Translate

26 January, 2015

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి- 050 (246 – 250)



ఓం గణేశాయనమఃగురుభ్యోనమః
                                                                         __/\__       
నారాయణం నమస్కృత్య  – నరంచైవ నరోత్తమమ్|


దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]

1. భారతంలో కౌరవ పాండవులకు రాయబారాలెన్ని జరిగాయి? ఏవి?
2.
ఇరావంతుడెవరు? అతనిని యుద్ధంలో ఎవరు చంపారు?
3.
అంపశయ్య మీద పడ్డాక భీష్ముడు ఎవరితో రహస్యంగా మాట్లాడాడు?
4.
కౌరవ పక్షంలో పరుశురాముని శిష్యులెంతమంది? ఎవరెవరు?
5.
నమ్మరాని వారెవరు?
----------------------------------------------------------------------------------
సమాధానములు (జవాబులు):
1. నాలుగుద్రుపద పురోహితుడుఃపాండవుల పక్షమున (ఉద్యోగపర్వముప్రథమాశ్వాసము); సంజయుడుః కౌరవుల పక్షమున – (ఉద్యోగపర్వముప్రథమాశ్వాసము); కృష్ణుడుః పాండవుల పక్షమున (ఉద్యోగపర్వము తృతీయాశ్వాసము); ఉలూకుడుః కౌరవుల పక్షమున (ఉద్యోగపర్వముచతుర్థాశ్వాసము)

2.
అర్జునునికి ఉలూచికి పుట్టినవాడు ఇరావంతుడు; ఇతనిని అలంబుసుడు చంపినాడు. భీష్మపర్వము  
    తృతీయాశ్వాసము 102 వచనము; 103to105 పద్యములు
  || అయ్యిరావంతుం డొక్కరుండును బొలివోనివిక్రమంబున నలంబుసుని మార్కొని రయంబు
మెఱయ మెఱుంగుమెఱసినట్లు కవిసి కరవాలంబున విల్లు దునిమిన దనుజుండు వినువీధి కెగసి
మాయాశరంబుల నతని నొప్పించినం గోపించి గగనంబునకు లంఘించి. (102)
|| ఘనఖడ్గంబున వానిం
    దునుమ నలంబుసుఁడు తోడుతో నుజ్జ్వలయౌ
    వనరూపము క్రొత్తగఁ గై
    కొని పెనఁగం బెనఁగఁ బార్ధుకొడు కచలుండై. (103)
|| జననీవంశంబునఁ గల
    యనుపమమాయానుభావ మాత్మఁ దలఁచి శే
    షునిచందమ బగురూపం
    బునఁ బేర్చి యనేక్నాగపుంజముతోడన్. (104)
|| అడరిన దానవుండు గరుడాకృతిఁ గైకొని మాయతోడ లోఁ
    బడ భుజగంబులం బొదివి పట్టి రయమ్బున మ్రింగి యప్డు చే
    డ్పడునరుపట్టికంఠముఁ గృపాణమునం దెగ వైవ మేదినిం
      బడి మొగ మొప్పఁఏ బూర్ణశశిభాతి వికారము లేని చెన్నునన్. (105)

3. కర్ణునితో కర్ణుని జన్మను గురించి చెప్పి పాండవులను కలిస్తే యుద్ధం ఉండదని చెపుతాడు. కర్ణుడు  
    తిరస్కరిస్తాడు. భీష్మపర్వము తృతీయాశ్వాసము 440 to 445
|| అలుక తక్కి నన్ను నధికవాత్సల్యశీ
    తలము కాఁగఁ జూచి తగినమాట
    లాడ వే మహాత్మ యనుటయు నాతండు
    గారవమున నతనిఁ జేరఁ బిలిచి. (440)
|| ఒక్క కరంబు మలంచి కౌఁగిలించుకొని యచ్చట నున్న రక్షకాదిజనంబుల నవులం బోవం బనిచి
యతనితో ని ట్లనియె. (441)
|| నీదెసఁ గోపింతునె కుల
    భేదముగాఁ బలుకుటయును బిడ్డల జెఱుపం
    గా దని కినియుదు లేదన
    రా దలఁతును నిన్ను నిష్టరంపుఁ బలుకులన్ (442)
|| అది శిక్షగాని రోషంబు గా దట్లుం గాక. (443)
|| నీయుదయము దైవికగ
    ర్భాయత్తము నీకు మర్త్యు అలసదృక్షులు కౌం
    తేయుఁడవు కాని విను రా
      ధేయుండవు కావు ధీరవిచారా. (444)
|| ఇది కృష్ణద్వైపాయనుండు నాకు నేకాంతంబున నెఱింగించె నేనును భవదీయ
తేజోవిశేషంబువలననుం గనుంగొనియుండుదుఁ బాండుతనయుండ వగుటంజేసి నీ యెడ
వాత్సల్యంబ కాని మాత్సర్యంబు లే అదొక్కటి చెప్పెద విను మేను గురుపాండవుల వైరం బుడిపి
పుచ్చితి నప్పాండవేయు లజయ్యు లప్ర మేయుండగుకృష్ణుండు వారికి విధేయుండు కావున
వారలతోడివిరోధం బొప్పదు నీవును నొండుదలంపు దక్కి యక్కౌంతేయులం గలిసి యుండు
మనినఁ గర్ణుం డతని కి ట్లనియె. (445)

4. ముగ్గురు భీష్ముడు; ద్రోణుడు; కర్ణుడు

5. 1.మోసకారి 2.సోమరి 3.పిరికిపంద 4.నపుంసకుడు 5.దొంగ 6.కృతఘ్నడు 7.నాస్తికుడు సం.ఉద్యోగపర్వము            38-74శ్లోకము
శ్లో॥ శ్రీ ధూర్తకే2లసే భీరౌ షండే పరుషమానిని
      చోరే కృతఘ్నే విశ్వాసో నకార్యో నచ నాస్తికే|| (74)
**********************************************************************************************
 

No comments:

Post a Comment