తెలుగు సుద్దులు…..(136)
ఆ.వె॥తత్వము తిరమై`న తావుల వెదుకుచు
తాను తత్వమగును తత్వయోగి
తలపుల`న్ని యుడుగ తానె పో తత్వంబు
విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః
పరమాత్మ నిలకడగా ఉండే స్థానాన్ని శోధిస్తూ, శోధిస్తూ పరమాత్మ తనలోనే ఉన్నాడనే పరమసత్యాన్ని గ్రహించిన సిద్ధుడు, పరిపక్వమైన, నిర్దోషమైన, సంపూర్ణమైన యోగి తానే దైవ స్వరూపుడగును. ఐహిక (ఇహలోకపు) ఆలోచనలు, ద్వందాలను గురించి ఆలోచించడం విడిచిపెట్టగానే తానే పరమాత్మ తత్వమును పొందుతాడుగదా! ఈ పద్యంలో వేమన ఒక పరమయోగిగా తమ స్వానుభవముతో పరమాత్మ తత్వమును తెలుసుకొనడం ఎలాగో తెలిపుతున్నారు. ||17-01-2015||
No comments:
Post a Comment