Translate

13 January, 2015

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి- 045 (221 – 225)



ఓం గణేశాయనమఃగురుభ్యోనమః
                                                                         __/\__       
నారాయణం నమస్కృత్య  – నరంచైవ నరోత్తమమ్|


దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]
1. ఏడుగురిని ఇంట్లో ఉండనీయరాదు, ఎవరా ఏడుగురు?
2.
కృష్ణుడు రాయబారంలో కంసవధను గురించి చెప్పాడు ఎందుకు?
3.
భూమి మీద బంగారు పూలు పూయించగలవారు ముగ్గురున్నారు, ఎవరు వారు?
4.
అలా అయితే నేవచ్చిన పని సఫలమయినట్లే అన్నాడు సంజయుడు, రాయబారం నుండి తిరిగి
     హస్తినకు వెడుతూ, ఎందుచేత?
5.
ఉన్నతిని కోరేవారు ఆరింటిని విడిచి పెట్టాలిట ఆరూ ఏవి?
--------------------------------------------------------------------------------
సమాధానములు (జవాబులు):
1. 1)
సోమరి 2) తిండిపోతు 3) నిందితుడు 4) మాయావి 5) క్రూరుడు 6) దేశకాలాలు తెలియనివాడు
     7) అసహ్య వేషం వేసేవాడు సం. ఉద్యోగపర్వము 37 55
శ్లో|| అకర్మ శీలంచ మహాశనంచ లోకద్విష్టం బహుమాయం నృశంసమ్
     అదేశకాలజ్ఞ మనిష్టవేష మేతాన్ గృహే నప్రతివాసయేత|| (55)

2. దుర్యోధనుని బహిష్కరిద్దామని కులంలో కంసుడొక్కడూ దుష్టుడయితే అతనిని నేను వధించి కులాన్ని   
    రక్షించాను. అలాగే దుర్యోధనుని తొలగించి కులాన్ని రక్షించవచ్చునని చెపుతాడు కృష్ణుడు. - ఉద్యోగపర్వము       తృతీయాశ్వాసము 378& 379 పద్యములు
శా|| ఈదుర్యోధనుఁ డింతగర్వి యగునే యీయున్న వా రెల్ల నా
      చే దైన్యంబునఁ బొందు టొప్ప దని చర్చింపండ యీభంగికిన్
      లేదే యొండుదెఱంగు సత్కులముఁ బాలింపగ వర్జిప రా
      దే దుష్టాత్మకు నీచు నొక్కరునిఁ బోదే భేద మీజాతికిన్. (378)
|| కంసుఁడు నిట్ల తండ్రిమది గందెడుచంద మొనర్చి ధర్మ వి
     ధ్వంసము సేసినం గులమువారలు నా కెఱిఁగింప నేను దు
     ర్మాంసము గోయువైద్యుని క్రమంబున నాతనిఁ ద్రుంచి యన్వయో
     త్తంసముఁ జేయనే జనకుఁ దద్విధ మొప్పదె మీరుఁ జేసినన్. (379)

3. 1) శూరుడు 2) సర్వవిద్యాప్రవీణుడు 3) సేవించడం తెలిసినవాడు - సం. ఉద్యోగపర్వము 35 74
శ్లో|| సువర్ణపుష్పాం పృధివీం చిన్వన్తి పురుషాస్త్రయః
     శూరశ్చ కృతవిద్యశ్చ యశ్చ జానాతి సేవితుమ్|| (74)

4. రాయబారపు పనిమీద నేనే వస్తానని కృష్ణుడన్నాడు. - ఉద్యోగపర్వము ప్రథమాశ్వాసము
    360
పద్యము & 361 వచనము
|| నీపనికై వచ్చెదఁ
    దా నొప్పఁ దలంచె నొండెఁ దప్పం దలఁచెన్
    దానన నెగడెద మే
    మ్మానవనాథునకుఁ జెప్పు మామత మెల్లన్. (360)
|| అనిన విని సంజయుండు ధర్మ తనయుం గనుంగొని ట్లయినను గడు లెస్సగదా దేవా
నావచ్చినకార్యంబు సఫలంబయ్యెఁ బనివినియెదనని వాసుదేవునకు నట్ల విన్నవించి……. (361)

5. నిద్ర అలసట భయం కోపం సోమరితనం దీర్ఘసూత్రత - - సం. ఉద్యోగపర్వము 33 78
శ్లో|| షడ్దోషాః పురుషేణేహ హతవ్యా భూతిమిచ్ఛతా
     నిద్రా తంద్రా భయంక్రోధ ఆలస్యం దీర్ఘసూత్రతా|| (78)

***********************************************************************************************
 

No comments:

Post a Comment