ఓం గణేశాయనమః – గురుభ్యోనమః
__/\__
నారాయణం నమస్కృత్య – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసం – తతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి(క్విజ్) పుస్తకము(1994)ఆధారంగా]
1. జరాసంధుని ఊరు పేరేమి? ఆ పేరు ఎందుకు వచ్చింది?2. వికర్ణుడెవరు? ఇతని ప్రత్యేకత ఏమిటి?
3. జరాసంధు డెవరి కరుణతోజనించాడు?
4. ధర్మరాజు చేతులుతగలబెడతానన్నాడు తమ్ముడొకడు, ఎవరతడు? ఎప్పుడు?
5. సభలో వికర్ణునివారించినదెవరు?
---------------------------------------------------------------------------------------------------------------------
సమాధానములు (జవాబులు):
1. గిరివ్రజముః గోరథము, వృషభము, వైహారము, ఋషిగిరి, చైత్యకము అయిదు గిరులుచుట్టుముట్టి ఉండునది. –సభాపర్వము – ప్రథమాశ్వాసము –175పద్యము
కం|| గోరథమును ఋషభము వై
హారము ఋషిగిరియుఁ జైత్యకాద్రియు ననఁగా
భూరిగిరు లేను దీనికి
శూరభటులువోలెఁ గాచి చుట్టును నుండున్.(175)
2. దుర్యోధనుని తమ్ముడుఃద్రౌపది అధర్మవిజిత అని చెప్పిన దీతడే. – సభాపర్వము– ద్వితీయాశ్వాసము –
225&227 వచనములు; 226&236 పద్యములు
వ॥అనుచు
దుఃఖితు లగుచున్నపాండవులను దుశ్శాసనాపకృష్ణ యై సభాంతరంబున నున్న ద్రౌపదిం జూచి
వికర్ణుండన్యాయశ్రవణ వికర్ణు లైమిన్నకున్న సభ్యుల
కిట్లనియె. (225)
కం॥సమచి త్తవృత్తు లగుబు
ద్ధిమంతులకు నిపుడు
ద్రౌపదీప్రశ్నవిచా
రము సేయవలయు నవిచా
రమునఁ బ్రవర్తిల్లు టది నరకహేతు వగున్. (226)
వ॥ఇక్కురువృద్ధు లైనభీష్మధృతరాష్ట్రవిదురాదులును నాచార్యు లయినద్రోణకృపాదులుం
బలుకరైరి యున్నసభాసదు లెల్లం గామక్రోధాదులు దక్కి విచారించి చెప్పుం డనిన నెవ్వరుం
బలుక కున్న నేనిమ్దు ధర్మ్నిర్ణయంబు సెసెద నెల్లవారును వినుండు జూదంబును వేఁటయుఁ బానంబును
బహుభక్షణాసక్తియు నను నాలుగు దుర్వ్యసనంబులం దగిలినపురుషుండు ధర్మువుం దప్పి వర్తిల్లునట్టివనికృత్యంబులు
సేకొనందగవు కితవాహుతుం డై వ్యసనవర్తియయి పరాజితుండయినపాండవాగ్రజుండు పాండవుల కందఱకు
సాధారణ ధనంబయినపాంచాలిఁ బణంబుఁ జేసెం గావున ద్రౌపది యధర్మవిజిత యక్కోమలి నేకవస్త్ర
నిట దోడ్కొనితెచ్చుట యన్యాయం బనిన వికర్ణుపలుకుల కొడంబడక కర్ణుండు వాని కి ట్లనియె.
(227)
మత్తకోకిలము॥ఈవికర్ణుండు బాలుఁ డయ్యును నేర్పరించి యథావిధిన్
దేవమంత్రియపోలె ధర్మువుఁ దెల్పె
నీతనిబుద్ధి మీ
రేవగింపక చేకొనుం డిది యెల్లయందును
ధర్మస
ధ్బావ మొక్కని కేర్పరింపఁగ బ్రహ్మకైనను
బోలునే. (236)
3. చండకౌశికుడు. -సభాపర్వము – ప్రథమాశ్వాసము – 144,152&154 వచనములు; 145 పద్యము
వ॥దానిం బుచ్చికొని యభిమంత్రించి చండకౌశికుండు
బృహద్రథున కిచ్చి యీ ఫలంబువలన నీకొక్కపుత్రుం డుద్భవిల్లు నని చెప్పిన నతండును గృతార్థుండై
క్రమ్మఱి నిజపురమ్బునకు వచ్చి తనయిద్దఱుభార్యలకు నప్పండు సమంబుగా విభాగించి పెట్టినం
దత్ఫలోపభోగంబున నయ్యిద్దఱు గర్భిణులయినఁ బదియగు మాసంబున నొక్కనాఁటిరాత్రియందు వారలకు
(144)
కం॥ఒక్కొకకన్నును జెవియును
జెక్కును జను బొడ్డుమూఁపుఁ జెలు వగుచేయున్
బ్రక్కయుఁ గుఱువును
గాలును
నక్కజముగ మనుజశకలమైయుదయించెన్.
(145)
వ॥నీయిద్దఱుదేవులకు నుద్భవిల్లిన
యిమ్మనుష్యశకలంబులు రెండును నీదాదులు దెచ్చి యిచ్చదుకంబునొద్ద
నొక్కచో వైచి పోయిన నేను వానిం గూడఁబట్టుడు నప్పుడు
వజ్రఘనఘటిత శరీరుం డైయిక్కుమారుండు
మేరుగిరి శృంగంబునుంబోలెనకెత్తికొన నశక్యుం డయ్యె
వీని నొప్పుగొను మనిన విని బృహద్రథుండు
ముదితహృదయుండయి దాని కిట్లనియె. (152)
వ॥అని దని నతిప్రీతిం
బూజించి కొడుకు నెత్తికొని దేవీద్వయంబునకు నిచ్చి జరయనురాక్షసిచేత సంధింపఁబడినవాఁడు
గవున జరాసంధుం డనుపే రిడి పురంబష్టశోభనంబు సేయించి యారాక్షసి కేఁటేఁట మహోత్సవంబు సేయింఉఉం
గొడుకు నతిగారవంబునం బెంచిన. (154)
4. భీముడుః జూదమాడినందుకు; అపుడు అర్జునుడు వారించాడు. - సభాపర్వము – ద్వితీయాశ్వాసము – 223వచనము.
వ॥శకునికైతవం
బెఱింగియుం బాపద్యూతంబుఁ బ్రవర్తించి యధర్మప్రవృత్తుండవయితి కావున
భవద్బాహుదాహంబు సేయ వలయు నని కోపించి పలికినం
బవనతనయునకు నర్జుండి ట్లనియె. (223)
5. కర్ణుడు - సభాపర్వము – ద్వితీయాశ్వాసము – 228 పద్యము.
ఆ|| ఎల్లవారు నెఱుఁగ నొల్లనిధర్మువు
బేల నీకుఁ జెప్ప నేల వలసెఁ
జిఱుతవాని కింత తఱుసంపటిపలుకులు
సన్నె వృద్ధజనము లున్నచోట. (228)
*****************************************************************************************
No comments:
Post a Comment