Translate

10 January, 2015

తెలుగు సుద్దులు - వేమన పద్యములు (తెలుగు - ఇ కూటమిలో పెట్టబడినవి) - 133



తెలుగు సుద్దులు…..(133)
.వెకనులు పోవువాడు కాళ్ళు పోయినవాడు
         ఉభయుల`రయ గూడి యుండినట్లు,
       పేద పేద గూడి పెనగొని యుండును     
       విశ్వదాభిరామ వినర వేమా!.         
భావముః
కన్నులు లేనివాడు, కాళ్ళు సరిగలేనివాడు (అవటివారు వికలాంగులు) ఒకరికొకరుతోడుగా, చక్కటి అవగాహనతో కలసి మెలసి యుంటారు.  అలాగే, పేదవారు కూడా ఒకరికొకరు పెనవేసుకొని జీవిస్తుంటారు. ఏ జాతి పిట్ట ఆ జాతి పిట్ట దరిచేరును (ఏ పక్షి ఆ పక్షి గూడు చేరును) అని అంటారు కదా పెద్దలు. బహుశా, వేమన ఇక్కడ అంగవైకల్యమును, పేదరికమును పరమేశ్వర (ఆత్మ) తత్వము తెలియని వారికి అన్వయించినట్లున్నది. ఆత్మ జ్ఞానములేని మూఢులు అదే స్థిలో జీవితము వెలిబుచ్చడానికే ఇష్టపడతారనట్లు చురకంటించినట్లున్నది. ||09-01-2015||

No comments:

Post a Comment