తున్న పాండవులపై దండెత్తి చంపుదామని దుర్యోధనునకు సలహా చెప్పినదెవరు?
5. భారత యుద్ధానికి పూర్వము అర్జునుడు పాశుపతాస్త్రం ఉపయోగించాడు, ఎప్పుడు?
సమాధానములు (జవాబులు):
1. 10 నెలలు. ఆరణ్యపర్వము ప్రమాశ్వాసము 150 వచనము

ఏను సముద్రతీరంబున సాల్వుతోడం బదినెలలు యుద్ధంబుసేసి వాని వధియించు పొంటె నక్కడ 
    మసలితి (150) 

2.
గొల్లపల్లెకు పోవడం. అరణ్యపర్వము పంచమాశ్వాసము 371 & 372 పద్యములు
కం|| అనిన నతండును గొండొక
      మనమునఁ జింతించి బుద్ధిమంతుల రై గో
      ధనము నరసి తడయక రం
      డని వారికి నెట్ట కేల కనుమతి యిచ్చెన్. (371)
|| క్షణంబ కౌతు కాతిశయవ్యగ్ర
     హృదయుఁ డైన ఫణధరేంద్ర కేతు
     నాజ్ఞఁ గరిపురంబునం దెల్లఘోషింపఁ
     బడియె ఘోషయాత్ర ప్రకటలీల. (372)

 
3. విఘ్నేశ్వరుడు.

 
4. కర్ణుడు. - ఆరణ్యపర్వము ప్రమాశ్వాసము 73 వచనము; 74 పద్యము

వీర లింకఁ బాండవుల నిందులకు రవించువర లయిన నగ్నివిషజలంబులు ప్రయోగించి 
    వరలకపయంబు సేయుద మనిన విని శకుని దుర్యోధనుంజూచి యి ట్లేల బాలిశం బైనమతిఁ 
    దలంచితివి విదురధృతరాష్ట్రులు విపరీతమతులై రావించినను నిత్యసత్యనిరతులైన 
    యప్పాండవులు తమచేసిన సమయంబు సలుపకయేల వచ్చువా రగుదు రనిన 
    శకునిదుర్యోధనులకుఁ గర్ణుం డిట్లనియె. (73)   
|| ఇత్తఱిఁ బన్నిపోయి పయి నెత్తి రణం బొనరించి వారలన్
     మిత్తికి నంపి ధాత్రి నిరమిత్రముఁ జేయుద మిట్టు లైనఁ
     ద్వృత్తులు నీక దక్కుఁ గురువీర కడంగుము నావుడున్ మదో
     న్మత్తుఁడు కౌరవుం డతనిమాటకు సంతస మంది చెచ్చెరన్. (74)

 
5. పౌలోమ కాలకేయాసురలను (60,000) సంహరించటానికి. - ఆరణ్యపర్వము చతుర్థాశ్వాసము 84 & 86 పద్యములు.
|| ఉరగఫణాగ్రరత్నకిరణోల్లసదుగ్రభుజున్ వృషాంకు శం
     కరు శశిఖంఢమండితశిఖండు శివుని హృదయాంబుజంబునం
     దిరముగ నిల్పి పాశుపతదివ్యశరం బరిఁబోసి యేసితిన్
     సురరిపుకోటిమీఁద హరిసూతుఁడు మాతలి మెచ్చి చూడగాన్. (84)
కం|| వంచనయును మాయయు మా
       యించి పరాక్రాంతి నయ్యు మేశాస్త్రమునం
       గ్రంచఱ నంతకుపరి కే
       గించితిఁ బౌలోమకాలకేయాసురులన్. (86)

*******************


 

No comments:

Post a Comment