Translate

28 January, 2015

తెలుగు సుద్దులు - వేమన పద్యములు (తెలుగు - ఇ కూటమిలో పెట్టబడినవి) -141



తెలుగు సుద్దులు…..(141)
కం||ధనమె`చ్చిన మదమె`చ్చును,
      మదమె`చ్చిన దుర్గణంబు మానక నె`చ్చున్;
      ధనము`డిగిన మదము`డుగును;
      మదము`డిగిన దుర్గుణంబు మానును వేమా!  
భావముః        
ధనము (సంపద) ఎక్కువైతే గర్వము కూడా పెరుగుతుంది.  గర్వం తలకెక్కితే దుర్గుణాలు (ఇతరులను గౌరవించకపోవడం, కించపర్చడం, అవహేలనచేయడం, లెక్కచేయకపోవడం, ఇతరులతో తనకు సంబంధములేనట్లు ప్రవర్తించడము, దుర్వ్యసనాలు మొదలైనవి) తప్పక పెరుగుతాయి. ఎప్పుడైతే సంపద నశిస్తుందో అప్పుడు నెత్తిమీది కళ్ళు క్రిందకుదిగి, గర్వము తగ్గి  అవలక్షణాలన్ని మెల్లల్లగా తగ్గి వాస్తవస్థితికి చేరును; ధనము తోడిదే మదము సుమా అని వేమన హెచ్చరిస్తున్నారు. అర్థాత్తుగా (అనుకోకుండా, హఠాత్తుగా, శ్రమపడకుండా, అక్రమపద్ధతులలో)  సంపద కలిగితే సహజంగా వేమన చెప్పిన లక్షణాలు మానవులలో తొంగిచూస్తుంటాయికదా!సంపదనేది శాశ్వతము కాదు కనుక అది గ్రహించుకొని మసలుకొనమని వేమన హితవూ పలుకుతున్నారు.||27-01-2015||

No comments:

Post a Comment