Translate

21 January, 2015

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి- 048 (236 – 240)



ఓం గణేశాయనమఃగురుభ్యోనమః
                                                                         __/\__       
నారాయణం నమస్కృత్య  – నరంచైవ నరోత్తమమ్|


దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]
1. ద్రోణుని తండ్రి ఎవరు?
2. విచిత్రవీర్యుని అన్నగారి పేరేమి?
3. తెలుగులో కవిత్రయ మంటే ఎవరు?
4. జాంబవతి కొడుకు పేరేమి?
5. పాండవులు ఊరిలో ఉండి కౌరవులతో రాయబారాలు సాగించారు?
----------------------------------------------------------------------------------
సమాధానములు (జవాబులు):
1. భరద్వాజుడు ఆది పర్వము తృతీయాశ్వాసము - 78 పద్యము; పంచమాశ్వాసము - 195 పద్యము.
|| అనఘుఁడు సురగురు నంశం
   బునను భరద్వాజు కలశమునఁ బుట్టె శరా
   సన విద్యాచార్యుఁడు భూ
   వినుతుఁడు ద్రోణుండు నిఖిల వేదవిదుండై. (78)
(
భరద్వాజుడు ఒకరోజు స్నానానికి గంగకి వెళ్ళినపుడు అక్కడ జలక్రీడలాడుతున్న ఘృతాచి అను అప్సరసను చూచి అతిగా కామించడము వలన వీర్యస్కలనము జరుగగా, దానిని తెచ్చి ఒక కుండలో భద్రపరచగా ద్రోణుడుద్భవించెను.)
తే|| తనకు శుక్ల పాతం బైనదానిఁ దెచ్చి
    ద్రోణమున సంగ్రహించిన ద్రోణుఁడనగఁ
    బుట్టె శుక్రునంశంబునఁ బుణ్యమూర్తి
      ధర్మతత్వజ్ఞుఁడై భరద్వాజమునికి. (195)

2.
చిత్రాంగుదుడు ఆదిపర్వము చతుర్థాశ్వాసము 114 వచనము
. యాశంతనునకు యోజనగంధి యయిన సత్యవతికిం జిత్రాంగద విచిత్రవీర్యు లనంగా నిద్దఱు గొడుకులు పుట్టి రందుఁ జిత్రాంగదుండు బాల్యంబున గంధర్వనిహతుండయిన వానికిం గొండొకవాని విచిత్రవీర్యు రాజ్యాభిషిక్తుం జేసి భీష్ముండు కాశీరాజదుహితల నంబికాంబాలికలనువారి నిద్దఱ విచిత్రవీర్యునకు వివహంబు సేసిన. (114)

3. నన్నయ, తిక్కన, ఎఱ్ఱన

4. సాంబుడు ఇతనికే దుర్వాసుని శాపం వల్ల ముసలం పుట్టి యదవ వినాశానికి మూలమయింది.

5. ఉపప్లావ్యము ఇది మత్స్యదేశంలో ఒక ఊరు. ఇక్కడ ఉండే అభిమన్యుని వివాహం కూడా చేసుకొన్నారు.  
    విరాటపర్వము పంచమాశ్వాసము 375 వచనము; 376 పద్యము; ఉద్యోగపర్వము ప్రథమాశ్వాసము – 272 వచనము
ఇవ్విధంబునం బ్రకాశు లై పాండునందనులు శమీవృక్షనిక్షిప్తసమస్తసాధనంబులుఁ బూజాపూర్వకంగాఁ దెచ్చుకొని యుపప్లావ్యంబున్ వసియించి మత్సమహీనాథుండు పంపు సేయం బెంపు మిగిలి పౌరజనపద (సమానీత) నానావిధోపహరంబులు గైకొనుచు బహురత్నంబులకు భజనంబు లై మహనీయవిభూతి శోభిల్లుచున్నంత వసుదేవుండు బ్లభద్రపురస్సరంబుగా సాత్యకి సమేతుండై సుభద్రాభిమన్యులం దోడ్కొని కృతవర్మయుం` బ్రద్యుమ్నుండును సాంబుడును యుయుథానుండును రుక్ముండును నక్రూరుండును నింద్రఏనాదిపాండవసారథులును రథారూఢు లై కొల్చి రా మఱియు ననేకయాదవకుమారులును గరితురగస్యందననిబిడంబు లగుబలంబులతోడ నిరుగెలంకుల నడవం జనుదెంచి. (375)
తేభవ్యవిభవంబుతో నుపప్లావ్యపురము
     సొచ్చిసంభ్రమమునఁబాండుసుతులుదనకు
     నెదురు వచ్చిన నాహ్లాద మెసకమెసఁగఁ
     దత్సమాగమయోగ్య్ విధంబు నడపె. (376)   
శాంతిప్రకారంబునం గార్యంబు నడపి యొక్కటి యై మనుట యొడంగూర్చి రమ్ము రథం బెక్కి పొ మ్మని తగినతెఱంగున వీడ్కొలిపిన సంజయుండునుం జని యుపప్లావ్యంబు సొచ్చి మాధవుమమ్దిరంబున కరిగి యభ్యంతరవినోదంబుల నరసహితుం డై యున్నయన్నారయణునకుం దనరాక యెఱింగించి పుచ్చి తగఁ బ్రవేశించి భయభక్తివినయసంభ్రమంబులు మెఱయ వారలం గాంచి యమ్మహాత్ము లిరువర సభావనంబులును సంభాషణంబులునుం బడసి సంప్రీత చేతస్కుం డై మఱునాఁడు ధర్మతనయునొడ్డోలగం బున్నసమయంబు వేచి సముచితంబుగా నతనిం గని సాష్టాంగంబుగాఁ బ్రణమిల్లిన నతండుం బ్రియ పూర్వకంబుగా నాదరించి తనసమీపంబున నునుచికొనినం గిలిచి యుండి యతని కి ట్లనియె. (272)
*******************************************************************************************
 

No comments:

Post a Comment