Translate

26 January, 2015

తెలుగు సుద్దులు - వేమన పద్యములు (తెలుగు - ఇ కూటమిలో పెట్టబడినవి) -140



తెలుగు సుద్దులు…..(140)
కం||ఎన్నాళ్లను దానుం`డును
         యెన్నాళ్లును దాను నేర్చి యెన్నిట వెలయున్
         కొన్నాళ్లకు దా జన్నను
         మన్నా`యెను విద్యలెల్ల మహిలో వేమా!        
భావముః                       
మానవుడు తానెంత కాలము జీవిస్తాడు? తానేర్చిన విద్య, వృత్తులలో ప్రావీణ్యములతో మనగలుగుతాడు? కొంతకాలానికి తానుఅనే భావము, ఆలోచన కల్పిస్తున్న తోలుతిత్తి (శరీరము), దానితోపాటే తను సంపాదించాననుకున్న విద్యా నైపుణ్యాలు మట్టిలో కలిసిపోతాయి (మరణిస్తాడు). అనగా అమాయక మానవుడు
శాశ్వతమని భ్రమపడేవి ఏవి శాశ్వతములు కావని గ్రహించమని వేమన హితవు పలుకుతున్నారు. ||25-01-2015||

No comments:

Post a Comment