Translate

23 December, 2014

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి- 031 (151 – 155)



ఓం గణేశాయనమఃగురుభ్యోనమః
                                                                         __/\__       
నారాయణం నమస్కృత్య  – నరంచైవ నరోత్తమమ్|

దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్|

[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]

 

1. ఉత్తర గోగ్రహణంలో అర్జునుని ముందుగా గుర్తించిన దెవరు?
2.
కీచకుని సంహరించినది భీముడే అయిఉంటాడని ఊహించినదెవరు?
3.
అర్జునునకు ధనంజయుడనే పేరు ఎలా వచ్చింది?
4.
ఉత్తర గోగ్రహణంలో యుద్ధానికి ముందు అర్జునుడు గురుకృపభిష్ములను కుశల ప్రశ్నచేశాడు, ఎట్లు?
5.
కీచకులను చంపించిందని సుదేష్ణ మాలినిని ఊరు వెడలి పొమ్మంది, అపుడు మాలిని ఏమంది?
--------------------------------------------------------------------------------
సమాధానములు (జవాబులు):
1.
ద్రోణుడు. విరాటపర్వము చతుర్ధాశ్వాసము - 91 పద్యము.
|| వెరవరి గాక వీడు కురువీరులకుం బొడసూపువాఁడె
    చ్చెరు వొక మ్రానివేర నిట నేరఁగ వచ్చుచు నున్న వాఁ డహం
    కరణమ కాని యొం డొకటి గానఁడు మూర్తివిశేష మారయన్
    సురపతియట్ల వీనిమదిచొ ప్పది యేట్లొ యెఱుంగ నయ్యెడున్.(91)

2.
దుర్యోధనుడు - విరాట పర్వము తృతీయాశ్వాసము 114 - 116 పద్యములు
|| సింహబలుఁడు భీమసేనుండు శల్యుండు
    హలధరుఁడు సమానబలమువార
    లొండొరులను గెల్చునుత్సాహమునుగల
    రుద్ధతులును బాహుయుద్ధపరులు. (114)
|| ఈనలువురభుజశక్తుల
    తో నెనయఁగ జాలునట్టిదోర్బల మెందుం
    గానము గావున వీరల
    లోనన యొండొరుల కని గెలుపు సమకూరున్. (115)
|| తక్కినవార లాతనికి దవ్వుల చోటులవారు వాయుజుం
    డొక్కఁడ యింక సింహబలునుద్ధతి మాన్చిన మాన్చువాఁ డతం
    డక్కఁడ నిల్చెఁ గావలయు నాసతి ద్రౌపది గాఁగ నోపు వే
    ఱొక్కరుఁ డాజిఁ గీచకుల నోర్వఁగఁ జాలమి మీ రెఱుంగరే. (116)

3.
ధరణి జయించి ధనాన్ని జయించడంచేత. - విరాటపర్వము చతుర్ధాశ్వాసము - 141 పద్యము.
|| ధరణి యెల్ల గెలిచి తగ ధనంబులు గొని
    యునికి నే ధనంజయుండ నైతి
    నెట్టివారి నైన నెదిరినఁ బోర
    యంబు గొనుట విజయుఁ డంద్రు నన్ను. (141)

4.
చెవుల ప్రక్కనుండి రెండేసి బాణాలు దూసుకొని పోయేటట్లు వేసి. - విరాటపర్వము చతుర్ధాశ్వాసము -250  
      వచనము.
…….గురుకృపగాంగేయులకుఁ జరణ సమీపస్థలంబుల నిలువ రెండును గర్ణాభ్యర్ణప్రదేశంబులంజన   
      రెండునుగా నాలుగేసి యమ్ము లేసిననాసవ్యసాచిం జూచి యాచార్యుండు పరిసరవర్తు లగునాప్త జనంబులతో
      నల్లనయర్జునుం డింత యొప్పియుండునే యని యగ్గించి వెండియు. (250)

5.
ఇంక 13 రోజులు అక్కడ ఉండనీయమన్నది. విరాట పర్వము తృతీయాశ్వాసము 63 పద్యము
|| ముందటియట్ల యింకఁ బదుమూఁడుదినంబులమాత్రకున్ భవ
    న్మందిరవాస మియ్యకొనినం గడతేఱు మదియవాంఛ యం
    తం దగఁ దోఁచి మత్పతు లుదా త్తమతిన్ భవదీయవాంఛితం
    బుం దలకొల్పఁ జాలుదు పూర్వమనఃప్రమదంబు సేకుఱున్. (63)
@@@@@@@@@

No comments:

Post a Comment