Translate

Showing posts with label తెలుగు కవిత. Show all posts
Showing posts with label తెలుగు కవిత. Show all posts

30 August, 2023

నూతన యువ వేదాంతి

చెలియ కోసం కలవరపడసాగే  చెలికాడు...
చెలిమి మధుర ఊసులు ఉవ్వెత్తుగా   స్మృతిలో ఎగసిపడ...
చెలియ విధి శాపంగా పరాధీనమగు వేళ...
చెలియతో కడసారి ఊసులాడి  స్వాంతన పొంద మనసు తహతహలాడ...
అడుగులు తడబడె...
నోటిలోని అక్షరాలు అర్ధం కాని అక్షరాలు గానే మిగిలిపోయె...
కన్నీరు ఉబికిపడ...
చెలియ రూపమే కానరాక...
మిధ్యా జగత్తులో తడబడుతూ పరుగులు తీసే ... 
గమ్యం  అగమ్యం కాగా....
తాము ఊసులాడుకుంటూ తిరిగిన సంద్రంతీరంలో....
అలలు చెరిపివేస్తున్న...
చెలిపాదాల ముద్రలను... 
మురిపెంగా ముద్దిడి...   
మురిసి పోతూ...
సంకేత స్థానానికి రాలేని చెలియ అసహాయతకు...
ఓ వెర్రినవ్వు నవ్వు కుంటూ...
మదిలోని భావాలు భాసించగా...
అర్థం కాని అక్షరాలుగానే మిగిలిపోగా... 
గమ్యం ఎరుగని పయనంలో 
సాగిపోయే ఓ నూతన యువ వేదాంతి....
(29-10-2019)