Translate

25 December, 2014

తెలుగు సుద్దులు - వేమన పద్యములు (తెలుగు - ఇ కూటమిలో పెట్టబడినవి) - 125

తెలుగు సుద్దులు…..(125)
ఆ.వె||దూలములను బోలు దురవస్థలను యెల్ల
రోసి యాసల`న్ని గోసివేసి
వాసనను దెలిసినవాడు పో బ్రహ్మంబు!
విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః
పెద్ద, పెద్ద దుంగ (కఱ్ఱలు) ల్లాంటి బాధలు, కష్టాలు, అవరోధాలు, అడ్డంకులు అన్నిటిని ధైర్యంగా, వీరోచితంగా అధిగమించి; ఆశాపాశాలను, మోహం అనే సంకెళ్లను త్రెంచివేసి నిజమైన స్థానాన్ని, ఆత్మజ్ఞానం (పరమాత్మ తత్వము) తెలుసుకున్నవాడే నిజమైన తపస్వి, హంసుడు, పరమానందుడు, మోక్షగామి.
ఈ పద్యంలో మానవుడు పరబ్రహ్మమును తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, పరమాత్మలో ఐక్యంకావటానికి కావలసిన ముఖ్యమైన ప్రణాలికను వేమన తెల్పి దిశానిర్దేశం చేసారు.
దీనిని నిత్య జీవిత విషయపరంగా కూడా మనము గ్రహించవచ్చు. ఏదైనా లక్ష్యాన్ని (Goal) మనము చేరుకోవాలంటే ఆ ప్రయత్నంలో ఉత్పన్నమైన, రాగల అవరోధాలన్ని ధైర్యంగా, చాకచక్యంగా ఎదుర్కోకలగాలి. భయపడి, అధైర్యంతోతలపెట్టిన కార్యము మధ్యలో వదిలి వేయకూడదు. మన లక్ష్యం సాధించేవరకు, చేరేవరకు మనము ఇతరముల మీద దృష్టి, వ్యామోహం, కోరికలు పెట్టుకోకూడదు. (We have to pay focused attention without any distractions). ||23-12-2014||

No comments:

Post a Comment