ఓం గణేశాయనమః – గురుభ్యోనమః
__/\__
__/\__
నారాయణం నమస్కృత్య – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసం – తతో జయముదీరయేత్||
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తి గారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) (1994) పుస్తకము ఆధారముగా.]

1. ధర్మసూక్ష్మం అంటే ఏమిటి?
ధర్మవ్యాధుడు చెప్పిన ధర్మ సూక్ష్మం ఏది?
2. దేనిని విడిచి మానవుడు నిశ్శోకుడు అవుతాడు?
3. జీవన్మృతుని లక్షణం ఏమిటి?
4. అహింస అంటే ఏమిటని ధర్మవ్యాధుడు చెప్పాడు?
5. పాండవులను చంపటానికి అడవులకు బయలుదేరిన దుర్యోధనుని వారించినదెవరు?
సమాధానములు (జవాబులు):
1. అనేక ధర్మాలకు వైరుద్ధ్యం ఏర్పడినపుడు తగిన దాన్ని తెలుసుకోవడం.
సత్యానికీ భూతదయకూ (అహింసకూ) వైరుద్ధ్యం ఏర్పడినపుడు భూతదయ వహించాలి. ఇది ధర్మసూక్ష్మం. -

ఆరణ్యపర్వము – పంచమాశ్వాసము – 62 పద్యము.
ఉ||భూతహితంబుగాఁ బలుకుబొంకును సత్యఫలంబు నిచ్చుఁ ద
ద్భూతభయాస్పదం బగు ప్రభూతపుసత్యము బొంకునట్ల ప్రా
ణాతురుఁ డైనచోఁ బరిణయంబునయందును బల్కుబొంకు స
త్యాతిశయంబ యండ్రు మహితాత్మక యిట్టివి ధర్మసూక్ష్మముల్. (62)
2. క్రోధము. - ఆరణ్యపర్వము – సప్తమాశ్వాసము - 452 పద్యము.
తే||సర్వజనసమ్మతుండగు గర్వముడిగి
క్రోధమడఁచి శోకమునకుఁ గొలువుగాఁడు
విన వెయర్థాఢ్యుఁడగులోభ మొనరవిడిచి
తృష్ణవర్జించిసౌఖ్యంబు తెరువుఁగాంచు.(452)
3. దేవతలకు, అతిధులకు, పితరులకు, సేవకులకు పెట్టకుండా తినేవాడు. - ఆరణ్యపర్వము – సప్తమాశ్వాసము -

432 పద్యము.
క||నా విని యతఁ డాతనితో
జీవన్మృతుఁ డెట్టివాఁడు చెప్పు మనుటయున్
దేవాతిథిపితృభృత్యజ
నావళులకు నిడక కుడుచునతఁ డని చెప్పెన్. (432)
4. తమకు చేతనయినంతలో హింసకు దూరంగా పోవడమే అహింస. - ఆరణ్యపర్వము – పంచమాశ్వాసము –

60 పద్యము.
తే||హింస సేయనివాఁడు లేఁ డిజ్జగమున
నొక్కఁడైనను దమతమయోపినట్లు
హింస తెరువున కెడగల్గి యేగ వలయు
నదియ చూవె యహింస నానతిశయిల్లు. (60)
5. వ్యాసమహర్షి. – ఆరణ్యపర్వము – ప్రథమాశ్వాసము - 75 వచనము.
వ||సమరసన్నద్ధుఁ డై సమస్తబలంబును సమకట్టి వెలువడినం దనదివ్యదృష్టి నంతయు నెఱింగి

కృష్ణద్వైపాయనుండు వచ్చి యిది ధర్మంబుగా దుడుగు మని దుర్యోధనుని వారించి ధృతరాష్టృన కి ట్లనియె.
(75)
********
********
No comments:
Post a Comment