తెలుగు సుద్దులు…..(137)
ఆ.వె॥మాటలా`డ వేరె మనసు కొలది వేరె
యొడలి గుణము వేరె యోజ వేరె;
యెట్లు గల్గు ముక్తి యేలాగు తనలాగు?
విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః
పలికేదొకటి, చెప్పేదొకటి, మనసులో కోరికొకటి, చేసేదొకటి (ఆచరించేదొకటి), ఆలోచనలు వేరు తానీవిధంగా ఉంటే మానవునికి ముక్తి ఎలా కలుగుతుందని వేమన మనలను కపటము లేకుండా, త్రికరణ శుద్ధిగా (మనసా, వాచా, కర్మణా) వేరే ఐహిక తలంపులు లేకుండా పరమాత్మను నమ్ముకొని జీవించమని హితవు పలుకుతున్నారు. ||19-01-2015||
No comments:
Post a Comment