Translate

08 January, 2015

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి- 43 (211– 215)



ఓం గణేశాయనమఃగురుభ్యోనమః
                                                                         __/\__       
నారాయణం నమస్కృత్య  – నరంచైవ నరోత్తమమ్|

దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్|

[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]


1. ఇద్దరికి కంఠానికి రాయి కట్టి నీళ్లలో ముంచాలిట, ఇద్దరూ ఎవరు?
2.
నామతమున యుద్ధమే కర్తవ్యం అని పాండవపక్షంలో చెప్పినదెవరు?
3.
ఉన్నతిని కోరేవాడు విడువరానివి ఆరు ఉన్నాయి, అవి ఏవి?
4.
బాలుడు ముందుకోరుకోవాలి అని ఎవరు అన్నారు? ఎప్పుడు?
5.
సంపదకు దీప్తినిచ్చేవి ఏవి?
----------------------------------------------------------------------------------
 
సమాధానములు (జవాబులు):
1. 1)
ధనం ఉండి దానం చెయ్యని వానిని 2) దరిద్రుడై ఉండి తప్పస్సు చేయని వానిని. - -
        ద్వావంభసి వినిక్షేప్యౌ దృఢం బద్ధ్వా గళే శిలామ్
        ధనినం చాప్రదాతారం దరిద్రం చాతపస్వినమ్|| సం. ఉద్యోగపర్వము 33 72 శ్లోకము

2. సాత్యకి. కౌరవుల కడకు వెళ్లిన పాండవుల దూత దుర్యోధనుని ప్రార్ధిస్తూ అడగాలి అని బలరాముడంటే సాత్యకి         కోపించి ఈమాట అన్నాడు. - ఉద్యోగపర్వము ప్రథమాశ్వాసము 31 పద్యము
||నామతమునఁ గార్యము సం
  
గ్రామము సేయుటయు యిట్లు గా కీలోన్
   సామవచనంబు లక్కురు
  
భూమీశ్వరుతోడ నాడఁ బుచ్చెదరేనిన్. (31)

3. 1) సత్యము 2) దానము 4) అనాలస్యము 5) అనసూయ 5) సహనము 6) ధైర్యము
       షడేవతు గుణాః పుంసా హాతవ్యాః కదాచన
       సత్యం దాన మనలస్య మనసూయా క్షమా ధృతిః|| సం. ఉద్యోగపర్వము 33 81 శ్లోకము

4. కృష్ణుడు. తనను సాయమడగటానికి వచ్చినపుడు అర్జున, దుర్యోధనులతో, తనను కాని, 10వేల మందిని కాని
    కోరుకోండి అని చెప్పి, మీ యిద్దరిలో చిన్నవాడు కాబట్టి అర్జునుడు ముందు కోరుకోవాలి అని అంటాడు-  
    ఉద్యోగపర్వము ప్రథమాశ్వాసము 75 పద్యము

||వా రొకతల యే నొకతల
   
యీరెండుదెఱంగులందు నెయ్యది ప్రియ మె
    వ్వారికిఁ జెప్పుఁడు దొలితొలి
    గోరికొనన్ బాలునికిఁ దగుం బాడిమెయిన్. (75)

5. 1) ధైర్యము 2) శమము 3) దమము 4) శుచిత్వము 5) దయ 6) మృదుసంభాషణ 7) మిత్రద్రోహం   
    చేయకపోవడం
     ధృతిశ్శమో దమ శ్శౌచం కారుణ్యం వాగనిష్ఠురా
     మిత్రాణాం చానభిద్రోహః సప్తైతా స్సమిధః శ్రియః|| సం.ఉద్యోగపర్వము 37 38 శ్లోకము


No comments:

Post a Comment