తెలుగు సుద్దులు…..(132)
ఆ.వె॥ఒకరి నోరు గొట్టి యొకరు (యొనర)* బక్షింతురు,
వారి నోరు మిత్తి వరుస గొట్టు;
చేప పిండునే`ల (చేపపిల్లను భువి)* చేపలు చంపును?
జనుడు (వాని బట్టి)* చేప పిండు జంపు వేమ!
*పాఠాంతరము
భావముః
ఒకరు నోరుగొట్టి మరొకరు తింటుంటారు, (అన్యాయంగా సంపాదించి జీవిస్తుంటారు). కాని వారినోటినీ మృత్యువు తదుపరి కబలిస్తుంది. ఎలాగంటే చేపల సమూహాన్ని చేపలు చంపలేకపోయినా వాటిని మనిషి పట్టుకొని చంపుతాడు. అనగా మరణము తప్పదు సుమా! ధార్మికంగా జీవించండి అని వేమన హితవు పలుకుతున్నారు. పాఠాంతరాలను గ్రహిస్తే అల్పులను బలవంతులు భక్షింతురు
సుమా (చిన్న జీవిని
పెద్ద జీవి పట్టుకొని తింటుంది; చిన చేపను పెద చేప మ్రింగుతుంది!)
గుర్తెరిగి మసులుకోండి అని కూడా హితవు పల్కుతున్నట్లున్నది. ||07-01-2015||
No comments:
Post a Comment