ఓం గణేశాయనమః – గురుభ్యోనమః
__/\__
నారాయణం నమస్కృత్య – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసం – తతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]
1. కౌరవ పాండవుల మధ్య మొదటి రాయబారం ఎవరిది?
2. ధర్మరాజు ధర్మవృక్షము అయితే దానికి మూలం ఎవరు?
3. పాండవులలో ఒకడు సంజయుని బాలసఖుడు, ఎవరు?
4. పుణ్య పురుడని ఎవరినంటారు?
5. “నువ్వెంత లంచమిచ్చినా కృష్ణుడు కౌరవపక్షానికి రాడు” - ఈ మాటలు ఎవరు ఎవరితో అన్నారు?
2. ధర్మరాజు ధర్మవృక్షము అయితే దానికి మూలం ఎవరు?
3. పాండవులలో ఒకడు సంజయుని బాలసఖుడు, ఎవరు?
4. పుణ్య పురుడని ఎవరినంటారు?
5. “నువ్వెంత లంచమిచ్చినా కృష్ణుడు కౌరవపక్షానికి రాడు” - ఈ మాటలు ఎవరు ఎవరితో అన్నారు?
---------------------------------------------------------------------------------
సమాధానములు
(జవాబులు):
1. ద్రుపదుని పురోహితుడు. – ఉద్యోగపర్వము – ప్రథమాశ్వాసము – 52 వచనము; 53,54 పద్యములు
వ|| అట్టిసమయంబున నజాతశత్రుననుమతి వడసి పాంచాలపతి వయోజ్ఞానవృద్ధుండైన తనపురోహితుం
1. ద్రుపదుని పురోహితుడు. – ఉద్యోగపర్వము – ప్రథమాశ్వాసము – 52 వచనము; 53,54 పద్యములు
వ|| అట్టిసమయంబున నజాతశత్రుననుమతి వడసి పాంచాలపతి వయోజ్ఞానవృద్ధుండైన తనపురోహితుం
గురుపతిపాలికిఁ బుచ్చువాఁడై యతని రావించి. (52)
క|| హితుఁడవు మతిమంతుండవు
చతురవచనకోవిదుఁడవు సమయజ్ఞుఁడ వు
న్న తవంశవర్ధనుఁడ విం
గిత వేదివి నెచ్చెలివి సుకృతి వ ట్లగుటన్. (53)
తే|| నాకుఁ గర్తవ్య మగుపని నీకుఁ జేయఁ
దగవు గావున నెల్లవిధములఁ బూని
పాండవార్ధంబు ధృతరాష్ట్రుపాలి కరిగి
నేర్పు వాటించి కార్యంబు దీర్పవలయు. (54)
క|| హితుఁడవు మతిమంతుండవు
చతురవచనకోవిదుఁడవు సమయజ్ఞుఁడ వు
న్న తవంశవర్ధనుఁడ విం
గిత వేదివి నెచ్చెలివి సుకృతి వ ట్లగుటన్. (53)
తే|| నాకుఁ గర్తవ్య మగుపని నీకుఁ జేయఁ
దగవు గావున నెల్లవిధములఁ బూని
పాండవార్ధంబు ధృతరాష్ట్రుపాలి కరిగి
నేర్పు వాటించి కార్యంబు దీర్పవలయు. (54)
2. కృష్ణుడు - భూసురులు – వేదములు - ఉద్యోగపర్వము – ప్రథమాశ్వాసము – 356 పద్యము
ఆ|| ధర్మజుండు ధర్మ తరు వర్జునుఁడు ఘన
స్కంధ మనిలసుతుఁడు శాఖ కవలు
పుష్పఫలము లేను భూసురులును వేద
ములుఁ దదీయ మైనమూలచయము. (356)
3. అర్జునుడు. - ఉద్యోగపర్వము – ప్రథమాశ్వాసము – 378 పద్యము
క|| బాలసఖుండవు నాకును
నీలెస్సఁదనంబు నేము నీతి విడిచి దు
శ్శీలుర మగుటయు శైశవ
లీల మొదలు గాఁగ మును దెలియదే నీకున్. (378)
4. సమర్ధుడైనా సహనం వహించేవాడు, పేదవాడయినా ఉన్నంతలో ప్రీతిగా దానంచేసేవాడు పుణ్యపురుషుడు. - ఉద్యోగపర్వము – ద్వితీయాశ్వాసము – 42 పద్యము
తే|| చెల్లి యుండియు సై రణ సేయునతఁడుఁ
బేదవడియును నర్ధికిఁ బ్రియముతోడఁ
దనకుఁ గలభంగినిచ్చునతండుఁ బుణ్య
పురుషులనిచెప్పి రార్యులు గురువరేణ్య. (42)
5. రాయబారానికి కృష్ణుడు వస్తున్నాడని తెలిసికొని ధృతరాష్ట్రుడతనికి తగిన కానుకలిచ్చి లోబరుచుకోవాలని సంకల్పించినపుడు విదురుడు ధృతరాష్ట్రునితో “నువ్వెంత లంచమిచ్చినా కృష్ణుడు కౌరవపక్షానికి రాడు” అని అంటాడు. - ఉద్యోగపర్వము – తృతీయాశ్వాసము – 159 పద్యము
ఉ|| నీతలఁ పేను గంటి నొకనేర్పున శౌరికి లంచ మిచ్చి సం
ప్రీతునిఁ జేసి కార్యగతి భేదము సేయగఁ జూచె దింత బే
లైతిగదే సుమేరుసదృశార్ధముఁ జూచియుఁ బార్ధుఁ బాయునే
యాతఁడు క్రీడిభక్తియును నచ్యుతు పెంపును నీ వెఱుంగవే. (159)
@@@@@@@@
No comments:
Post a Comment