Translate

Showing posts with label Sathaka Poems- శతక పద్యములు. Show all posts
Showing posts with label Sathaka Poems- శతక పద్యములు. Show all posts

31 March, 2017

“శ్రీ సాయిరామ శతకము” - శ్రీ నందనవనం వెంకట సుబ్బరామయ్య శర్మ గారు




                 ఓం
 శ్రీసాయినాధాయనమః                __/\__

 శ్రీ నందనవనం వెంకట సుబ్బరామయ్య శర్మ గారు రచించిన  “శ్రీ సాయిరామ శతకము” నుండిసేకరించబడిన పద్యములు

 






తే.గీ|| శ్రీకరుం, డవ్యయుం,డాత్మ, చిద్ఘనుండు,
         శోకదూరుడ నంతుడు, శుభచరిత్రు;
         డప్రమేయుడటంచు, నిన్నభినుతింత్రు;
         సకలకళ్యాణ గుణధామ! సాయిరామ!           (1)  

తే.గీ|| భక్తి చే నీదులీలలు పలుకదలచి
         మ్రొక్కుచుంటిని నీపాదములకు దేవ!
         చక్కనౌభావములయందు సాగిరమ్ము
         సకలకళ్యాణ గుణధామ! సాయిరామ!           (2)  
తే.గీ|| వాఙ్మనంబుల కందని వాడటంచు   
         పలుక వినియుంటి నేరీతి  పలుకనేర్తు!
         పలుకువాడావు నీవెయై పలుకుమయ్య
         సకలకళ్యాణ గుణధామ! సాయిరామ!           (3)
తే.గీ|| ఇహఫలంబుల నాశించు యిచ్ఛలేదు;
         పరసుఖంబుల గోరెడి బాధలేదు;
         నిన్నువిడనాడిజీవించు నేర్పులేదు;
         సకలకళ్యాణ గుణధామ! సాయిరామ!           (4)
తే.గీ|| వేద వేదాంతములచేత వెదుకబడియు
         కానరానట్టి నీవు నాకనులముందు
         దిరుగు చున్నావు సౌందర్య దిప్తులెసగ;
         సకలకళ్యాణ గుణధామ! సాయిరామ!           (5)

తే.గీ|| సచ్చిదానంద సద్గురు “సాయినాధు”
         డొకడె, నాకేడుగడయంచు నుల్లమందు
         నమ్మియున్నాడ నన్నెట్లు నడిపెదొగద?
         సకలకళ్యాణ గుణధామ! సాయిరామ!           (6)
తే.గీ|| పలుకు పలుకున తేనియ లొలుకు నీదు
         దివ్యబోధల సారము దెలిసిమనెడి
         వారిజన్మము ధన్యమై వరలుగాదె?
         సకలకళ్యాణ గుణధామ! సాయిరామ!           (7)
తే.గీ|| “సాయి” యన“షిర్డి” యందలి చలువరాతి
         ప్రతిమయా? కాదు; నాలోని ప్రాణమునకు
         చేతనత్వము కల్గించు నేతయతడు;
         సకలకళ్యాణ గుణధామ! సాయిరామ!           (8)  
తే.గీ|| ఓ పరాత్పర! సర్వేశ! యోకృపాళో!
         దీనుడను కావరమ్మంచు దినదినంబు
         వేడుకొనుచుంటి నామొఱవినవదేల?
         సకలకళ్యాణ గుణధామ! సాయిరామ!           (9)
తే.గీ|| భావమయమైన విశ్వము బహువిధాల
         రూపుదాల్చుచునున్న ద రూపమందు
         అవ్యమౌ నీవభావివై యలరు దెపుడు
         సకలకళ్యాణ గుణధామ! సాయిరామ!          (10)

తే.గీ|| త్రివిధ గుణచేష్టి తంబగు దివ్యలీల
         లవిరళంబుగ జరిపెదవయ్య నీవు;
         ఏలయీలీలలో దయాలోలనీకు?
         సకలకళ్యాణ గుణధామ! సాయిరామ!          (11)
తే.గీ|| ఏకమై యొప్పు నీ యందనేకమైన
         రీతులై యొప్పుచున్నట్టి భూతజాల
         ప్రకృతులెటులబ్బెనో? వీ టిఫలముదేమో?
         సకలకళ్యాణ గుణధామ! సాయిరామ!          (12)
తే.గీ|| దాసులట దేవతల్ నీకు, ధాతమొదలు;
         విశ్వమెల్లయు నీదగు విడిదియంట!
         జీవులన్నియునీవట! చిత్రముగద!
         సకలకళ్యాణ గుణధామ! సాయిరామ!          (13)
తే.గీ|| కరుణ జాల్వారు నీ నేత్ర కమలయుగ్మ
         సోయగముగాంచి, నిన్నెడబాయలేక,
         నీదు చరణాబ్జములచెంత నిలిచియుంటి;
         సకలకళ్యాణ గుణధామ! సాయిరామ!          (14)
తే.గీ|| శిశిరమందున మ్రోడైన చెట్టునందు
         చివురుమొలచు వసంతము చేరువైన;
         అట్లె నీ కృపగల్గినయపుడుముక్తి;
         సకలకళ్యాణగుణధామ! సాయిరామ!           (15)
  
తే.గే|| “సాయి!” నీనామ మహిమచే సాథకులకు
          అందనేరని ఫలమేమి? యైనవారు
          నిస్ళృహులవోలెనుందురు, నిన్ను దెలిసి    
          సకలకళ్యాణ గుణధామ! సాయిరామ!         (16) 
తే.గీ||  నీదు చరణాబ్జముల దాకి,నేలతల్లి
          పులకరించినదేమొ యాపుణ్యవేళ
          నేడునిస్మృతి మది దాల్చినిలచియుండె
          సకలకళ్యాణ గుణధామ! సాయిరామ!         (17) 
 తే.గీ|| నీదు గురుభక్తి, దివ్యమౌనీదుశక్తి,
          ఇటుకయందున నిల్చుట యెంతయుక్తి;
          నిన్ను యోచించి తెలియుటే నిజముముక్తి;
          సకలకళ్యాణ గుణధామ! సాయిరామ!         (18) 
తే.గీ||  అక్షరంబగు నాత్మగా నలరుచున్న      
          విశ్వమందున క్షరమేది వెదకిచూడ?
          దేహమే “నేను” గాపల్కుతెల్విదప్ప;
          సకలకళ్యాణగుణధామ! సాయిరామ!          (19)
తే.గీ||  నీదుచెయిదము ధర్మంబు, నీదువాక్కు
          వేదమైయొప్పు, నీరూపువిశ్వమగును;
          నీవెసత్యము, ధర్మము, నీవెమాయ;
          సకలకళ్యాణ గుణధామ! సాయిరామ!         (20)  
   
తే.గీ|| గుణము గుణియందె నెలకొని గూఢమగుచు
         కార్యరూపాన నొక్కెడ గాన బడును;
         గుణమెలోకము, నీవెయాగుణివిదేవ!
         సకలకళ్యాణ గుణధామ! సాయిరామ!          (21)
తే.గీ|| అనుభవములేక విషయములందు నిజము
         తెలియబడరాదు భువినెంత తెల్వియున్న,
         అనుభవము నీవ;నిన్నెట్టు లునుభవింతు
         సకలకళ్యాణ గుణధామ! సాయిరామ!          (22)
తే.గీ|| మూడవస్థలకును నీవమూలమగచు,
         మూడుగుణములకును నివమూలమగుచు,
         మరియు చున్నావు పరతత్వమూలమగుచు;
         సకలకళ్యాణ గుణధామ! సాయిరామ!          (23)
తే.గీ|| “ద్వారకామాయి” వైకుంఠ థామమాయె,
         గౌతమినది యాకాశ గంగయాయె
         వాసుదేవుడ నీవన వంకయేమి?
         సకలకళ్యాణ గుణధామ! సాయిరామ!          (24)
తే.గీ|| ఆత్మయును జీవు డన్యమంచరయుచున్న
         యంతవట్టును, దెలియరాదాత్మారూపు;
         జీవుడేయాత్మగానెంచ చిక్కువీ డు,
         సకలకళ్యాణ గుణధామ! సాయిరామ!          (25)

తే.గీ|| పంచభూతము లీరీతి కొంచెమైన
         బేధమెఱుగక జీవుల బెంచుచుండ
         జీవుడే యహంకృతినిదా జెందనేల?
         సకలకళ్యాణ గుణధామ! సాయిరామ!         (26) 
తే.గీ|| కులమతములన్న భావాల కూర్పు; దాన
         వాస్తవంబే మిగన్పట్టు వసుధలోన?
         సర్వమునకును మూలమౌ సత్వమీవు
         సకలకళ్యాణ గుణధామ! సాయిరామ!         (27)  
తే.గీ|| వ్యధలచే జివితమబెల్ల కథమిగిలె!
         విధిని దూరిన ఫలమేమి వెఱ్ఱీనగుచు?
         కర్మఫలమర్మ మీదిగాదె కన్నతండ్రి!
         సకలకళ్యాణ గుణధామ! సాయిరామ!         (28) 
తే.గీ|| గాలిచేపండుటాకులు రాలుపగిది
         పాపపత్రాళి భక్తి ప్రభంజనమున                                        
         దూలిపడునంచు వేడితి దోయిలొగ్గి;
         సకలకళ్యాణ గుణధామ! సాయిరామ!         (29)
తే.గీ|| సారహీనము సంసార సాగరంబు
         భారమంచును దలచెడి భ్రమనుబాపి
         సారభూతముగావించి సాకుమయ్య;
         సకలకళ్యాణ గుణధామ! సాయిరామ!         (30)     

తే.గీ|| నశ్వరంబగు దేహము నమ్మియుండి
         గట్టెలంగాలు దీనిని గాంచుచుండి;
         మురిసి పడుచుంటి నేనిట్లు మూఢమతిని;
         సకలకళ్యాణ గుణధామ! సాయిరామ!         (31)
తే.గీ|| మనసు శబ్దాదులందున మరలియున్న
         విషయములు దోచుచుండును వివిధగతుల;
         మనసుతనయందె నిలచిన మాయమౌను
         సకలకళ్యాణగుణధామ! సాయిరామ!          (32)
తే.గీ|| భక్త కల్పక మంచునిన్ బ్రస్తుతింప
         నమ్మియుంటిని భక్తిని; నమ్మకమును
         వమ్ముసేయక కాపాడవలెను; దేవ!
         సకలకళ్యాణగుణధామ! సాయిరామ!          (33)
తే.గీ|| వేదశాస్త్రాదులందున వేత్తగాను;
         యోగవిద్య లెఱింగిన యోగిగాను;
         ఎట్లు దరిజేర్తువో నన్ను యింకపైని?
         సకలకళ్యాణగుణధామ! సాయిరామ!          (34)     
తే.గీ|| నామనో బుద్ధి చిత్తముల్, నాదు దేహ
         మెల్ల నీకర్పణముజేసి యుల్లమందు
         శాంతిబొంది చరించెడి శక్తినిమ్ము;
         సకలకళ్యాణగుణధామ! సాయిరామ!          (35)

తే.గీ|| నీ దయాదేవి మహిమచే నీదు కీర్తి
         దశదిశల వెల్గుచున్నది ధరణియందు;
         నీదయాదేవి పాదాల నిడెదశిరము;
         సకలకళ్యాణగుణధామ! సాయిరామ!          (36)
తే.గీ|| “నాది” “నేన”ను మాయచే నష్టమైన
          భాగ్యనిధిగాన బడెనేడు భక్తివశత;
          వీ డెమోహము, నిజము నీవాడనైతి;
          సకలకళ్యాణగుణధామ! సాయిరామ!         (37)
తే.గీ||  విషయములబొంది నాబుద్ధి విడువదెపుడు;
          విషమయములంచు దెల్పిన వినదిదేమి?
          దీనిమౌఢ్యము నెడలించు దిక్కునీవ
          సకలకళ్యాణగుణధామ! సాయిరామ!         (38)
తే.గీ|| ఘోరదావాగ్నిచేజిక్కి గోడుజెందు
         జీవిపోల్కి భవాగ్నికిన్ జిక్కినాను;
         నిరుపమాన కృపావృష్టి బరువుమయ్యా!
         సకలకళ్యాణగుణధామ! సాయిరామ!          (39)
తే.గీ|| నీ కృపావార్ధి పొంగుచునింగి నొరసి
         పారుచున్నది; దాననాపాపసమితి
         గొట్టికొనిపోక నిలుచునే? కోమలాంగ!
         సకలకళ్యాణగుణధామ! సాయిరామ!          (40) 

తే.గీ|| పాపులందునననుమించు పాపిలేడు;
         అవని నీవంటిపాప సంహర్తలేడు;
         నీకు దయగలరీతిని నిల్పుమింక;
         సకలకళ్యాణ గుణధామ! సాయిరామ!         (41)
తే.గీ|| నిన్ను దర్శించి, సేవించి, నీదుపల్కు
         విన్నవారలు భువిలోన మన్నవారె;
         ఎన్నమిగిలిన వారెల్ల చన్నవారె;
         సకలకళ్యాణ గుణధామ! సాయిరామ!         (42)
తే.గీ|| స్వార్ధపరతనశించిన జగతియందు
         వ్యర్ధమా జీవితము దయావార్ధి? కాదు;
         సార్ధకంబయ్యె ననవచ్చ సత్యముగను;
         సకలకళ్యాణగుణధామ! సాయిరామ!          (43)
తే.గీ||“సో2హ” మనుమంత్ర మునువిని, మోహముడిగి
         దేహధర్మము మన్నించి, తెలివిగల్గి,
         జగతివర్తించు వాడెబో సుగతిగనును
         సకలకళ్యాణగుణధామ! సాయిరామ!          (44)
తే.గీ|| క్షీరమునుగొని నీరము వేరుబరచు
         “హంస” యనజీవుడేయని యరయనగును;
         “పరమహంస”వు దెలియంగ బలుకుమయ్య
          సకలకళ్యాణ గుణధామ! సాయిరామ!        (45)

తే.గీ||  కామరోషాది శత్రువుల఼్ గలసినన్ను
          పట్ట జూచుచునున్నవి జుట్టు ముట్టి;
          గట్టి సామర్ధ్య మిడువీ ని గొట్టివేతు;
          సకలకళ్యాణ గుణధామ! సాయిరామ!       (46)
తే.గీ|| అమలు, డవ్యయు, డద్యు, డనంతు, డాత్మః
         స్థిరుడు, పరుడును, సత్తును, జిత్తు, నతడె
         యంచు పలుకంగ వింటినో యయ్య! నిన్ను
         సకలకళ్యాణ గుణధామ! సాయిరామ!        (47)
తే.గీ|| బిడ్డవేధింపగా తల్లి భీతిగరుప
         గొట్టితిట్టిన కాళ్ళకుజుట్టు కొనెడి
         రీతి, విడజాలనిను మది నీతిమాలి;
         సకలకళ్యాణ గుణధామ! సాయిరామ!       (48)
తే.గీ|| నిరుపమాన కృపాబ్ధివి నీవునిజము;
         నిరుపమాన దురాత్ముడ నేను నిజము;
         నిరుపమానముగా కరుణింపవలదె;
         సకలకళ్యాణ గుణధామ! సాయిరామ!       (49)
తే.గీ|| పూర్వకర్మవశంబున బుట్టినాను
         నేడు కర్మంబోనర్చుచు నిలచినాను
         కర్మబంధముబాపినన్ గావుమయ్య
         సకలకళ్యాణ గుణధామ! సాయిరామ!       (50) 

తే.గీ|| ప్రమిదదేహము, ప్రాణము చమురుగాగ,
         జీవియును దీపశిఖ వెల్గు చిత్రముగను
         వెల్గు లొసగెడి తన్నుదా వెదుకుటెట్లు?
         సకలకళ్యాణగుణధామ! సాయిరామ!        (51)
తే.గీ|| భక్తిసంభరితాత్ములై ముక్తిబొందు
         కోర్కెయేలేక జీవించు గొప్పవారు
         నిత్యముక్తులు; వారలే నీవుగాద?
         సకలకళ్యాణగుణధామ! సాయిరామ!        (52)
తే.గీ|| చరణమొక్కటి భూమిపై చక్కనుంచి
         శిలనుగూర్చున్న నీయొక్క చిత్రముగన
         పాదమొక్కింట యీ విశ్వవలయమెల్ల
         వెలసెనను వేదవాక్యము విదితమయ్యె
         సకలకళ్యాణగుణధామ! సాయిరామ!        (53)
తే.గీ|| సాయిచరణంబు సకలార్ధ సాధకంబు
         సాయినామంబు దివ్యరసాయనంబు
         సాయితత్వంబు ముక్తి ప్రదాయకంబు
         సకలకళ్యాణ గుణధామ! సాయిరామ!       (54)
తే.గీ|| కోటియజ్ఞ ఫలంబుల గూర్చునట్టి
         సాయినామాక్షరద్వయి జగతిగల్గ
         కలతజెందెద రేలనో కలినిజనులు?
         సకలకళ్యాణగుణధామ! సాయిరామ!        (55) 

తే.గీ|| సాయి సాయి యటంచును సతమునీదు
         రమ్యనామ సుధారస రక్తిజూచి
         మనెడివారల జన్మము మహితమౌను
         సకలకళ్యాణగుణధామ! సాయిరామ!        (56)
తే.గీ|| శాశ్వతులమంచు దలచుచు జగతియందు
         వంచనావృత్తి చేనుండు వారికెల్ల
         కొంచెమైనను విజ్ఞాన ముంచుమయ్య;
         సకలకళ్యాణ గుణధామ! సాయిరామ!       (57)
తే.గీ|| దేహబాధల దొలగించు దివ్యమైన
        “ఊధి” యనెడియౌషధముగల్గ నుర్విజనులు
         దుఃఅఖమగ్నతచేనేల దూలుచుంద్రు?
         సకలకళ్యాణగుణధామ! సాయిరామ!        (58)
తే.గీ|| దుష్టసంకల్పములు మదిదోచకుండ
         కష్టసుఖములలో మది కదలకుండ
         ఇష్టఫలముల నందించి యేలుకొనుము
         సకలకళ్యాణగుణధామ! సాయిరామ!       (59)
తే.గీ|| "షరిడి”  యందునెగలననుచింతయేల?
          సర్వమందున వెలసెడి సాక్షి నేను;
          అర్తితోబిల్వ రక్షింతు నంచుబల్కు
          సకలకళ్యాణగుణధామ! సాయిరామ!      (60) 


తే.గీ|| నింబవృక్షము నీడననియమమొప్ప
         తపము గావించనావట ధన్యచరిత!
         ఏమిఫలముల నందంగ నెంచినావో
          సకలకళ్యాణ గుణధామ! సాయిరామ!     (61)
తే.గీ|| “అల్లటాలిక” టంచును  నధికభక్తి
         బల్కుచు, మసీదు నందున బహుదినాలు
         ప్రకృతి సంసర్గముల్ వీ డు ప్రభుడవీ వు
         సకలకళ్యాణ గుణధామ! సాయిరామ!      (62)
తే.గీ|| తల్లియును తండ్రియెవ్వరో ధరణినీకు
         తెలియదని పల్కుచున్నారు దివ్యచరిత!
         తలపజీవులకిల తల్లి దండ్రినీవ
         సకలకళ్యాణ గుణధామ! సాయిరామ!      (63)
తే.గీ|| నిప్పు నీరును గాలియు నింగి భువియు
         నీదునాజ్ఞను జరియించు నిక్కమంచు
         దెలుపజలమున దీపంబు నిలిపినావు
         సకలకళ్యాణ గుణధామ! సాయిరామ!      (64)
తే.గీ|| దేహమస్థిర మంచును దెలుపుకొరకు
         చిరుగు చొక్కాను ధరియించి చిత్రముగను
         తత్వమెంతయు బోధించు దైవరాయ!
         సకలకళ్యాణగుణధామ! సాయిరామ!      (65)

తే.గీ|| “నిష్ట” యు“సబూరి” యనియెడునిరుపమాన
         దక్షిణలనిండు భక్తితో నక్షయముగ
         మోక్షఫలమిచ్చు నవియని దీక్షబలుకు
         సకలకళ్యాణ గుణధామ! సాయిరామ!     (66)
తే.గీ|| భక్తుడగులోహకారుని బాలయోర్తు
         కొలిమిలోబడ దూరాన గూరుచున్న
         నీవురక్షించినావట నేర్పుమిగుల
         సకలకళ్యాణ గుణధామ! సాయిరామ!     (67)
తే.గీ|| ఏడనో“హజరత్ బాబ” యిల్లుగాల
         ధునిని నీళ్ళుంచి చల్లార్చి దొడ్డమహిమ
         జేసి చూపించినావట చిత్రముగను
         సకలకళ్యాణ గుణధామ! సాయిరామ!     (68)
తే.గీ|| భోజనముసేయరమ్మని పొలతిబిల్వ
         కుక్కరూపంబుతోనేగి, కొట్టితరుమ
         గునిసినావట కొరవితో గొట్టితివని
         సకలకళ్యాణ గుణధామ! సాయిరామ!     (69)
తే.గీ|| దొంగయొక్కడుసొమ్ముల దొంగలించి
        “సాయి” యొసగెనటంచును సాక్ష్యమిడగ
         ఇచ్చినానని బల్కితివేమి దేవ!
         సకలకళ్యాణ గుణధామ! సాయిరామ!     (70)

తే.గీ|| వృద్ధురాలిచ్చు రొట్టెకుప్రీతిఁజెంది
         మెసవినావటినీవు సంతసముతోడ
         ఎంత కరుణామయుండవో యెరుగవశమె?
         సకలకళ్యాణ గుణధామ! సాయిరామ!     (71)
తే.గీ|| పాదనఖమునగంగను బారజేసి
        “నేనె” హరినంచు దెల్పిన నిన్ను దెలియ
         జాలకున్నట్టి యజ్ఞాని నేలినావు
         సకలకళ్యాణ గుణధామ! సాయిరామ!     (72)
తే.గీ|| ప్రేమ“కాకా”ను “పంతు”ను సేమమరసి
         బాధ లెడబాపినట్టియో భద్రమూర్తి!
         నాదుబాధల మాన్పగ రాదెనేడు?
         సకలకళ్యాణ గుణధామ! సాయిరామ!     (73)
తే.గీ|| శ్వేతఛత్రముబట్టీ నీసేవజేయు
         భాగ్యమిచ్చిన “నానాకు” భక్తితోడ
         వందనమొనర్చు చున్నాడ వాంఛదీర
         సకలకళ్యాణ గుణధామ! సాయిరామ!     (74)
తే.గీ|| వెండిపళ్ళెరముందున విమలమైన
         పాదములనుంచి కడిగిన భాగ్యశాలి
         యైన “జోగు” పదంబుల నఖినుతింతు
         సకలకళ్యాణగుణధామ! సాయిరామ!      (75) 

తే.గీ|| గద్దెపైపెద్దవేల్పువై ముద్దులొలక
         యొద్దికగఁ గూరుచున్న నీ యొద్దజేరి
         “తాత్య” మొదలగుభక్తులు దండమిడరె;
          సకలకళ్యాణ గుణధామ! సాయిరామ!    (76)
తే.గీ|| చిలుమునందింపగా “శ్యామ” చేతబట్టి
         హొయలుమీరగ పొగబీల్చు యోమహాత్మ!
         నరుల యజ్ఞానమున్ గాల్చినావు దాన
         సకలకళ్యాణ గుణధామ! సాయిరామ!     (77)
తే.గీ|| గీతనృత్యాదులన్ భక్తజాతమెల్ల
         పరవశంబున నీనామ భజనసేయ
         “జోగి” డెడియారతిఁగొను శుభచరిత్ర!
         సకలకళ్యాణ గుణధామ! సాయిరామ!     (78)
తే.గీ|| ఎందరోభాగ్యవతులనేక విధుల
         సేవలందింప వచ్చిన చిన్న బుచ్చి
         వారిగర్వంబు బాపిన వందనీయ!
         సకలకళ్యాణ గుణధామ! సాయిరామ!     (79)
తే.గీ|| సాయిశ్రీసాయి సాయిశ సాయియనుచు
         సతమునీనామ జపమును సలుపువారి
         యండ నేయుండి రక్షించు ఆప్తుడవట
         సకలకళ్యాణ గుణధామ! సాయిరామ!     (80) 

తే.గీ|| మృతులజీవింప జేయుటా; మేలుమేలు
         వంధ్యలకుబిడ్డ లొసగుటా; వహ్వ!భళిరె
         అంధులకుదృష్టి నిచ్చుటా; అద్భుతంబు
         సకలకళ్యాణ గుణధామ! సాయిరామ!     (81)
తే.గీ|| అభయమొసగెడినీదగు హస్తమాన,
         కరుణ యుప్పొంగుచున్న నీ కనులయాన
         ఎదను నీనామ భజనంబు నేపుడుమాన
         సకలకళ్యాణ గుణధామ! సాయిరామ!     (82)
తే.గీ|| గురుతరంబులనన్నిట గురువు నీవ
         లఘుతరంబుల నన్నిట లఘువునీవ
         గురులఘువున్న లౌకికగోష్టియెగద
         సకలకళ్యాణగుణధామ! సాయిరామ!      (83)
తే.గీ|| “నేను” గల్గినలోకాలనేక మొదవు
         “నేను” లేకున్నలేదేది నిక్కముగను
         “నేను” మూలము, తెలియంగ నీకునాకు
          సకలకళ్యాణ గుణధామ! సాయిరామ!    (84)
తే.గీ|| జన్మమందినబిడ్డ కాక్షణమునందు
         ప్రకృతియందించు ఫలమేమి? భయముగాదె
         భయమువీ డుటయే ముక్తి పథముదేవ!
         సకలకళ్యాణ గుణధామ! సాయిరామ!     (85) 

తే.గీ|| జగములన్నిటనిండిన శక్తి వీ వు
         ఏది నీరూపమని యెంతు? నేదివిడుతు?
         ఎటులపూజింతు? వేరుగా నెచటనుందు?
         సకలకళ్యాణ గుణధామ! సాయిరామ!     (86)
తే.గీ|| శుక్తి రజితంబటంచు నాసక్తి చేత
         పరువులిడుచుండు ముఢుడు భ్రమనుదవలి
         అట్లె విషయానుభవముల యందుసుఖము!
         సకలకళ్యాణ గుణధామ! సాయిరామ!     (87)
తే.గీ|| అవగతంబౌదువయ్యనీవందఱకును;
         అరయు యిచ్ఛయే లోపించెనయ్యామాకు
         అరయు నేర్పున్న యన్నిట నగపడుదువు
         సకలకళ్యాణ గుణధామ! సాయిరామ!     (88)
తే.గీ|| దేహబంధముచేనిన్ను దెలియలేక
         మ్రగ్గుజీవుల యజ్ఞాన మలిన మణప
         జ్ఞానదీప్తుల వెదజల్లు మాననీయ!
         సకలకళ్యాణ గుణధామ! సాయిరామ!     (89)
తే.గీ|| వేదములకునువర్ణింప వీ లుగాని  
         నిన్నుభావించి మదిలోన నిజముదెలిసి
         శాంతులై నీవెయైరెల్ల సాధువరులు
         సకలకళ్యాణ గుణధామ! సాయిరామ!     (90) 

తే.గీ|| పలుకవిన శబ్దమున్నది బహువిధాల
         అర్ధమగుభావ మందది యన్ని విధుల
         భాషగాకున్న మున్నేమి భావమొగద?
         సకలకళ్యాణ గుణధామ! సాయిరామ!     (91)
తే.గీ|| తనువుచాలించినను నెను ధరణియందు
         నా మసీదున నెలకొనినమ్మియున్న
         భక్తులన్ గాతునంచును పలికినావు
         సకలకళ్యాణగుణధామ! సాయిరామ!      (92)
తే.గీ|| ధర్మమునునిల్చజగతిని “దత్తదేవు”
         డనెడి నామంబుదాల్చియు నవతరించి
         ఆత్మతత్వము నెరిగించు నవ్యయుడవు
         సకలకళ్యాణగుణధామ! సాయిరామ!       (93)
తే.గీ|| యోగమెల్లనునేర్చిన యోగియైన
         నీదు పదభక్తిలేకుండెనేని ఫలము
         సున్నయంచును దెలియడు చోద్యమిదియె
         సకలకళ్యాణగుణధామ! సాయిరామ!       (94)
తే.గీ|| బ్రహ్మరుద్రేంద్రు లాదిగా భక్తపరులు
         పూజలొనగూర్ప నందని పుణ్యపదము
         మోపగబడ్డ శిలయెంత ముక్తిపరుడొ?
         సకలకళ్యాణగుణధామ! సాయిరామ!       (95)|


తే.గీ||పాడుబడిన మసీదులో పదిలముగను
        వాసమువంటివి యదియె కైలాసమయ్యె
        భక్తజనులకు నేడిల పరమపురుష
        సకలకళ్యాణగుణధామ! సాయిరామ!     (96)
తే.గీ||నా ధనాగారమున నున్న నాణ్యమైన
        జ్ఞానధనమును గోరరీ హీనమతులు
        ఏమిసేయంగ దగునని ఎంచినావు?
        సకలకళ్యాణగుణధామ! సాయిరామ!     (97)
తే.గీ||సర్వభారముల్ వహియింప జాలునేను
        నీదుభారము భరియింప నేరనేమి?
        భయము విడుమంచు పలికిన బాంధవుడవు
        సకలకళ్యాణగుణధామ! సాయిరామ!     (98)
తే.గీ||కలుషమగు మాయచేజిక్కి కలతజెంది
        ఆర్తితో నిన్నె పిలుతునోయయ్య! నాకు
        చేయినందించి నీదరిజేర్చు కొనుము
        సకలకళ్యాణగుణధామ! సాయిరామ!     (99)
తే.గీ||తల్లివై తండ్రివై నీవె దాతవగుచు
        జీవులను గాచుచుంటివో చిద్విలాస!
        నీకు నెనయగు వారేరి నీవెదప్ప
        సకలకళ్యాణగుణధామ! సాయిరామ!     (100)


తే.గీ|| నిత్యమును సత్యమును నివే నిర్మలాత్మ
         కార్యమును కారనము నీవె కమలనేత్ర!
         కర్తయును భోక్తయునునీవెగాదె యరయ
         సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (101)
తే.గీ|| ఎందరో సాధువుల్ నివె “యీశు” డవని
         వందనమొనర్చి నారలు వసుధలోన;
         మందబుద్దు లెరుంగరు మహినినిన్ను
         సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (102)
తే.గీ|| నాదమే నీ స్వరూపమన్నారు బుధులు
         నాదమునకేది భావమో వేదవేద్య!
         ప్రకృతిభావము నాదమౌ ప్రణవమీవు;
         సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (103)
తే.గీ|| గురుడవగజీవి హృదయాన గుర్తునెరుగు
         ప్రజ్ఞయని తోచుచున్నదో పరమపురుష
         గురుని గుర్తించినంత తా గురువెయగును
         సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (104)
తే.గీ|| నీదుబోధలు చేతలు, నేర్పుమిగుల
         మది విచారించినంతనే విదితమగును
         సకల నిగమాగమంబుల సరమెల్ల
         సకలకళ్యాణ గుణధామ! సాయిరామ! (105) 


తే.గీ||నీదుపాదపద్మ మకరంద నిరుమాన
        మధురిమనెరింగియున్న నామనసునిన్ను
        క్షణము విడనాడి బ్రదుకగా జలదయ్య
        సకలకళ్యాణ గుణధామ! సాయిరామ!  (106)
తే.గీ||భక్తితోడ నీ శతకము పఠనసేయు
        వారికెల్ల సుఖంబుల వారిగాగ
        నొసగి రక్షింప వేడెద నోకృపాబ్థి!
        సకలకళ్యాణ గుణధామ! సాయిరామ!  (107)
తే.గీ||గీతమాలికనల్లి సంప్రీతినిడుదు
        కంఠసీమను ధరియింప కరుణతోడ
        సకలకళ్యాణ గుణధామ! సాయిరామ!  (108)
తే.గీ||జయము! దత్తప్రభూ! నీకుజయము! జయము!
        జయము! నరసింహభారతీ జయయే! జయము!
        జయము! షిర్డీ పురాధిపా జయము! జయము!
        జయము! శ్రీసాయిసద్గురూ జయము! జయము! (109) 

ఓం తత్సత్
శ్రీ సాయీనాధ పాదార్పణమ్
మంగళమ్ మహత్

ఆలయం ఆలయం ఆలయం

ప|| ఆలయం ఆలయం ఆలయం
      శ్రీ సాయిప్రేమాలయం - శ్రీ సాయిప్రేమాలయం

అ||ప|| ఆనందనిలయం - అనురాగవలయం
           అదిసాయిప్రేమాలయం – అదిసాయిప్రేమాలయం

చ|| శిఖర దర్శనం చింతలహరణం
      మూర్తి దర్శనం మోక్షకారణం
      నాలుగు పురుషార్ధాలను అందజేయు ఆలయం
      నమ్మిన భక్తుల పాలి సొమ్మైన ఆలయం  ||ఆ||

చ|| దత్త దేవుకరుణా – ధర్మాచరణ
      చిత్తశాంతి చేకూర్చే  - చిన్మయనిలయం
      సద్గురుడౌ సాయివని – చక్కనైన ఆలయం
      నిత్యసత్యమౌప్రమనునేర్పే యీ ఆలయం ||ఆ||

చ|| పూజ చేసినా, భజన చేసినా
      పుండరీకవరదుని జపము చేసినా
      ఎంచలేని ఫలమిచ్చు యీ సాయి ఆలయం
      ఇలలో నందనివనిలో వెలసిన యీ ఆలయం ||ఆ||

ప్రథమ ముద్రణః 1983
ద్వితీయ ముద్రణ: 1996  

 (నందనవనంశ్రీసాయీ ప్రేమాలయ ప్రచురణ -12 – శ్రీ నందనవనం వెంకట సుబ్బరామయ్య శర్మ గారు రచించిన“శ్రీ సాయిరామ శతకము” నుండిసేకరించబడిన పద్యములు)    
                                          

     



























23 March, 2017

శ్రీ సాయీశతకము ; రచన: బ్రహ్మశ్రీ నందనవనం వెంకట సుబ్బరామయ్యశర్మ గారు.

శ్రీ సాయీ శతకము ; రచన: బ్రహ్మశ్రీ నందనవనం వెంకట సుబ్బరామయ్యశర్మ గారు.
శ్రీ సాయీప్రేమాలయ ప్రచురణ – 2;  (1990)
శ్రీ సాయినాధాయనమః ; శ్రీ గురువేనమః



కం||నాకేటికి దైన్యంబిక
ని కరుణా వీక్షణములు నిలచెను నాపై
“తేకువ” “ధైర్యం” బబ్బెను
శోక విదూరుండనగుచు శోభిల సాయీ! (004)
కం||ధారుణి ధర్మము చెడ, నా
నారూపుల జననమంది నాడవు దేవా!
ఘోరాఘపంక్తి విడివడు
నోరారగ నీదుపేరు నుడివిన సాయీ! (005)
కం|| “యమ” “నియమ” “శమ” “దమా” దుల
క్రమమెఱుగని మూఢమతిని కారుణ్యముతో
నమచిత్తుని జేయందగు
విమలాత్మా! నీదుపథము! వీడను సాయీ! (006)||27-05-2014||

కం||’నమమ’ యని దలవనేర్వక
‘మమ’యను దేహాత్మబుద్ధి మరువగలేకన్
తమమున మునిగిన జనులకు
సముచిత మార్గంబు జూపి సాకుము సాయీ! (007)
కం||మదిలో నీ శుభనామము
వదలక జపియింతు నెపుడు వరగుణశీలా!
నదయుడవై రక్షింపుము
మృదుల హృదయ నీవె దిక్కు మేదిని సాయి! (008)
కం||’సాయీ’యనగనె “ఏరా
భాయీ”యని బదులు పలుకు బాంధవుడవు; చే
దోయి తలజేర్చి మ్రొక్కెద
సాయంబగు మెల్ల కార్య సరణిని సాయీ! (009)||28-05-2014||




కం।।భూతుండెవ్వడు
రక్షకుడైయెల్లభువికి రాజిత హృదయా
ద్యక్షుండెవ్వడు; జీవుల
దీక్షామతిఁ నేల నీవె తెలియగ సాయీ! (013)  

కం|| గురువును దాయవము నీవే
ధరతల్లియు దండ్రి వీవె దాక్షిణ్యనిధీ!
నెరవేర్పు మెల్ల కోర్కెల
దరిజేర్పుము దీనజనుడ దయతోసాయీ! (014)
కం|| లోకారాధ్యుడ వీవని
“కాకా “ ‘చందోర్క’ రాది ఘనులు మహాత్ముల్
వాకొని నిను బూజింపరె!
చేకొనరే మోక్షపదవి? శ్రీకర సాయీ! (015) ||30-05-2014||



 కం|| వ్యర్ధునిఁ జేతువ నను? మును
యర్ధిజనులు నిన్ను వేడ యతులిత కృప
సర్వార్థంబుల నియవె? న 
ప్రార్థలను వినవ? షిర్డివాసా! సాయీ! (019)

కం|| సుజ్ఞాను లెఱుగుదురు నిను 
అజ్ఞానావృతుడ తెలియనగునే నాకున్
విజ్ఞాన మొసగి నన్నును
ప్రజ్ఞావంతునిగఁ జేయ భావ్యము సాయీ! (020)
కం|| దానము ధర్మము జేయం
బూనినయెడ నాకు సిగ్గు బొడమును పుడమిన్
కానగ నాదేమున్నది?
నేనును నీవాడగానె నిజముగ సాయీ! (021) ||01-6-2014|| 
కం||కోరికలను పన్నగ తతి
కోరలకుం జిక్కి స్రుక్కి కుందెడ నాకా
ధారము నీవే! సుగతిం
జేరు నుపాయంబు దెలియ జెప్పుము సాయీ! (022)

కం||ఒక్కడవై లోకంబులు
పెక్కింటిని సృష్టిఁజేసి పెంచెదవట నీ
కెక్కడిదీ సామర్ధ్యం
బక్కజమగు నీదు మహిమ లరయన్ సాయీ! (023)
కం||పెరవాడ ననుచు యెంచకు
సురచిర దరహాసవదన సుగుణాభరణా!
కరుణాలయు డవుగద! నను
దరిజేర్పగ నీవె దిక్కు ధారుణి సాయీ! (024) ||02-06-2014||

కం||మత్తుడనై విషయంబుల
చిత్తము హత్తించి నిన్ను చింతింప నయో!
మిత్తగలదనుట మరచితి
నెత్తెరగున మూఢునినను యేలెదొ సాయీ! (025)


కం||తల్లిదండ్రు లన్నదమ్ములు
వలపించెడి సతులు సుతులు వస్తు చయంబుల్
గలవని తలచెడు నరునకు
కలయని సర్వంబు తుదకు కన్పడు సాయీ! (026)

కం||మధుపము నై నీ పద సుమ
మధువును రుచి చూడనిమ్ము మనసారగ నా
వ్యధ లన్ని బాపికొందును
బుధనుత సరసిజ భవాండ పోషక సాయీ! (027) ||03-06-2014||

కం|| కాంతా కనకంబుల పై
భ్రాంతిని కలిగింపనీకు పరమేశా! నీ
కెంతయు ఋణపడి యుందును
వంతలకును మూలమనియె వసుధన్ సాయీ! (028)

కం|| పట్టితి నీ చరణంబుల
మెట్టగ కైవల్య పదవి మేలగు రీతిన్
రట్టొనరింపక నను జే
పట్టుము దయతోడ భక్తవత్సల సాయీ! (029)
కం|| కామాతురతన్ లౌకిక
ప్రేమలకుం జిక్కి యుండి పెన్నిధివగునిన్
బ్రేమింప నేరకుంటిమి
సామాన్యుల మమ్ము బ్రోవ సమయము సాయీ! (030)





కం||దేవుండెవడన నీవే
జీవుండెవడన్న నీవె చిత్సత్తులనన్
భావింపంబడు చుందువు
నీవే యన్నింటజేరి నెగడెదు సాయీ! (034)
కం|| పెంపుడు కుక్కలవలె యీ
కొంపను వీడంగబోవు కోపాదులు; శా
సింపగ నేర్వను; నే, నను
కంపామతి చూడదగిన కాలము సాయీ! (035)


కం||బంగరు సౌధ శ్రేణులు
శృంగారాంగనలు మణులు సేవక తతియున్
మంగళకర నిను కోరను
భంగము లేనట్టి ప్రేమ పరపుము సాయీ! (036) ||06-06-2014||
కం||తనయునిపై కినిసెదవా?
నను దూరము జేయచూచి నవ్వరె లోకుల్
నిను వీడను యేమైనను
వనరుహభవ వంద్య నన్ను వదలకు సాయీ! (037)
కం||ఎనిమిది విధముల జగతిని
గనుపించెను నీదు మాయ కడు చిత్రంబై
నిను దెలియ జగతి శూన్యము
నిను దెలియక జగతి నిజము నిజమిది సాయీ! (038)

కం||అప్పడుగువాని గనుగొని
తప్పించుక తిరుగునట్లు దాగెదవేలా?
తిప్పలు బెట్టకుమయ్యా
తప్పదు నా బరువు నీకు తధ్యము సాయీ! (039)||07-06-2014||
కం||సదయుడవై లోకంబుల
పదునాలుగు సృష్టిజేసి పాలింతువు; నీ
యెదలో నేనున్నానని
ముదమున భావింతు నింక ముక్తుడ సాయీ! (040) 
కం||సిరిసంపద లిమ్మంచును
మరిమరి వేడెదరు నిన్ను మందమతులు నీ
దరి ప్రేమామృత ముండగ
మరతురు యిదియేమి వింత మహిలో సాయీ! (041)
కం||సత్యా హింసలు నాయెడ
నిత్యములై నిల్పురీతి నియమింపుము; నీ
భృత్యుడవై జీవుల ప్రతి
నిత్యము సేవించనిమ్ము నేర్పుగ సాయీ! (042) ||08-06-2014||
కం||రాగద్వేషములను పెను
నాగులు నను చుట్టియుండె, నాసిల్లితి నే
నేగతి బ్రతుకుదు? నీయను
రాగమె నాకింక జగతి సాయి! (49)





కం||తనయెడగల దోషంబుల
గననేరక మూఢ జనుడు గర్వితమతియై
పనిబూని యొరుల దోసగులు
మనమున దలపోయు నెపుడు మానక సాయీ! (050) 
కం||ధర్మం బెయ్యది నరునకు
నిర్మల చిత్తంబు నాత్మ నిల్పుటెగద; యీ
మర్మంబు దెలియనేరక
దుర్మతులై యుండువార్కి తోడ్పడు సాయీ! (051) ||11-06-2014||
కం||హిందూ, ముస్లీం, క్రైస్తవు
లందరు మానవులె; వారి యందలి భావం
బందర కన్ని తెరంగులు
యందరిలో ప్రజ్ఞ వీవె యరయన్ సాయీ! (052)
కం||ధనమును, బంధులు, మిత్రులు
తనయులు, భార్యయును, తనువు ధారుణి యందున్
“గన మూడునాళ్ళ ముచ్చట”
యని తలచడు మూఢ మనుజు డౌరా! సాయీ! (053)
కం||తెరచాటు నుండి బొమ్మల
జరిపించెడు సూత్రధారి చాడ్పున జగముల్
మురిపించుచు నేడ్పింతువు
పరికింపగ నిన్ను తెలియవశమే? సాయీ! (054) ||12-06-2014||


కం||ఇరువది నాలుగు తత్వము
లెరుగుదు నేనంచుబల్కు నెవ్వడొ యతడే
పరుడై స్థిరుడై యుండియు
చరియించును దేహినంచు జగతిని సాయీ! (061)
కం||వాదము లేటికి మనసా!
వేదాతీత స్వరూపు విజ్ఞానముచే
మోదమలర భావింపుము
వేదనలు తొలంగునన్న వినదో సాయీ! (062)
కం||నీ నామ సుధారసమును
పానమొనర్చుచు సుఖాను భవమానసులై
మేనులు మరచి చరించెడి
జ్ఞానుల పద సేవజేతు చక్కగా సాయీ! (063) ||15-06-2014||
కం॥లోకారాధ్యుడవగు నీ
వీ కరణి “ఫకీరు” వోలె వెలసితి వౌరా!
నీకెన్ని వేసములు గలవోకద 

వర్ణింప మాకు యొప్పునె? సాయీ! (076) 

కం॥అడిగిన సంపదలెల్లను
వడివడిగా నొసగు ప్రభుడ వయ్యును కబళం
బడిగెదవట యైదిండ్లను
గడవద? వారు తరియింపఁ గాదే? సాయీ! (077)
కం॥మునిజన హృదయ విహారీ!
ఘనతర మోహాంధకార కాలుష్యహరి!
వనజదళనయనశౌరీ!
మనుజార్చిత దివ్యరూప మద్గురు సాయీ! (078)|
కం॥నిర్మల శాంతి ప్రదాయీ!
కర్మరహిత దివ్యరూప ఘనసుఖదాయి!
ధర్మార్ధకామ్యదాయీ!
మర్మరహిత భక్తహృదయ మందిర సాయీ! (079)
కం॥పాపాత్ముడ దీనుడ నను
కాపాడక మిన్నకున్న గతి యెవ్వరికన్
నీపాదార్చన సుగతిం
జూపుననుచు నమ్మియుంటి శుభకర సాయీ! (080)

కం॥ధర్మము, సత్యము, హింసయు
కర్మాత్మకములుగ నెచట గానంబడు, నా
నిర్మలు డీవని మ్రొక్కెద
మర్మము లేకుండ సుగుణ మాన్యా సాయీ! (081)
కం॥“తత్వమసి” యంచు దలచెడి
తత్వం బే నెరుగనైతి “తా బ్రహ్మంబన్”
తత్వార్ధంబును దెలియను
సత్య గుణాన్వితునిజేసి సాకుము సాయీ! (082)
కం॥గోపాలుడవై, గోవుల
మేపుచు, లీలను జరించి మేదిని యందున్
కాపాడవె మును భక్తుల
పాపరహిత సర్వజీవ పాలక సాయీ! (083)

కం॥నీపాద పద్మములపై
మోపితి నా శిరము భువన మోహనరూపా!
పాపాత్ముడంచు నెంచక
కాపాడుము నీవె నాకు గతి వో సాయీ! (084) ||22-06-2014||

కం||ఇరువది నాలుగు తత్వము
లెరుగుదు నేనంచుబల్కు నెవ్వడొ యతడే
పరుడై స్థిరుడై యుండియు
చరియించును దేహినంచు జగతిని సాయీ! (061)
కం||వాదము లేటికి మనసా!
వేదాతీత స్వరూపు విజ్ఞానముచే
మోదమలర భావింపుము
వేదనలు తొలంగునన్న వినదో సాయీ! (062)
కం||నీ నామ సుధారసమును
పానమొనర్చుచు సుఖాను భవమానసులై
మేనులు మరచి చరించెడి
జ్ఞానుల పద సేవజేతు చక్కగా సాయీ! (063) ||15-06-2014||






కం॥నాపాలిటి పెన్నిధివై
దాపున వసియించు నిన్ను దర్శింపక యీ
తాపత్రయమున జిక్కితి
కాపాడగ నీవె దిక్కు గద శ్రీసాయీ! (085)
కం॥గురులకు గురుడవు నీవని
గురితించితినయ్య వేరు గురువేలనయా?
స్థిరమతినై నిన్ను నమ్మితి
సరగున బ్రోవంగరమ్ము సద్గురు సాయీ! (086)
కం॥పాపమను యూబి జిక్కితి
యోపిక నశియించె వెడల నోపను కృపతో
ప్రాపైకర మందిమ్మా
నీపై భారంబు నిడితి నియతిని సాయీ! (087) ||23-06-2014||


కం॥జగముల నేలెడి నాదొర!
జగడంబేలయ్య నాతొ సత్వరముగ నా
వగపుడుపరాదె; తండ్రీ!
పగవాడను గాను నీదు భక్తుడ సాయీ! (088)
కం॥సుందరమగు నీ రూపము
యెందగపడునా యటంచు నిలబరికింపన్
అందిందు నెందు జూచిన
సందేహము లేక నీవె సాక్షివి సాయీ! (089) 
కం॥“సాయీ” యను మధురాక్షరి
చే; యవిరళ మూరు సుధను సేవించుచు; నా
యాయాసమెల్ల బాయగ
“హాయి” యనెడు పరమసుఖము నందెద సాయీ! (090) ||24-06-2014||
కం॥ధర్మోద్ధరణకు భువిలో
నిర్మల్ తేజంబెలార్ప నీ వెల్లప్పుడున్
కర్మిష్టివై జనింతువుదుర్మార్గం బడగఁ జేయుదువు! శ్రీసాయీ! (091)


కం॥జననము మరణము రెండును
కనుగొనగా కర్మవశత గల్గుచునుండున్
తన కర్మ లెల్ల నీవిగ
మనమున భావింప ముక్తి మహిలో సాయీ! (092)
కం॥జీవుడ వగుదువు నీవే
దేవుడవని తెలియలేక దిక్కెవరంచున్
భావింతు నెన్నొ తెరవుల
నీవంకకు దిరిగి చూడనేరక సాయీ! (093) ||25-06-2014||

కం॥పతితుడనో పాతకినో
గతము గతించినది గాదె! కారుణ్య నిధీ!
హితమగు మార్గము జూపియు
సతతము నడిపింపుమింక సద్గురు సాయీ! (103)
కం॥సలలిత “సాయీ” నామము
తలచిన భవబంధమెల్ల తలగునటంచున్
పలికిన పెద్దల పలుకుల
దలచినిన్ను మదిని నిల్పదలచెద సాయీ! (104)
కం॥ఎందరొ! నీ భక్తులు నే
నందరకును వందనముల నర్పించెద నా
యందు దయజూపి వారల
చందము నన్నాదుకొనగ సమయము సాయీ! (105) ||29-06-2014||
కం॥పసివాని ముద్దు పల్కులు
పసగల వాక్యంబు లనుచు భావించినటుల్
దొసగులని యెంచ కీ పద
కుసుమములన్ స్వీకరింప గోరెద సాయీ! (106)
కం॥జయమగు సాయీశ్వరునకు
జయమగు ప్రణతార్తి హరుని శాశ్వత ధునికిన్
జయమౌ ద్వారకమాయికి!
జయమగు సద్భక్తులకును సతతము సాయీ! (107)
కం॥మంగళము దివ్యరూపా!
మంగళమో నిర్వికల్ప! మంగళమయ్యా!
మంగళకర జనులకు శుభ
మంగళములు గల్గజేయుమా! ప్రభు! సాయీ! (108) ||30-06-2014||
*** సత్యం శివం సుందరం ***
లోకాస్సమస్తా స్సుఖినోభవంతు!