తెలుగు సుద్దులు…..(138)
ఆ.వె॥వెలది చక్కదనము వెరవై`న యీడును
విభుని కరుణలేక వితగ నుండు;
నీదు కరుణలేక నేర్పులు కొరగావు!
విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః
స్త్రీ అందము, జాణతనము, ప్రాయము
(పరువము, యౌవనపు వయస్సు) భర్త ఆదరించకపోతే, గుర్తించక పోతే నిరర్ధకమవుతాయి.
అలాగే, ఓ
పరంధామా నీ దయ (అనుగ్రహం) లేకపోతే ఏ జాణతనములు, తెలివితేటలు, నేర్పరితనములు ఎందుకూ పనికిరావుగదా? కనుక, ప్రతివ్యక్తి అన్నింటికి మూలమైన పరమాత్ముని కరుణకు కూడా పాత్రులవండని వేమన హితవు పలుకుతున్నారు. (నాటి పరిస్థితులకు అనుగుణంగా భర్త గుర్తించకపోతే నిరర్ధకమవుతాయని చెప్పి ఉండవచ్చు!!) ||21-01-2015||
No comments:
Post a Comment