Translate

24 January, 2015

తెలుగు సుద్దులు - వేమన పద్యములు (తెలుగు - ఇ కూటమిలో పెట్టబడినవి) -139



.వెఎంత కష్టముండు నం` పాపపు చింత;
           చింత చేత మిగుల జివుకు మనసు;       
           చింతలేక ను`న్న చెడని సంపద జూచు 
           విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః                          
మానవునికి కష్టాలు కలిగేకొద్ది పాపపు ఆలోచనలు, చెడుభావనలు (అసూయ, కోపం, క్రోధం, ద్వేషం మొ.వి) కూడా పెరుగుతుంటాయి; తద్వారా మనస్సుకు స్వాంతన ఉండక విపరీతంగా బాధపడుతుంటుంది. (బాధ కల్గినప్పుడు మనస్సు చివుక్కుమన్నదని అనడం పరిపాటికదా.) ఎవరైతే చింత(లు) లేకుండా ఉంటారో వారు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు కనుక శాశ్వతమైన పరమాత్మ తత్వమును గ్రహించకలుగుతారు. లౌకిక చింతలనుండి బయటపడినవారు విజ్ఞాన చింతన (అలౌకిక ఆలోచన - పరమాత్మ తత్వము గురించి ధ్యాస) అనే తరగని సంపదను పొందుతారు. ఆరోగ్యమే (మానసిక ఆనందమే) మహాభాగ్యమని గుర్తెరిగి మసలుకోమని వేమన హితవు పలుకుతున్నారు. ||23-01-2015||

No comments:

Post a Comment