Translate

13 January, 2015

తెలుగు సుద్దులు - వేమన పద్యములు (తెలుగు - ఇ కూటమిలో పెట్టబడినవి) -134

తెలుగు సుద్దులు…..(134)
ఆ.వె॥పరగ రాతిగుండు పగల గొట్టగ వచ్చు,
కొండల`న్ని పిండి గొట్టవచ్చు,
కఠిన చిత్తు మనసు కరిగింప గారాదు
విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః
అతితేలికగా బండరాయిని పగలగొట్టవచ్చును. కొండలను సైతము కష్టపడి పిండి,పిండిగా చితక్కొట్టవచ్చు. కాని, కఠినమైన మనస్సుగలవానిని (ఱాతి గుండె వానిని) ఎన్ని ఉపాయములచేతనైను, ఎన్ని బోధలుచేసికాని మార్చలేము. అనగా ప్రయత్నపూర్వకంగా ఎన్నో అసాధ్యమైన పనులు సుసాధ్యం చేయవచ్చునుకాని; జాలి, దయ లేని మూర్ఖుని (మానవత్వం లేని కఠినాత్ముని) మార్చటం అనగా మంచిదారికి తేవటం సాధ్యమవదు అని వేమన హెచ్చరిస్తున్నారు. కనుక కఠినాత్ములకు దూరంగ మసులుకోవటం విజ్ఞుల తక్షణ కర్తవ్యం. ||11-01-2015||

No comments:

Post a Comment