Translate

28 January, 2015

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి- 051 (251 – 255)




ఓం గణేశాయనమఃగురుభ్యోనమః
                                                                         __/\__       
నారాయణం నమస్కృత్య  – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]



1. భూరిశ్రవుడెవడు? ఎవరి చేతిలో చనిపోయాడు?
2.
భారత యుద్ధంలో కౌరవుల మొదటి సైన్యాధ్యక్షుడెవరు? ఎన్నిరోజులు చేశాడు?
3.
ఒక్కరిని రక్షించుకొంటే చాలు అని దుర్యోధనుడు యుద్ధానికి ముందు కౌరవులకు చెపుతాడు, ఒక్కడూ   
       ఎవరు?
4. విచిత్రవీర్యుని భార్యలెవరు?
5. యుద్ధం ఎన్నిరోజులైన తరువాత సంజయుడు వచ్చి ధృతరాష్ట్రునకు వివరించి చెప్పాడు?
--------------------------------------------------------------------------------
సమాధానములు (జవాబులు):
1. భూరిశ్రవుడు సోమదత్తుని కొడుకు- బాహ్లికుని మనుమడు; సాత్యకి చేతిలో 14వ రోజు యుద్ధంలో చనిపోయాడు.  ద్రోణపర్వము చతుర్థాశ్వాసము 273 వచనము
అన్నరపతి నరకంబునం బడం గలవాఁడు నీవుసద్గతిం బొందు మనవుడునతండు శైనేయు విడిచి యపసన్యకరంబున శరంబులు పఱుచుకొని ప్రాయోపవేశనమతి నుండి ప్రాణాయామపరాయణుండై యోగయుక్తుండయ్యె నంత నొడలి కుత్సాహంబు వచ్చి లేచి సాత్యకి కరవాలం బమర్చికొని మాధవధనంజయభీమాశ్వత్థామకృపకర్ణులు వలదు వల దని యెలుంగెత్తి వారింపఁ గ్రోధోన్మాదంబున శిరశ్ఛేదనంబుచేసిన భూరిశ్రవుండు సిద్ధచారణగణాభినందితుం డగుచుఁ బుణ్యలోకంబున కరిగె నాశినివరుండు తన్ను వారించిన వారల నుద్దేశించి యభిమన్యు వధ ప్రకారంబుపన్యసించె నప్పుడు మనసైనికు లిట్టు దగునే యనువారును గోపంబేమిజేయింప దనువారును నతనిచేతఁ బడినవాఁ డుడుగునే యనువారును నిది విధివశంబు పొమ్మనువారును నై రనిన విని ధృతరాశ్ట్రుండు సంజయున ట్లనియె. (273)

2. భీష్ముడు 10 రోజులు. - ద్రోణపర్వము ప్రమాశ్వాసము 20 పద్యము
|| పిలువుఁడు యక కర్ణుని
      బలవిక్రమశాలి యతఁడు పదిదివసములుం
      గలనికి రాఁడు నదీసుతు
      పలుకులకుం గనలి సచివబంధుయుతముగాన్. (20)

3.
భీష్ముడుః భీష్ముని రక్షించుకొంటే అతని ముందెవరూ బ్రతుకలేరని దుర్యోధనుని అభిప్రాయము. అందుచే శిఖిండి కంటబడకుండా భీముని కాపాడుమని తమ్ములకు చెపుతాడు. భీష్మపర్వము ప్రమాశ్వాసము 76 పద్యము.
|| కన్నాకు మనకు భీష్ముం
      డిన్నరవరుఁ గావవలయు నెమ్మెయి నైనం
      దన్నుం గాచిన నితఁడు
      గన్నుతముగ రణమునం బగఱ నడఁగించున్. (76)

4. కాశీరాజు పుత్రికలు అంబిక, అంబాలికలు ఉద్యోగపర్వము చతుర్థాశ్వాసము  274&277  
    వచనములు; 276 పద్యము
ఇవ్విధంబునం జని యమ్మహోత్సవంబున నలంకృత లై యున్నయంబయు నంబికయు నంబాలికయు వనుముద్దియల మువ్వురం బట్టి రథంబుపయిఁ బెట్టికొని రా నచ్చటిరాజు లెల్లను జతురంగబలంబులతో వచ్చి నన్నుం బొదివినఁ బటువిశిఖానలశిఖాకలాపంబున వేఁడిమి సూపి వారి నిలువరిమ్చి యరుగుదెంచి సత్యవతికి నప్పొలంతుల నొప్పించిన నద్దేవి విచిత్రవీర్యునకువారలవివహంబుసేయ నుద్యోగించె నట్టియెడ నమ్మువ్వురయందుం బెద్దయది యైనయంబ యను కన్యక నాతో ని ట్లనియె. (274)
అన విని సత్యవతికిఁ జె
    ప్పిననయమ వనుప నంబఁ బెంపుగ వృద్ధాం
    గనలం దోడుగ నప్పుడ
    పనిచి యనిచితిని జనంబు ప్రస్తుతి సేయన్. (276)   
ఇట్లు పనిచి తక్కినకన్నెల నిరువురమ్ బాణిగ్రహణంబు సేయించితి. (277)

5.
పది రోజుల తరువాత. - భీష్మపర్వము ప్రమాశ్వాసము 64 వచనము.
|| అని పలికి సంజయుకరంబు విడిచి కయ్యం బెయ్యెడం బొడిచిరి పదిదినంబులు నుభయబలంబువారును నెవ్విధంబున మోహరించి రెవ్వ రెవ్వ రెప్పు డెప్పుడేమి సేసి రిన్నాళ్లు గాంగేయుఁ డెబ్భంగులసంగరంబుసేసెఁ దుది నెత్తెఱంగునం దెగియె నంతయు వివరించి పరిపాటిం దేటపడం జెప్పుము. (64)

****************************************************************************************

No comments:

Post a Comment