Translate

12 December, 2014

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి- 021 (101 – 105)


ఓం గణేశాయనమఃగురుభ్యోనమః

__/\__

నారాయణం నమస్కృత్య  – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్|

[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]


          1. ధృతరాష్ట్రుడు పొమ్మన్న విదురుడు ఎక్కడికి, ఎవరి దగ్గరికి వెళ్ళాడు
          2. అరణ్యంలోని పాండవులను చేరిన విదురుని మళ్ళీ తీసుకు వచ్చేందుకు ఎవరు వెళ్ళారు? 
          3. పాండవులకు రాజ్యమిమ్మని శకుని దుర్యోధనునితో చెపుతాడు ఎపుడు? 
          4.కాగల కార్యం గంధర్వులే తీర్చారు ఈ మాటలెవరివి? ఎప్పుడన్నారు? 
          5.అరణ్యవాసం చివర ధర్మదేవత ధర్మరాజుకు ఇచ్చిన వరం ఎమిటి?

     సమాధానములు(జవాబులు)

         1.కామ్యకవనానికి, పాండవులదగ్గరకు. పాండవులు అరణ్యాలకు వెళ్ళగనే విదురుడు ఈ దుర్యోధనుని  
         తొలగించి కులాన్ని రక్షించు మని ధృతరాష్ట్రునికి భోదిస్తాడు.  అప్పుడు ధృతరాష్ట్రునికి కోపం వస్తుంది.    
         వాళ్ళను పొగడి మావాళ్ళను నిందిస్తుంటావు, నీ విక్కడ ఉండవద్దు, నీ యిష్టం వచ్చిన చోటికి పో 
         అన్నాడు. వెంటనే విదురుడు అరణ్యాలలో ఉన్న పాండవుల దగ్గరకు కామ్యకవనానికి వెడతాడు.-   
         ఆరణ్యపర్వము   ప్రథమాశ్వాసము 54 వచనము.
        వనీవు నాకొడుకులయున్నతి కెన్నండు సహింపవు నీసహయత్వంబు నేనొల్లఁబాండవులకడ కేనియు
               నొండుగడకేనియు నీకిష్టంబైనచోటికి నరుగు మనిననాక్షణంబ విదురుండు మనోజవైకరథారూఢుండై
               పాండవులకడకుం గామ్యకవనంబున కరిగె నంత నతనిరాక దవ్వులం గని ధర్మరాజు భీమసేనున  
            కిట్లనియె.   (54)

        2.సంజయుడు. - ఆరణ్యపర్వము ప్రథమాశ్వాసము 62 వచనము. & 63 పద్యము
        వ|| నావచనంబున నెగడునది యనిన ధర్మరాజు నట్ల చేయుదు నని యున్నంత నిట ధృతరాష్ట్రుండు  
            పాండవులయొద్ద విదురు నునికి యెఱింగి ధృతిహీనుండై తనహృదయంబును దృష్టియుం 
            బోనివిదురుం బాసి నిమిషం బేని నిర్వహింప నోపక సంజయున కి ట్లనియె. (62)
          కం || నెమ్మిగలవాని నా చి
                 త్తమ్మెఱిఁగెడువాని విదురు ధర్మప్రియు నా
                 తమ్ము నిట వేగ తోడ్కొని
                 రమ్మరుగుము కామ్యకాఖ్య రమ్యాటవికిన్. (63)

        3.ఘొష యాత్రలో పరాభవింపబడిన దుర్యోధనుడు ప్రాయోపవేశం చేస్తానంటే కాదని ఓదారుస్తూ శకుని  
             అంటాడు.  ఆరణ్య పర్వము షష్ఠాశ్వాసము 37 పద్యము.
         చ|| కృతము దలంచి చిత్తమునఁ గిల్బిష మంతయు నుజ్జగించి స
                న్మతులఁ బృథాతనూజుల నమానుష తేజుల బిల్వఁ బంచి త
                త్పితృధన మైనరాజ్యము నభీష్టముగాఁ దగ నిమ్ము నీకు నీ
                క్షితివలయంబునం బరమకీర్తియుఁ బుణ్యముఁ గల్గు భూవరా. (37)

         4.ఘోషయాత్రలో గంధర్వులు దుర్యోధనుని తీసుకొనిపోయినప్పుడు భీముడు ధర్మరాజుతో అంటాడు.    
              ఆరణ్య పర్వము పంచమాశ్వాసము 404
          ఆ|| మనకుఁ జులక నయ్యె మనచేయుపనియు గం
                  ధర్వవరులు గూడి తగ నొనర్చి
               రింత లెస్సయగునె యే భారమును లేక
                  యూరకుండ మనల నొందె జయము. (404)

        5. అజ్ఞాతవాసము నిర్విఘ్నంగ పూర్తి అవుతుందని అరణ్యవాసము చివర ధర్మదేవత ధర్మరాజుకు వరము  
              ఇచ్చాడు. ఆరణ్య పర్వము సప్తమాశ్వాసము 465 వచనము.
           వఇచ్చి మఱియు నిట్లను నిదె పదుమాఁడవయేఁడు చనుదెంచె నింక మీకు నజ్ఞాతవాసంబు  
                   సలుపవలయు నందు మీ రెవ్వ రెక్కడ నేరూపంబునం జరియింపం గోరిన నయ్యైరూపంబు  
                   లలవడియెడు నెట్లున్నను మిమ్ము నెవ్వరు నెఱుంగకుండునట్లుగా వరం బిచ్చితి నింక నొండెయ్యది 
               వలసిన నడుగు మనిన నమ్మనుజేశ్వరుం డిట్లనియె. (465)
                                                                     ***************                                

 

No comments:

Post a Comment