తెలుగు సుద్దులు…..(135)
ఆ.వె॥అంత కొరత దీరి యతిశయ కాముడై
నిన్ను నమ్మి చాల నిష్ఠ తోడ
నిన్ను గొల్వ ముక్తి నిశ్చయముగ గల్గు
విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః
ఓ పరాత్పరా! మోహవాంఛలన్నిటిని చక్కబెట్టి, ప్రక్కనబెట్టి,
విరాగిగా అధికమైన కోరికతో నిన్నే నమ్మి చాలా నిష్ఠతో (ధృఢసంకల్పంతో, వేరేధ్యాసలేకుండా) నిన్నుసేవించినచో (నీకే అంకితమైనచో) ముక్తి తప్పక కలుగుతుంది. వేమన ఈ పద్యంలో, ముక్తి పొందడానికి మానవునకు కావలసిన
లక్షణాలను లేదా దారి చెప్పినట్లున్నది. ||13-01-2015||
No comments:
Post a Comment