Translate

02 March, 2021

విజ్ఞుల సుభాషితములు....🙏

విజ్ఞుల సుభాషితం ...... 🙏

☆ "మనసును (చిత్తం...బుద్ధి)          క్రమబద్ధీకరణ చేయగలిగితే ఎట్టి స్థితిలోనైనా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించవచ్చు"

☆"సతతము మానసిక ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా జీవించగలగాలంటే సచ్ఛీలత, నిజాయితీ, నిష్కపటము అలవరుచుకొనడమే మార్గము...."

☆"జీవితంలో సాఫీగా ముందుకు సాగాలనుకుంటే కోరికలను స్వేచ్ఛగా పరుగులు పెట్టనీయకు...వాటిని కళ్లెం (పగ్గాలు) తో నియంత్రించడం అలవరుచుకో..."

☆"కర్మేద్రియముల పూర్తి నియంత్రణలో సఫలత్వమే మనుషుల నిజమైన విజయము..."

☆"హడావిడి, ఆందోళన, చికాకు, విసుగు పడకుండా ప్రశాంతంగా ప్రణాళిక బద్దంగా ఏ పనినైనా చేయడం అలవరచుకుంటే కష్టమైన పనిని సైతం సునాయాసంగా పూర్తి చేయవచ్చు..."

☆“ ఈ క్షణంను (ప్రస్తుతాన్ని) సంతోషమయంగా మలుచుకోగలిగితే తదనంతరం కూడా ఆనందమయముగా ఉండటానికి అవకాశమెక్కువ చేసుకున్నవారమవుతాము....
నిరాశ, నిస్పృహలను దరిచేరనీకుము.... 
సానుకూల దృక్పథం అలవరచుకో.......”

☆“ జీవిత మకరందాన్ని సంపూర్ణంగా గ్రోలి ఆస్వాదించాలంటే.....
గతాన్ని త్రవ్వుకుంటూ కృంగి పోకుండా ధీరోదాత్తతో ముందుకు సాగే మనోధైర్యం పుష్కలంగా పెంపొందించుకో.......”

☆“సోమరితనం ...
అతి చెడ్డ దుర్గుణం.....
సతతము సంతోషంగా ఉండే వారిలో ఎప్పుడూ సోమరితనం ఉండదు....
సోమరితనంతో అమూల్యమైన జీవితం వృధా చేయకుము సుమా.....”

☆“నిన్ను నీవు సరియైన బాటలో మెరుగుపరుచుకొనుటకు నీ సమయాన్ని సద్వినియోగించుకుంటుంటే ఇతరులను విమర్శించడానికి నీకు
సమయమెక్కడుంటుంది “..... 

“Give a lot of time to the improvement of yourself, then there is no time to criticise others”....