Translate

07 December, 2014

తెలుగు సుద్దులు - వేమన పద్యములు (తెలుగు - ఇ కూటమిలో పెట్టబడినవి)-116



తెలుగు సుద్దులు…..(116)
               
.వె||ఉర్వి జనులు పరమ యోగీశ్వరుని జూచి
        తెగడు వారు (రె*) గాని తెలియలేరు
        అమృతమా`ది రుచుల* హస్త`మే`మెరు`గును?
        విశ్వదాభిరామ వినర వేమా!.
*యమృతమందు రుచిని - పాఠాంతరము
భావముః
మనం రోజు ఎన్నో రుచికరమైన (అమృతంలాంటి) పదార్ధాలను చేతితో తింటున్నా (పదార్ధాలతో నిత్యం సామీప్యము ఉన్నా) పదార్ధాల రుచిని చేయి ఎలాగుర్తించలేదో అలాగే భూమిమీద జనులు తమ మధ్య ఉన్నఉత్కృష్టులైన (గొప్ప) యోగీశ్వరుని (పరివ్రాజకుడు, విరక్తుడు) జూచి వారి ఔచిత్యాన్ని గుర్తించలేక ఉపేక్షిస్తుంటారు, గుర్తించలేరు. కొంతమంది పిచ్చివాడనటం కూడా వింటుంటాము కదా! ఇందులో యోగీశ్వరుని (పరమాత్మ తత్వము తెలిసినవారు, ఈశ్వరుని) గుర్తించడం కష్టమని తెలుపుతున్నారు.||02-12-2014||

No comments:

Post a Comment