ఓం గణేశాయనమః – గురుభ్యోనమః
__/\__
నారాయణం నమస్కృత్య
– నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసం – తతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]
1. అశ్వత్థామ నారాయణాస్త్రం నుండి పాండవ సేన ఎలా రక్షింపబడింది?
2. కర్ణుని జన్మ గురించి భీష్ముని కెట్లా తెలుసును?
3. యుద్ధం మొదటిరోజు కౌరవపాండవులలో ఎవరిచేయి పైగా ఉంది?
4. యుద్ధంలో కర్ణుడు భీముని పరాక్రమం ప్రశంసిస్తాడు ఎప్పుడు?
5. సువర్ణష్ఠీవి చరిత్ర ఎవరు ఎవరికి చెప్పారు? ఎపుడు? ఎందుకు చెప్పవలసి వచ్చింది?
----------------------------------------------------------------------------------
సమాధానములు (జవాబులు):
సమాధానములు (జవాబులు):
1. నమస్కారంతో – భూమికి దిగి నమస్కరిస్తే నారాయణాస్త్రం ఏమీ చెయ్యదని కృష్ణుడు చెప్పాడు. పాండవసేన అలాగే చేసింది. భీముడు చేయనంటే కూడా బలవంతాన చేయించారు కృష్ణార్జునులు. – ద్రోణపర్వము – పంచమాశ్వాసము –
382 వచనము
వ|| అనిన విని జనార్ధనుండు సత్వరుం డై పెద్దయెలుంగున నెల్ల వారును విన సైనికులారా సామజహయరథంబులు డిగ్గి యాయుధంబులు పెట్టి నిలువుండు భూమి గతు లగునిరాయుధుల నిమ్మహాస్త్రం బేమియుం జేయ దది యెట్లనిన ని ట్లగుట దీనికిఁ బ్రతివిధానంబుగా దీని నొసంగినమహాత్ముండు విధియించె ననుటయు సకలజనంబులు నమ్మాట కియ్యకొని యట్లుచేయం జూచినసమయంబున సమీర నందనుండు. (382)

2. వ్యాసమహర్షి ఏకాంతంగా చెప్పాడు. - భీష్మపర్వము – తృతీయాశ్వాసము –
445 వచనము
వ||
ఇది
కృష్ణద్వైపాయనుండు నాకు నేకాంతంబున నెఱింగించె నేనును భవదీయ తేజోవిశేషంబువలననుం గనుంగొనియుండుదుఁ బాండుతనయుండ వగుటంజేసి నీయెడ వాత్సల్యంబ కాని మాత్సర్యంబు లే దొక్కటి చెప్పెద విను మేను గురుపాండవుల వైరం బుడిపి పుచ్చితి నప్పాండవేయు లజయ్యు లప్రమేయుండగు
కృష్ణుండు వారికి విధేయుండు కవున వారలతోడివిరోధం బొప్పదు నీవును నొండుదలంపు దక్కి యక్కౌంతేయులం గలిసి యుండు మనినఁ గర్ణుం డతని కి ట్లనియె. (445)
కృష్ణుండు వారికి విధేయుండు కవున వారలతోడివిరోధం బొప్పదు నీవును నొండుదలంపు దక్కి యక్కౌంతేయులం గలిసి యుండు మనినఁ గర్ణుం డతని కి ట్లనియె. (445)
3. యుద్ధం మొదటిరోజు కౌరవపాండవులలో కౌరవులచేయి పైగా ఉంది. – భీష్మపర్వము – ప్రథమాశ్వాసము –
297 –
300 పద్యములు
తే|| ఇట్లు పాండవసైన్యంబు లెల్లఁ గలఁగి
యిక్కడక్కడఁ బడుచుండ నక్కజంపుఁ
గడిమి కచ్చెరువడి యొక్కకడకు వచ్చి
పాండుసూనులు నివ్వెఱపాటు నొంద. (297)
క|| శాంతనవుఁడు తేజోదు
ర్దాంతుం డై నావెలుంగు ధర కెల్లను జా
లింతు నినుఁ డస్తశైలో
పాంతమునకుఁ జనిన నేమి యనిన ట్లుండెన్. (298)
క|| సోమాన్వయప్రదీపకుఁ
డీమెయిఁ దేజోవిశేష మెసకం బెసఁగం
గా మెఱయుట కనుఁగొని సి
గ్గై మఱువడుమాడ్కిఁ గ్రుంకె నర్కుం డంతన్. (299)
తే|| జలరుహంబులు పాండవసైనికుల మొ
గంబులట్టుల విన్ననై కాంతి తఱిఁగె
వారిమనముల భీత్యంధకార మడరు
కరణిఁ జీఁకటి యెడనెడఁ గవియు దెంచె. (300)

4. 12వ రోజున ద్రోణునిచేత బాధింపబడుతున్న భీముని చూసి పరిహసిస్తూ దుర్యోధనుడు మాట్లాడితే కర్ణుడు భీముని పరాక్రమం ప్రశంసిస్తాడు. - ద్రోణపర్వము – ప్రథమాశ్వాసము –
304
ఉ|| భీముఁడు నట్టివాఁడె యరిభిషణవిక్రముఁ డస్మదీయసం
గ్రామజయంబు ప్రాణములు కల్గఁగ సైఁచునె పాండవేయు లు
ద్ధామబలాఢ్యు లాహవముతక్కుదు రే యది గాక వారు నీ
చే మును పడ్డపాట్లు తమచిత్తములన్ మఱవంగ నేర్తురే. (304)
ఉ|| భీముఁడు నట్టివాఁడె యరిభిషణవిక్రముఁ డస్మదీయసం
గ్రామజయంబు ప్రాణములు కల్గఁగ సైఁచునె పాండవేయు లు
ద్ధామబలాఢ్యు లాహవముతక్కుదు రే యది గాక వారు నీ
చే మును పడ్డపాట్లు తమచిత్తములన్ మఱవంగ నేర్తురే. (304)
5. అభిమన్యుని మరణానికి విలపించే ధర్మరాజు నోదార్చటానికి వ్యాసుడు చెప్పవలసి వచ్చింది. – ద్రోణపర్వము – ద్వితీయాశ్వాసము – 187,189,191,194 వచనములు; 188,190,192,193,195 పద్యములు
వ|| అది య ట్లుండె మహితాత్ము లయిన మహీపతులవరిష్ఠకర్మానుష్ఠానంబుల తెఱంగెఱుంగుట మేల కాదె యంత లంతలు మానుసులు మడిసిరి గాని పుడమి నిత్యులై నిలువం బడ రది వినుటయు నీమనోరోగశమనంబుచేయుం జెప్పెద నాకర్ణింపుము. (187)

క||
జనపాలక
సృంజయుఁ డను
మను జేంద్రుఁడు పుణ్యమూర్తి మహిమాస్పదుఁడి
వ్వననిధివలయములోనియ
వని నొక్కఁడ యేలు దుర్నివారస్పురణన్. (188)
మను జేంద్రుఁడు పుణ్యమూర్తి మహిమాస్పదుఁడి
వ్వననిధివలయములోనియ
వని నొక్కఁడ యేలు దుర్నివారస్పురణన్. (188)
వ॥సంతానార్థ యయి సంతతంబును భూసురపూజనంబులు చేయుచుండు నానరపతికి నరదుండు సఖుం డగుట నతనిపాలికిఁ బలుమాఱు నరుగుదెంచుచుండు నొక్కనాఁడు పిప్రవరు లతిప్రయత్నంబునం గూడికొని యమ్మునివరునితో నిమ్మహీపతికోర్కి తీర్ప వలదే యని చెప్పిన. (189)
క॥అతఁ డతనితోడ భవదీ
ప్సిత
మెయ్యది నాకు నేల చెప్ప వనుడు నం
చితగుణుఁడు
రూపసియు నగు
సుతుఁ
గోరుదు నెపుడు నేను సురగణవంద్యా. (190)
వ॥అక్కుమారుండును మూత్రపురీషలాలాశ్రుస్వేదంబులు సువర్ణంబు
లగునట్టివాఁడు కావలయు ననిన నమ్మహీపతికి నమ్మహాత్ముం డవ్వరం బిచ్చె నాసృంజయుండు నత్తెఱంగుతనయుం
బడసి సువర్ణష్ఠీవి యనుపేరిడి ప్రియంబునం బెనుచుచు వానివలనం గనకం బనుదినంబు నుత్తరోత్తరాభివృద్ధి
యగుచుండ సమృద్ధి నొంది శయనాసనసదనప్రాకారప్రభృతిసమస్తవస్తులును గాంచనమయంబులు కావించికొని
యసమానమహిమానందంబునం బ్రకాశుం డై. (191)
క॥విలసిల్లుచు నుండఁగ మ్రు
చ్చిలి
పట్టి కుమారునోరఁ జీరఁ దుఱిమి వెం
గలు లగుక్రూరులు
గొందఱు
వెలువడఁగొనిపోయి
యొక్కవిపినములోనన్. (192)
ఆ॥కడుపు వ్రచ్చి యొడలు కలయంగ జల్లించి
పాపి
పాపి చూచి పసిఁడి కాన
కచట
శవము వైచి యరుగుచు నుండి త
త్కర్మఫలముఁదమ్ముగలఁచుటయును.
(193)
వ॥ఆపాపాత్ములు తమలోనం గలహించి యొండొరుల వధియించి యందఱు నధోగతిం
జెందిరి సృంజయుండును గొడుకుం గానక వెదకి తత్కళేబరంబు గని పరలోకక్రియలు నిర్వర్తించి శోకంబునం బలవించుచున్న
నన్నరేంద్రుకడకు నారదుం డరుగుదెంచి యతనిచేత నర్చితుం డై. (194)
క||
జననాథ
యిట్లు
శోకం
బునఁ గుందినఁ దనువు విడిచి పోదె యుసుఱుచ
బునఁ గుందినఁ దనువు విడిచి పోదె యుసుఱుచ
చ్చినవారలు వత్తురె యే
డ్చినఁ జెలిమింజేసి హితము చెప్పెద నీకున్. (195)
డ్చినఁ జెలిమింజేసి హితము చెప్పెద నీకున్. (195)
******************************************************************************************
No comments:
Post a Comment